🙏శివానందలహారీ🙏
కరోమి త్వ త్పూజా0 సపది సుఖదో మే భవ విభో !
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా:ఫలమితి
పునశ్చ త్వా0 ద్రస్టు0 దివి భువి వహన్ పక్షిమృగతా
మదృష్ట్వా తత్ ఖేదం కథ మిహసహే శంకరవిభో !
పరమేశ్వరా ! నిన్ను పవలు రేయందున
భక్తితో నర్చింతు ముక్తి కొఱకు
ఫలితంబుగా నాకు బ్రహ్మత్వమునుగాని
విష్ణుత్వ మీయంగ వేడలేను
యారీతి నీవీయ హంస రూపముగాని
పంది రూపము గాని పొంది నేను
శిరసు పాదంబులన్ చేరుట కొఱకును
దివి భువి మార్గాల తిరుగవలయు
అట్లు నినుగాంచజాలక యలసి సొలసి
చింతలోనుండి బ్రతుకగ చేతగాదు
యీశ్వరా ! యట్టి దశ నాకు నీయవలదు
భక్త మందార ! పశుపతే ! పాప నాశ ! 23 ***
కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై:
వసన్ శంభో రగ్రే స్పుటఘటిత మూర్థా0జలిపుట:
" విభో ! సాంబ ! స్వామిన్ ! పరమశివ ! పాహీతి " నిగదన్
విధాతౄణా0 కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః
కైలాసశిఖరాన కాంచనసౌధాన
ప్రమథగణ సమేత భాసుడైన
పరమేశ్వరుని దివ్య పావన సన్నిధిన్
చేతులు జోడించి చేరి నిలచి
నవనిత శిరసుతో నత్యంత భక్తితో
తనువెల్ల పులకించ దర్శనమున
" పశుపతీ ! యీశ్వరా ! పాహిమాం ". యనుచునూ
భక్తితో యెలుగెత్తి పలుకుచుండి
దివ్యమైనట్టి యానంద స్థితిని పొంది
భక్తిభావంబు నందున పరవశించి
నిమిషముగ బ్రహ్మకల్పాల నెంచి మదిని
యెపుడు గడుపుదు నీశ్వరా ! యెఱుగ నైతి . 24 #
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి