*🧘♂️మాస్టర్ ఇ.కె. గారి సందేశము🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
*రామకృష్ణ పరమహంసకి గొంతులో కేన్సరు వచ్చిందట, రమణమహర్షికి కూడా కేన్సరు వచ్చిందట పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంగా పీడిస్తుందని కొందరు చెబుతారు. మరికొందరు రామకృష్ణ పరమహంసనీ, రమణమహర్షిని అవతార మూర్తులు అంటారు. ఇదంతా గందర గోళంగా ఉంది. ఇలాంటి విషయాలను గూర్చి ఏమని అర్థం చేసుకోవాలి?*
*వ్యాధులు, బాధలు గలవారు సిద్ధపురుషుల దర్శన, స్పర్శన సాన్నిధ్యములు అనుభవించుట వల్ల వీలైనంత వరకు తొలగిపోవటం లోకానుభవసిద్ధమే. అలా వారికి తొలగినపుడు అవి ఆ సిద్ధ పురుషులకి సంక్రమిస్తాయి అన్నది కూడా వాస్తవమే. కాని ఇది సిద్ధ పురుషులందరి యెడల సత్యం కాదు. వారు వారు సాధించిన మార్గంలోని సంకల్పాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క యోగసిద్ధుడు రోగార్తులను ఆశీర్వదిస్తూ అది తాను స్వీకరిస్తున్నాను అని నమ్ముతాడు. ఇలా నమ్మటం అతనిలో మిగిలి ఉన్న అహంకారాన్ని సూచిస్తుంది. మరియొక సిద్ధపురుషుడు తనలో ఉన్న పరమాత్మ నామం వల్ల రోగార్తుల బాధలు తొలగిస్తాడు. అట్టి వానికి ఏమీ అంటవు. కనుక సంక్రమించవు. శ్రీ చంద్రశేఖరసరస్వతి స్వామి,ఆనందమయి మా... లాంటివారు మున్నగువారు ఈ తరగతివారు.*
*పై రెండు తరగతులలో మొదటి తరగతి వారు బట్టలు ఉతికి ఆ నీళ్ళు ఒక తొట్టిలోనికి పట్టినట్లు చేస్తారు. మరొక తరగతివారు విద్యుత్ ప్రసారాన్ని రాగి తీగెలు ప్రసరింపచేసినట్లు చేస్తారు. మొదటి తరగతి వారి సంకల్పం వల్ల బాధలు వారికి సంక్రమిస్తాయి. రెండవ తరగతి వారి సంకల్పం వల్ల తమలో నుండి ప్రవహించి సూర్యరశ్మి ద్వారా అంతర్యామిలోనికి అంతరిస్తాయి. కాబట్టి ఆయా సాధన మార్గాలను అనుసరించి సిద్ధులకు వ్యాధులు సంక్రమించటం, సంక్రమించకపోవటం ఉంటుంది.*
*ఇన్ని చెప్పినా అప్పటి మానవజాతి యొక్క దుష్ఫలితాలు మాత్రం ఏ సిద్ధపురుషుని మీదుగాను వెళ్ళక తప్పదు. వాటి పరిణామాలే జీససు సిలువ వేయబడటము, కృష్ణుడు బాణంతో కొట్టబడటం, గాంధీ పిస్టలుతో పేల్చబడటం మొదలైనవి. ఈ తరగతికి చెందినవే రామకృష్ణ పరమహంస, రమణమహర్షి కేన్సరు మొదలైనవి.*
*గర్భిణియైన స్ర్తీకి తన గర్భంలో భాగాలే శిశువు రక్షణకి మావి, పొరలుగా ఏర్పడుతాయి. కాని అది అనారోగ్యకరమైన శిశువైతే తల్లి శరీరంలో పెరిగిన భాగాలే సెప్టిక్ విష సంక్రమణం మొదలైనవి జరిగి తల్లి శరీరానికి విపత్కరంగా పరిణమిస్తాయి. ఈ విధంగా నాలుగు ప్రక్కల కలిసి సమన్వయించుకుంటేనే గాని పెద్దల జీవితాలను గురించిన రహస్యాలు సవ్యంగా బోధపడవు. ఇంతకీ సత్యం అనేది నిదానించి చూచిన వాడి సొత్తు.*
🕉🌞🌏🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి