10, నవంబర్ 2020, మంగళవారం

_పుష్కరాలు_

 🙏 *_పుష్కరాలు_* 🙏


పుష్కరుడు అనే మహా భక్తుడు మహేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఎం వరం కావాలో కోరుకొమ్మన్నాడు.


అందుకు పుష్కరుడు...


" స్వామీ నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోయాయి. ఆ నదులని పునీతము చేయుటకై నీ జలమైన శరీరమును నాకిమ్ము , నీ స్పర్శ తో నదులన్నీ పునీతమౌతాయి అని వరం కోరాడు.


ఆ తరువాత బృహస్పతి( గురుడు) కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వులకు ఆధారము కావాలని తపము చేసాడు. 


బృహస్పతి తపసుకు మెచ్చి శివుడు, తనకిచ్చిన వరాన్ని గురునికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆపై బ్రహ్మ గురించి గురుడు తపము చేసి తన కోరికను తెలియజేశాడు. 


అప్పుడు బ్రహ్మ 12 జీవనదులలో సంవత్సరానికొక్కసారి 12 రోజులు పుష్కరుడుండునట్లు , గురుడు ఒక్కో రాశిలో సంచారము బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దర్ని శాంతపరిచాడు .


గురుడు

1 మేష రాశిలో ఉంటే గంగా నది పుష్కరాలు

2 వృషభ రాశిలో ఉంటే నర్మదా నద పుష్కరాలు

3 మిధునంలో ఉంటే సరస్వతీ నది పుష్కరాలు

4 కర్కాటకం లో ఉంటే యమునా నది పుష్కరాలు

5 సింహ రాశిలో ఉంటే గోదావరి నది పుష్కరాలు

6 కన్యా రాశిలో ఉంటే కృష్ణ నది పుష్కరాలు

7 తులా రాశిలో ఉంటే కావేరి నది పుష్కరాలు

8 వృశ్చికంలో ఉంటే భీమా నది పుష్కరాలు

9 ధనూరాశి లో ఉంటే తపతి నద పుష్కరాలు

10 మకరం లో ఉంటే తుంగభాద్ర నది పుష్కరాలు

11 కుంభ రాశిలో ఉంటే సింధూ నది పుష్కరాలు

12 మీన రాశిలో ఉంటే ప్రాణహిత పుష్కరాలు


మనిషి తాను జన్మించిన దగ్గర్నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటారు. పుష్కర స్నానం చెయ్యడం ద్వారా సమస్త పాపాలు పోతాయని మహాభారతం లో వ్యాసభగవానుడు చెప్పారు.


*జన్నప్రభృతి యత్పాతం స్త్రియా వా పురుషేణ వా౹౹ పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి ౹౹*


స్త్రీ చేత కానీ పురుషుని చేత కానీ పుట్టినప్పటి నుంచి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది.


పుష్కర సమయంలో మనమే కాదు,

ముక్కోటి దేవతలూ భూమిమీదకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు.


పుష్కర స్నానం వల్ల, అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు.


బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వలన పొందిన బ్రహ్మహత్యా పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు.


🙏 *_ఓం నమో నారాయణాయ_* 🙏

కామెంట్‌లు లేవు: