🙏శివానందలహారీ 🙏
ఉపేక్షా నోచేత్కింన హరసి భవద్ధ్యాన విముఖాం
దూరాశాభూయిష్టా0 విధిలిపి మశక్తో యది భవాన్
శిరస్తద్వైధాత్రం స నఖలు సువృత్త0 పశుపతే
కథంవా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితమ్
తాత్సార మేలయ్య ? తరుణేందుశేఖరా !
కరుణేక్షణలనన్ను గావుమయ్య
త్వన్మధు నామంబు తలపని దుష్టుడన్
నా లలాటము మీది నలువ లిపిని
భవదీయ కరముచే బలవంతముగ నైన
విశ్వేశ ! తుడువుము వేగిరముగ
సర్వేశ ! యారీతి సాధ్యంబు కాదని
భక్తుడౌ నాతోడ బలుక బోకు
మటుల గాకున్న నాడు దురాగ్రహమున
ధాతృ పంచమ శిరమును తగు బలాన
చేతి గోటితో నేరీతి చెండి తీవు ?
నీకు సాధ్యంబు గానిదింకేమి యుండు ? 15 # *
విరించిర్దీర్ఘాయు ర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్ష్యం న ఖలు భువి దైన్యం లిఖితవాన్
విచార: కో వా మాం విశద కృపయా పాతి శివ దే
కటాక్షవ్యాపార స్స్వయ మపి చ దీనావనపరః
తరగగా మిగిలిన తలలు నాలుగు గల్గి
బ్రహ్మ నీచేతిలో బ్రతికి పోయి
దీర్ఘాయువును పొంది తేజరిల్లుచు నుండి
సృష్టి కార్యంబును చేయుచుండె
మావంటి కొందఱి మనుజుల నొసట తా
వదలక దైన్యమున్ వ్రాయుచుండె
నరయగా మాకది నుపకార మెట్లగు ?
నుపకారముగ మాకు నుండు నెపుడు
దైన్య మొందియు మేమున్న తరుణ మందె
దీన రక్షణ జేసెడి దీక్ష నున్న
విమలమౌ తావక కటాక్ష వీక్షణంబు
రక్షణము సేయు మమ్ముల తక్షణంబు 16 #
✍️ గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి