31, డిసెంబర్ 2020, గురువారం

యజ్ఞం - ఓ పవిత్ర కార్యం

 🔥🔥🔥🔥🔥

యజ్ఞం - ఓ పవిత్ర కార్యం.

🔥🔥🔥🔥🔥

'యజ్ఞం' అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు. ‘యజ్ఞం’ అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనుదాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం.


మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో 'వేల్చినవి' దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. 


యజ్ఞ విధానం 

వైదిక యజ్ఞంలో అధ్వర్యుడు ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని యజ్ఞ కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక మంది అర్చకులు, పండితులు ఉంటారు. వేద మంత్రాలు చదువుతారు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువగాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాల నుంచి కొన్ని సంవత్సరాల వరకూ జరుగవచ్చు.


యజ్ఞాల్లో భాగంగా.. అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం,   సర్పయాగం, విశ్వజిత్ యాగం.. వంటి యాగాలున్నాయి. 

🔥🔥🔥🔥🔥

కామెంట్‌లు లేవు: