.
🙏 హరిః ఓమ్ 🙏
🌸🌻పద్యాల🌻తోరణం🌻🌸
🌹శు భో ద యం 🌹
ప్రాతఃస్మరణీయులు శ్రీమాన్
కూచిమంచి తిమ్మకవివరేణ్య
విరచిత
" చిరవిభవా ! శతకము "
🌼🌹🌼
-8- చంపకమాల :
శరశరదిందు కుంద
హరిచందన హార తుషార తారకా
దర ఘనసారవర్ణ వరదండ
శుకాంబుజపాణి వాణి యా
దరమునఁ బ్రోచుచోఁ గవికదంబము నిన్బ్రణుతించు ధన్యమై
చిరవిభవా ! భవా ! విజితచిత్తభవా ! యభవా ! మహాభవా🙏
టీకా :
( తెల్లని ..)శర(..ము) = ఱెల్లు ,
శరత్(..కాలపు) , + ఇందు = చంద్రుడు ,
కుంద = మొల్ల పూవు ,
హరిచందన(..ము) = వెన్నెల ,
హార(..ము) = ముత్యాల దండ ,
తుషార(..ము) = మంౘు ,
తారకాదర = నక్షత్ర కాంతి , ఘనసార(..ము) = కర్పూరము మొ॥
వర్ణ(..ము గలిగి ) , వరదండ = జపమాల ,
శుక(..ము) = చిలుక , + అంబుజ(..ము) = పద్మము , పాణి = హస్తము(..నందు గల) , వాణి = సరస్వతీదేవి ,
(యా)ఆదరమునఁ , బ్రోచుచోఁ = కాచుట వలన , (గ)కవి(..యొక్క) , కదంబము =
(కావ్య..) సముదాయము , ధన్యమై ,
నిన్ = నిన్ను , (బ్ర)ప్రణుతించు = కీర్తించును ..
శివా ! ..
[ ఈ మకుటార్థము
ప్రతి పద్యమునకును అన్వయము ..
చిరవిభవా ! = శాశ్వతమైన విభవము గలవాడా ! , భవా ! = శివా !
< విజిత = జయించబడిన ,
చిత్తభవా ! = మన్మథుని గలవాడా > =
మన్మథుని జయించినవాడా ! (య)అభవా ! = (జనన మరణ
చక్రబంధ క్రమమున ..) జన్మ లేనివాడా !
మహాభవా ! = ౘచ్చి , పుట్టునటువంటిది కాని గొప్ప పుట్టుక కలవాడా = శాశ్వతుడా..]🙏
భావము : !
చిరవిభవా ! భవా !
విజితచిత్తభవా ! యభవా ! మహాభవా !
తెల్లని .. ఱెల్లు - శరత్కాలపు చంద్రుడు - మొల్ల పూవు - వెన్నెల - ముత్యాల
దండ - మంౘు - నక్షత్ర కాంతి - కర్పూరము మొ॥వాటి వర్ణము గలిగి .. జపమాల - చిలుక - పద్మము .. హస్తములందు గల సరస్వతీదేవి
ఆదరమున కాచుట వలన కవియొక్క
కావ్యసముదాయము ధన్యమై - నిన్ను కీర్తించును ..
శివా ! ..🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి