-: బ్రాహ్మణ కులం..శాఖలు..సమస్యలు:-
బ్రాహ్మణ కులం అంతా ఒకటేనని చాలా మంది అభిప్రాయం. కానీ బ్రాహ్మణులలో అనేక శాఖలు ఉన్నాయి.ఈ శాఖలు పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి.
బ్రాహ్మణ కులం ముఖ్యంగా వేదాల అధ్యయనం, ప్రచారం, పరిరక్షణ కొరకు ఏర్పడింది అని భావించవచ్చును.
వేదాల అధ్యయనం , పరిరక్షణ, ప్రచారం కొరకు ఉద్భవించిన బ్రాహ్మణ కులంలో అనేక శాఖలు ఏర్పడినవి. ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేసే వారు ఋగ్వేద బ్రాహ్మణులనీ,యజుర్వేదాన్ని పఠించే వారిని యజుర్వేద బ్రాహ్మణులు అనీ అలాగన్న మాట.ఉత్తర , దక్షిణ భారతదేశంలో అనేక శాఖలు ఏర్పడినవి. ప్రాంతీయ భేదాలతో కూడా అనేక ఉప శాఖ లు ఏర్పడినవి. పూజించే దేవుళ్ళు ,వృత్తి భేదాలు, భాషా భేదాలు, తదితరాలు ఇందుకు కారణం ఐనాయి. కాలక్రమంలో వివిధ సాంప్రదాయాలు కూడా పుట్టాయి. ఇవీ కొన్ని భేదాలకు కారణం ఐనాయి. ఇలా బ్రాహ్మణ కులం శాఖోపశాఖలుగా విభజనకు గురైంది.
ఈనాడు ఉత్తర, దక్షిణ భారతదేశంలో అనేక శాఖలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మళ్ళీ రాష్ట్రానికి ఒక్కో రకంగా విభజనలు ఉన్నాయి.
ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోఈ క్రింద చూపబడిన శాఖలు ప్రముఖంగా మనకు కనిపిస్తాయి.
* కొన్ని బ్రాహ్మణుల శాఖలు వాటి ఉప శాఖలు*
*ద్రావిడ శాఖ*
1) ప్రధమ శాఖ ద్రావిడ
2)ద్రావిడ
3)పేరూరు ద్రావిడ
4)పెద్ద ద్రావిడ
5)దిమిలి ద్రావిడ
6)ఆరామ ద్రావిడ
7)పుదూరు ద్రావిడ
8)కోనసీమ ద్రావిడ
9)ద్రావిడ వైష్ణవులు
10)తుమ్మగంటి ద్రావిడ
11)తుమ్మ ద్రావిడ
12)ద్రావిడ నియోగుల
*వైష్ణవ బ్రాహ్మణ శాఖలు*
1)శ్రీవైష్ణవులు
2)నంబులు
3)గోల్కొండ వ్యాపారులు
4)ఆచార్యులు
5)మర్థ్యులు
6)వ్యాపారులు
7)కరణకమ్మ వ్యాపారులు
8)బడగల కరణకమ్మ
9)మెలిజేటి కరణకమ్మ
10)దారుకులు
11)యజ్ఞవల్క్యులు
12)యజుశ్యాఖీయులు
13)బడగ కన్నడలు
14)నంబూద్రి బ్రాహ్మలు
15)వైఖానసులు
16)మధ్వలు
17)కాణ్వులు
18)కాణ్వేయులు
19)నియోగి వైష్ణవులు
*శివార్చక బ్రాహ్మణ శాఖలు*
1)మహారాష్ట్ర చిత్సవనులు
2)లింగార్చకులు
3)ఆదిశైవులు
4)శివార్చకులు
5)వీరశైవులు
6)మోనభార్గవ శైవులు
7)కాశ్యప శైవులు
8)శైవులు
9)ప్రధమ శాఖ శైవులు
10)రుద్ర శైవులు
11)పరమ శైవులు
12) శివ పూజారులు
13) శైవ స్మార్తులు
*నియోగి బ్రాహ్మణ శాఖలు*
1)ప్రధమ శాఖ నియోగి
2)ఆరువేల నియోగి
3)నందవరీక నియోగి
4)లింగధారి నియోగి
5)ఉంత్కఖ గౌడ నియోగి
6)ఆరాధ్య నియోగి
7)అద్వైత నియోగి
8)నియోగి వైష్ణవులు
9)పాకనాటి నియోగి
10)ప్రాజ్ఞాటి నియోగి
11)పొంగినాడు నియోగి
12)నియోగి ఆది శైవులు
13)యజ్ఞవల్క్య నియోగి
14)ఆరాధ్యులు
15)వేమనారాధ్యులు
16)తెలగాణ్యు నియోగి
17)కరణకమ్మ నియోగి
18)బడగల కరణకమ్మ నియోగి
19)కరణాలు
*వైదీక బ్రాహ్మణ శాఖలు*
1)వెలనాటి వైదీక
2)వెలనాట్లు
3)వెలనాటి పూజారులు
4)కాసలనాటి వైదీక
5)కాసలనాట్లు
6)ములకినాట్లు
7)ములకినాటి వైదీక
8)తెలగాణ్యులు
9)వేగనాట్లు
10)వేగనాటి వైదీక
11)వెలనాటి అర్చకులు
12)ప్రధమ శాఖ వైదీక
13)కరణకమ్మ వైదీక
తదితరాలు..
ఐతే ఇవన్నీ అంతర్ వివాహ సమూహాలుగా మనకు కనిపిస్తాయి. అంటే ఒక శాఖ వారు ఇంకో శాఖ వారికి తమ అమ్మాయిని ఇవ్వరన్న మాట. అనేక వివాహ వేదికలు విఫలం కావడానికి ఇదో కారణం.మా శాఖయే గొప్ప అంటే మా శాఖయే గొప్ప అనే ఛాందసవాదులూ ఉన్నారు.మధ్య యుగాలలో మా శాఖ యే గొప్పదని పరస్పరం పోరాడిన ఉదంతాలూ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఈ శాఖల వలన అనేక వాదాలు, వివాదాలు కూడా ఏర్పడటం మనం గమనించవచ్చు. వివాహాలు విఫలం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అనేక మార్పులు వస్తున్నప్పటికీ మరింత మార్పు బ్రాహ్మణ కులంలో రావలసిన అవసరం ఉంది. అసలే నిరుద్యోగం, రిజర్వేషన్ ల లేమి వలన సమస్యలు ఎదుర్కొంటున్న బ్రాహ్మణులు ఈ శాఖల వలన మరింతగా నష్టపోతున్నారని చెప్పవచ్చును.తమలోని శాఖా భేదాలను తొలగించుకొని మారుతున్న సమాజంలో తమవంతు పాత్ర పోషించి అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది.
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి