1, ఫిబ్రవరి 2021, సోమవారం

ప్రయాణం



ఒక వ్యక్తి  ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడ ప్రమాదానికి గురి అయింది. ఆ  ప్రమాదం నుంచి తప్పించుకుని  ఒక ద్వీపం దగ్గరకి చేరాడు.రోజూ భగవంతుడిని  ప్రార్థించుకుంటూ ఎవరైనా సహాయానికి కనబడతారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అతి కష్టంతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు. ఒక రోజు తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతూ  బయటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళి చూస్తే కష్టపడి కట్టుకున్న చిన్న గుడిసెకి చితిమంట అంటుకుంది. పొగ ఆకాశం వైపు వెళుతోంది. చాలా  నిరుత్సాహంతో,కోపంతో ఏడుస్తూ  “ఎందుకు ఇలా చేసావు” అని భగవంతుడిని అడిగాడు.మర్నాడు పొద్దున్నే ఓడ హారన్ వినిపించింది. ఇక్కడ నేను ఉన్నట్టు ఎలా తెలిసింది అని ఓడలోని  వ్యక్తులను అడిగాడు. “ఆకాశం లో పొగని చూసి, ఇక్కడ ఎవరో ఉన్నారు అని వచ్చాము అన్నారు వాళ్ళు.  ఆ ఓడలో ప్రయాణం చేసి ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకున్నాడు. 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *నీతి :* 

మనము అనుకున్నవి జరగనప్పుడు నిరుత్సాహ పడడం సహజం. మనం కష్టకాలంలో కూడా భగవంతుడిని నమ్ముకుని పూర్తి శరణాగతితో ఉంటే మనకి కావాల్సిన ధైర్యం, ఆలోచనా శక్తి , బలం అన్నీ  భగవంతుడు మనకి ఇస్తాడు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️☀️☀️☀️☀️☀️☀️☀️☀️🌼🌼🌼🌼🌼🌼🌼🌼

కామెంట్‌లు లేవు: