18, ఏప్రిల్ 2021, ఆదివారం

పరమశివుడు

 పరమశివుడు – పంచాక్షరి


ఆంధ్రదేశంలో కొంతమంది భక్తులు ఒక శివాలయం కట్టించారు. శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళాలని వారు ప్రయత్నించగా వారు దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేక పోయారు. వారు ఆశ్చర్యచకితులై ఆ విషయాన్ని పరమాచార్య స్వామివారికి చెప్పడానికి కంచి వచ్చారు.


స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తిరుచ్చి దగ్గర్లోని శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడేవారిని ఒకరిని తీసుకుని రావాల్సిందిగా చెప్పారు. వారు వైద్యనాథ శాస్త్రిగారి చెవిలో ఏదో చెప్పి ఆ భక్తులకి వారిని మీతోపాటు తీసుకువెళ్ళండి అని చెప్పారు.


వారి ఊరికి రాగానే శాస్త్రిగారు రోజూ వారి నిత్యానుష్టానం తరువాత గంటల తరబడి జపం చేసేవారు. అక్కడి కొద్దిగా కలవరపడ్దారు వాళ్ళ సమస్యను నివారించడానికి వారు ఏమి సలహా ఇవ్వలేదు అని. శాస్త్రిగారిని ఏమి అడగకుండా ఏమి జరుగుతుందో చూద్దామని ఊరకుండిపోయారు.


శాస్త్రిగారు ఆ ఊరు వచ్చిన 21వ రోజున జపం ముగించుకుని శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని రావాల్సిందిగా వారికి చెప్పారు. వారి దాన్ని చాలా తేలికగా కదిలించగలిగారు.


ఒక్క అడుగుకూడా ముందుకు కదలించడానికి కూడా వీలుకానంత బరువున్న ఈ శివలింగం ఇప్పుడు దూదిపింజలా చాలా తేలికగా ఉంది.


ఈ అద్భుతం ఏమిటో తమకు వివరించగలరని వారు శాస్త్రిగారిని వేడుకున్నారు. శాస్త్రిగారు వారితో తనకు కూడా ఏమి తెలియదని, పరమాచార్య స్వామివారు ఈ శివలింగం ముందు కూర్చొని ఇరవైయొక్క రోజులపాటు పంచాక్షరి జపించమని చెప్పారని అంతకు మించి తనకు ఏమి తెలియదని చెప్పారు.


పరమచార్య స్వామివారు ఈ 20వ శతాబ్ధంలో కూడా పంచాక్షరి మహామంత్ర గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూపించారు అప్పర్ కొన్ని శతాబ్ధాల క్రితం చూపించినట్టుగా.


అరవైమూడు మంది నాయనార్లలో నలుగురు నాల్వర్లుగా(అప్పర్, సుందరర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్) ప్రసిద్ధులు. అందులో ఒకరైన అప్పర్ ను శివద్వేషి అయిన జైనరాజు ఒక బండరాయికి కట్టి నదిలోకి తోసివేయించగా, నిత్యమూ పంచాక్షరి మహామంత్రమును జపించే అప్పర్ ను రక్షించడానికి ఆ రాయిని నీట మునగనివ్వక నీటిపైన తేల్చి రక్షించాడు పరమశివుడు.


పంచాక్షరీ మంత్రరాజం యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది. 'నమశ్శివాయ' అనే ఆ మంత్రంలో శివశబ్దం దాని జున్ను. పాపపరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: