I am నేను అనే మా రూప రహిత జీవ తత్వం. నామ రూప గుణం లేని ఆత్మ సంభోదన లేనియెడల వీనికి తెలియదు. అలాగే భగవత్ శక్తి కూడా రూప నామ గుణ లక్షణము లేనియెడల ఆత్మ తత్వం తెలియదు. మనకు తెలియుటకై అనగా మన భావన యే రూపం మన గుణం, రూపం యెుక్క నామం, మనగుణమే నామం. ఆత్మ కూడా దేహ దారుణమై ప్రకాశించిన గాని ఐ అనే ౦ పూర్ణ శక్తి జీవ రూపంలో తెలియదు. వుంటే కాదు అది యిది అని ఐ యామ్ నేను అనే ప్ర ఙ్ఞానాన్ని కలగాలి. దీనినే ఐం అనే సరస్వతీ బీజం. దీనికి ప్రణవం తోడు రావాలి దానికి ఏక శబ్ద శక్తి ఓం ఐం అనే సరస్వతీ బీజం. భాష ఏదైనా భావము వక్కటే.వసంత పంచమీనాడు ప్రకృతి స్త్రీ రూపంలో సరస్వతీ రూప వాక్కును బ్రహ్మ వశం చేయుట వలననే సృష్టికి వుపక్రమించినట్టు వేదం తెలుపు చున్నది. అంతవరకు ప్రకృతి రూప సరస్వతీ శబ్ద లక్షణం తెలియలేదు. అంతా మౌనంగానే సాధన. సాధన తెలియాలి అనగా పరిపూర్ణమైన ఙ్ఞానాన్ని ప్రకృతి ద్వారానే తెలియాలి. లేనియెడల శూన్యం. తెలుసుకుంటూ నే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి