15, మే 2022, ఆదివారం

గొంతెమ్మ కోరికలు

 *గొంతెమ్మ  కోరికలుపై ఓ చిన్న చర్చ*


కుంతికి విక్రుత నామమే గొంతి. కాలక్రమేణా అదె గొంతెమ్మ అయ్యింది. తనకు వరప్రసాదమైన కోరికను అనాలోచితంగా కుంతి కోరుకోవడంతో ఆమెకు వివాహానికి ముందే సూర్య భగవానుడి వల్ల కర్ణుడు జన్మిస్తాడు. అందువల్ల ముందుచూపు లేకుండా చేసే చర్యలు ఇబ్బంది పెడతాయని దీని భావన. 


అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధంలో తన ఇద్దరు కుమారులైన కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ బ్రతకాలని ఆమె కోరుకుంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి అటువంటి సాధ్యం కాని కోర్కెలను కోరుకునేవారిని గొంతెమ్మ కోరికలు కోరుకోవద్దని పెద్దలు సలహా ఇస్తుంటారు.


ఇదే జాతీయము, మరో నేపధ్యంతో కూడా ప్రచారంలో ఉండి ఉండవచ్చు. మన సాహితీ మిత్రులు అటువంటి కధనాలను వారి వారి సందేశాల ద్వారా మన సమూహ తోటి సాహితీ మిత్రులతో పంచుకోగలరు.  అటువంటి ఫోస్ట్ లు అవగాహనను మరింతగా పెంచేటందుకు దోహదం చేస్తాయి కూడా.

కామెంట్‌లు లేవు: