ఏమిటి అలా వెర్రివాలకం వేసుకుని ఆ మొహం మీరునూ. ఈరోజు కూడా నేను చెప్పిన మాట మర్చిపోయి చక్కా వచ్చారా! అంటూ ఆగ్రహంగా ఉరిమిచూస్తోంది భర్త వాలేశ్వరరావుని.
ఆ ఆ లేదు పర్వతం..అదీ అంటూ నసుగుతూ భయం
భయంగా ఏదో చెప్పబోయి మరేదో చెప్పేసాడు..
మరి వారికి అరెసెలూ, సున్నండలు చేయించమని చెప్పారే.
ఎవరూ ఆ చెప్పింది..మీక్కావలసినవన్నీ చేయించుకు తినమని చెప్పారూ ?
పిల్లని చూడ్డానికి ఎపుడొస్తారని అడిగి రమ్మంటే అరెసెలూ, అటుకులూ అంటారూ.
ఇదిగో అడిగి తెలుసుకునే వస్తున్నానే. వచ్చే బుధవారం సాయంత్రం వస్తారట. వస్తూ వస్తూ అబ్బాయికి
ఫలహారాలు ఏమి చేయించమంటారో అబ్బాయి మేనమామని అడిగి తెలుసుకుని అతనిని కూడా తప్పకుండా రమ్మని చెప్పే వచ్చాను. నీ బండబడ. అన్నిటికీ
కేకలేస్తుంటే ఎలా వేగేది..పర్వతం, శాంతం.
ఏమిటి నిజమే ఇవన్నీ?
అవుననే తలూపేసాడు వాలేశ్వరరావు.
హమ్మయ్యా ఇన్నాళ్ళకి ఓ మంచిపని చేసారు..ఇహ నేనూ
ఆ ఏర్పాట్లలో ఉంటాను. వాళ్ళకే కాదు మీకు ఇష్టమైన జాంగ్రీ, మిఠాయి కూడా సిధ్ధం చేస్తాను. ఈ రెండు రోజులూ
అక్కడకి, ఇక్కడకి వెళ్లకుండా వరాన్ని ఇంట్లో ఉండమని చెప్పండి అంది కాస్త కటువుగా పర్వతం.
ఆ అలాగే చెప్తాలే, వాలేశ్వరరావు
మరో రెండు రోజులు ప్రశాంతంగా నా జోలికి రాకుండా ఉండాలంటే అపుడపుడూ ఇలాంటివి తప్పవు మరి.
పెళ్ళి కొడుకు అమెరికా వెళ్లిపోతున్నాడు. ఇప్పట్లో రాలేనన్నాడని చెప్తే చంపేయదూ? . నన్ను పాతరేసేస్తుంది
ఆ బుధవారం ఏదో వచ్చాక ఆ సమయానికి బుధ్ధికి తట్టినట్టు చెప్పొచ్చు అనుకుంటూ కోర్ట్ కి బయలుదేరాడు వకీలు వాలేశ్వరరావు.
అతిథులకు రెండు రకాలు, నా కోసం మరో రెండు రకాలు సిధ్ధం చేస్తే అన్నీ ఇహ మనవేనోయ్ మనవేనోయ్. కార్ లో
కూనిరాగాలు తీస్తూ సాగిపోతున్నాడు....వవా....
డాక్టర్ దేవులపల్లి పద్మజ, విశాఖపట్నం
ఏ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి