*ॐ భద్రాద్రిరామ రక్ష - వేదవ్యాస మహర్షి*
*రామస్తామరసేక్షణోజలధరశ్యామః*
*కుమార్యా భువ*
*స్సంయుక్తః, పరమానురక్త మనసా*
*సౌమిత్రిణా సంయుతః I*
*అక్షాది ప్రతిపక్ష వృక్ష విచరాధ్యక్షే*
*సమీక్షారతః*
*శంఖారీషు శరాసనో2వతునో*
*భద్రాద్రి మూర్థ్నిస్థితః ॥*
*భావం:--*
*1.తామర రేకులవంటి బహు సుందరములైన నేత్రములు గలవాడు,*
*2.వర్షాకాలపునీలమేఘఛాయ వంటి శరీర సౌభాగ్యం కలవాడు,*
*3. 'భూపుత్రియగు సీతాదేవి'తో కూడియున్నవాడు,*
*4. 'సుమిత్ర తనయుడూ'--పరమ ప్రేమానూరాగములు తొణికిసలాడు 'లక్ష్మణుని'తో సేవలందుకొనువాడు,*
*5.అక్షకుమారాది ప్రతిపక్ష వీరప్రాణహరణ దక్షుడు--అంజనాగర్భ శుక్తిముక్తాఫలమగు ఆంజనేయునిపై నిరంతరమూ అవ్యాజానుగ్రహము చూపువాడు,*
*6.శంఖ చక్ర ధనుర్బాణాలతో విరాజిల్లుతూ,*
*7.భద్రాద్రి శిఖరంపై ఆసీనుడైయున్న 'శ్రీరాముడు' మనలను రక్షించుచుండుగాక!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి