వేదాధ్యయనానికి మాడు దశలు ఉంటాయని పెద్దలు చెబుతారు.వేద మంత్రాలను చదవటం/కంఠస్థం/స్మృతి పథంలో ఉంచడం/వల్లె వేయటం... ఇది మొదటి దశ కంఠస్థం అయిన దానిని లేదా స్మృతిపథం లో ఉన్న దానిపై వేదార్థ విచారణ రెండో దశ. పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం మూడవ దశ. ఈ మూడింటినీ ఏకకాలంలో చేసే వారిని శ్రోత్రీయుడు అంటారు. వేదాన్ని చెప్పుకుంటున్నాను..అని అంటూ ఉంటారు విద్యార్థులు..అదే ఇది. ఇదే తెలుగులో ఇతరభాషాల్లో వాడుకలో చదవటం అని ప్రచారంలో ఉంది. కాబట్టి శ్రోత్రీయుడు స్వచ్ఛమైన వేద స్వరూపం. మీరు పైన చెప్పిన దానికి శ్రోత్రీయుడు అన్న అర్ధం సవరించుకోవాలి తప్ప..ఎదో పుస్తకం చూసి చదివినంత మాత్రాన తత్వం తెలీదు అని వ్యాఖ్యానం చెప్పకూడదు. ఆనంతమైనది వేదం. వ్యాసభగవానుడు సంగ్రహం రూపంలో అనంతమైన వేదార్ధం తెలిసేలా(నిరంతర వేదాధ్యయనం చేసే బ్రహ్మణుడికి మాత్రమే) సుమారు 24వేల మంత్రాలను మాత్రమే ఉటంకించారు.(అంటే రెఫెర్ చేశారు) అని పెద్దలు చెబుతారు. వేద మంత్రాన్ని చడవగలగ్తట మే చాలా చాలా గొప్ప. ఇక శ్రోత్రీయుడు అయితే సాక్షాత్తు వేద స్వరూపమే అతడు. కాబట్టి పెద్దలు చదివితే ఏమీ తెలీదు అని ఎప్పుడూ చెప్పారు. ఎలా చదవాలో అలా చదివితే వంట పడుతుంది అనే చెబుతారు. వైదిక సంప్రదాయంలో వేదాన్ని గురు శుశ్రూష ద్వారానే ముఖతః పొందగలం. దీన్నే వాడుకలో చదవటం అని ప్రచారం ఉంది.... శ్రోత్రీయుడు అయితే తప్ప వేదాధ్యయనం చేసినట్లు అవదు. మూడు దశల్లో ఏఒక్క దశలో అయినా విఫలం చెందితే అతడికి వేదార్ధం పరమార్ధం తెలియదు..అని చెప్పటమే ఆశ్లోకం యొక్క లో అర్ధం. అని అనిపిస్తోంది నాకు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి