8, ఫిబ్రవరి 2024, గురువారం

సద్గురునిఅనుగ్రహమహిమ

 శు భో ద యం🙏


సద్గురునిఅనుగ్రహమహిమ!

                      నరసింహశతకం.


"దుష్టసంహార నరసింహదురితదూర"!

-అనే మకుటంతో రచింపబడిన ఈశతకంలోని పద్యాలు అనవద్య హృద్యాలు.సాంఘికదురవస్థలను తూర్పారబట్టే ఇందలిప్రతిపద్యము

ఒకరత్నమే! ఈపద్యాన్ని కొంచెంరుచిచూడండి,


"సంచలింపకనెందు సంజవార్చిననేమి

      బ్రహ్మనందకగాడు బ్రాహ్మణుండు;

తిరుమణిశ్రీచూర్ణతిలకమద్దినగాని

      విష్ణునందకగాడు వైష్ణవుండు;

భూతినుదుటనునంతబూసికొన్ననునేమి, 

       శంభునందకగాడుశైవజనుడు;

కాషాయవస్త్రాలు గట్టినంతననేమి

       రాజుబోవగగాడుయతివరుండు;


ఇట్టిలౌకిక వేషాలు గట్టికొనిన

గురునిజెందక సన్ముక్తి దొరుకబోదు

భూషణవికాస!శ్రీధర్మపురినివాస!

దుష్టసంహార!నరసింహ!దురితదూర!"-

           -ధర్మపురి శేషప్పకవి.

 

"


భావము:ప్రతినిత్యంసంధ్యావందనంచేస్తున్నా, బ్రహ్మజ్ఞానంలేకపోతేవాడు బ్రాహ్మణుడు కాబోడు.

         తిరుమణితో శ్రీచూర్ణంతో ఎంతఅందంగా నామంతీర్చిదిద్దినా, విష్ణుధ్యానపరాయణత లేకపోతేవాడు

వైష్ణవుడు కాబోడు.

   బూడిద మొగమంతాపూసుకున్నతమాత్రంచేత

శివభక్తి లేనివాడు శైవుడు అవడు.

     కాషాయవస్త్రాలు డాబుసరిగా ధరించినా సన్యాసి రాజుకాబోడు.

          అలాంటి లౌకిక మైనవేషాలు యెన్నివేసినా,సద్గుర్వనుగ్రసిధ్ధిలేనిచో 

మోక్షము లభించదు.

             అందువలన సద్గుని సమాశ్రయణము సర్వశ్రేయోదాయకము.🙏🙏🙏👌👌🙏

కామెంట్‌లు లేవు: