#బ్రాహ్మణుడు
నమోస్తు మహాపూజ్యం నమోస్తు సద్బ్రాహ్మణం
నమోస్తు శాస్త్రాన్వితం నమోస్తు గురోర్ సర్వత్రః
నమోస్తు మహాపూజ్యం.. నమోస్తు సద్బ్రాహ్మణం..
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అత్యంత వందనీయుడు పూజ్యనీయుడు.. సద్బ్రాహ్మణుడే.. సర్వదా ద్విజుడే
ద్విజుడు అనగా రెండు జన్మలు కలిగిన వాడు..
ఒకటి ప్రాపంచికంగా..
మరొకటి ఉపనయనమనే జ్ఞాన స్వరూపంగా...
జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠం తు విప్రాణాం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః
అన్నది శాస్త్ర ప్రమాణం..
ఇది పక్షపాతం కాదు.. పరమ యధార్థం....
అవసరమైతే బిక్షాటన చేసి సైతం..
వేదాన్ని.. వేదధర్మాన్ని.. భగ్వత్ తత్వాన్ని..
కాపాడే నిష్కల్మష త్యాగ స్వరూపుడే.. ద్విజుడు..
అందుకే అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల కంటే..
సర్వ దేవతల కంటే అగ్రగణ్యుడు.. పూజ్యనీయుడు..
నమోస్తు శాస్త్రాన్వితం..
ఋగ్, యజుర్, సామ, అధర్వణములనబడే చతుర్వేదాలను.. షట్ శాస్త్రములు (శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తి, కల్పం, జ్యోతిష్యం ) మొదలగు వేదాంతర్గతమైన శాస్త్రాలను..
సంగీత సాహిత్యాలను ఔపోసనపట్టి సర్వే సర్వత్రా లోక కళ్యాణానికై ధారపోసే తేజోమూర్తులు.. నిష్కల్మష త్యాగ హృదయులే ద్విజులు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి