8, ఫిబ్రవరి 2024, గురువారం

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 23*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥 వేమన పద్యాలు--- 64*


*అఖిల జీవములను నజుడవై పుట్టించి*

*విష్ణుడవై  వాని వెలయ జేసి*

*శివుడవై సకలము శిక్షించుచుందువు*

*విశ్వదాభిరామ వినురవేమ !*


*🌹 తాత్పర్యము ---*

బ్రహ్మగా సృష్టిస్తావు.

విష్ణువుగా స్థితికారకుడవుతావు.

తుదకు శివునిగా లయము కలిగిస్తావు.

ప్రళయము సృష్టిస్తావు.


*💥 వేమన పద్యాలు --- 65*


*అఖిల దేవతలును హరిపూజ జేయంగ*

*హరుడు నృత్యమాడె నాదియందు*

*ఆదిబ్రహ్మ తానె యట మద్దెలనుగొట్టె*

*విశ్వదాభిరామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము ---*

దేవతలందరు విష్ణువుని పూజించ , శివుడు శివతాండవం చేసినాడు.

బ్రహ్మ తనంతటతానే మృదంగమును ధ్వనింపజేసినాడు.


*💥వేమన పద్యాలు -- 66*


అఖిలాకారు డనంతుడు

సకలాత్మలయందు సర్వసాక్షియై తానై

నిఖిలముల నిర్వికారుడు

నికరము బ్రహ్మ మ్మనంగ నిజముర వేమా !


*🌹తాత్పర్యము --*

సమస్త ఆకారములు ధరించువాడు , అంతములేనివాడు , సమస్త జీవకోటికి సాక్షీభూతుడు, నిర్వికార నిరంజనుడు అతడే బ్రహ్మ.

బ్రహ్మ తత్వమంటే అదే !


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: