మీకు తెలుసా... ఇలాంటి పుస్తక సంపద 90 లక్షల గ్రంథాలను భక్తియార్ ఖిల్జీ నలందలో తగులబెట్టాడని... అవి అన్నీ కాల్చేందుకు వారికి ఒక సంవత్సర కాలం పట్టిందట... అన్ని గ్రంథాలు.... విజ్ఞాన సంపద ఉన్నాయి.. మన భారతీయుల దగ్గర.. కానీ, ఐకమత్యం లేదు.!!
(ఇతని పేరు మీద ఇప్పుడు ఒక ఊరు భక్తియార్ పూర్ అని ఉంది.! వీడి పేరుమీద రేల్వేస్టేషన్ కూడా ఉన్నది)
దోపిడీదారులు, దురాక్రమణదారులు, విధ్వంసకారుల, పేర్ల మీద ఊర్లు, పట్టణాలు, నగరాలు, రైల్వేస్టేషన్లు ఇంకా వెలుగొందుతున్నాయి.! ఇది మన చేతకానితనం.!!
🙏 మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు 🙏*
🔹 నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వ గ్రంథ శాస్త్ర రాజములు: 🔹
🔹 నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండా పోయాయా అని ఆశ్చర్యం కలుగక మానదు.
🌷1.అక్షర లక్ష: ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము. రచయిత వాల్మీకి మహర్షి. రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణిత శాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, గాలి, విద్యుత్, ఉష్ణంలను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.
🌷2. శబ్ద శాస్త్రం: రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను, ప్రతిధ్వనులను ఇది చర్చించింది. ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం, వాటి పిచ్(స్థాయి), వేగాలను కొలవడం వివరించారు.
🌷3. శిల్ప శాస్త్రం: రచయిత కశ్యప ముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి. 307 రకాల శిల్పాల గురించి, 101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు, రాజ భవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రంపై విశ్వామిత్రుడు, మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.
🌷4. సూప శాస్త్రం: రచయిత సుకేశుడు. ఇది పాక శాస్త్రం, ఊర గాయలు, పిండి వంటలు, తీపి పదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేక రకాల వంటకాల గురించి, ప్రపంచ వ్యాప్తంగా ఆ విషయాలు, వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.
🌷5. మాలినీ శాస్త్రం: రచయిత ఋష్యశృంగ ముని. పూల మాలలను తయారు చేయడం, పూలగుత్తులు, పూలతో రకరకాల శిరోఅలంకరణలు, రహస్య భాషలో పూవుల రేకుల పైన ప్రేమ సందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.
🌷6. ధాతు శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. సహజ, కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు. మిశ్రలోహాలు, లోహాలను మార్చడం, రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.
🌷7. విష శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. 32 రకాల విషాలు, వాటి గుణాలు, ప్రభావాలు, విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.
🌷8. చిత్ర కర్మ శాస్త్రం (చిత్ర లేఖన శాస్త్రం): రచయిత భీముడు. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్ర లేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తల వెంట్రుకలను గాని, గోటిని కాని, ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.
🌷9. మల్ల శాస్త్రం: రచయిత మల్లుడు. వ్యాయామాలు, ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.
🌷10. రత్న పరీక్ష: రచయిత వాత్సాయన ఋషి. రత్నాలు కల్గి ఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి. వీటి శుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి. రూపం, బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.
🌷11. మహేంద్రజాల శాస్త్రం: సుబ్రహ్మణ్య స్వామి స్వామి శిష్యుడైన వీర బాహువు రచయిత. నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.
🌷12.అర్థ శాస్త్రం: రచయిత వ్యాసుడు. ఇందులో భాగాలు 3. ధర్మ బద్ధమైన 82 ధన సంపాదనా విధానాలు ఇందులో వివరించారు.
🌷13. శక్తి తంత్రం: రచయిత అగస్త్యముని. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన 64 రకాల బాహ్య శక్తులు, వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.
🌷14. సౌధామినీ కళ: రచయిత మతంగ ఋషి. నీడల ద్వారా, ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది. భూమి మరియు పర్వతాల లోపలి భాగాల ఛాయా చిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.
🌷15. మేఘ శాస్త్రం: రచయిత అత్రి ముని. 12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.
🌷16. స్థాపత్య విద్య: అదర్వణ వేదంలోనిది. ఇంజనీరింగ్, ఆర్కితెక్చర్, కట్టడాలు, నగర ప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.
🌷ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వ శాస్త్రం, కుమారస్వామి రచించిన గజ శాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్ర శాస్త్రం మొదలగునవి, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
🌷నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.!!
భక్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయం తగలబెట్టటానికి
వచ్చినప్పుడు, ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు.!!
అక్కడున్న ఆచార్యులు, విద్యార్థులు కలసికట్టుగా చేతికి
అందిన దానితో తిరగబడినా, గ్రంథాలనే ఆయుధాలనే చేసుకుని తిరగబడినా ఇంతటి దహనకాండ జరిగేది కాదేమో.!!
జాజిశర్మ కీసర వారి సౌజన్యంతో..... #ధర్మపథం.!!
🙏🙏🙏 💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి