*కం*
తలవంచుట నేర్చినచో
కలిగిన సామాన్య పటిమ ఘనకీర్తియగున్
తలవంచగనెంచనిచో
కలిగిన ప్రజ్ఞలు సహితము కల్లగు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! తలవంచడమొక్కటే నేర్చుకుంటే నీ సామాన్యమైన బలం కూడా గొప్పగా కీర్తించబడుతుంది. తలవంచడానికి సిధ్ధపడకపోతే కలిగి యున్న ప్రజ్ఞ లు కూడా నిరర్థకమగును.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
: *_పరిస్థితులకు సర్దుకొనిపోతే తమను తాము తగ్గించుకున్నట్లేనన్న భావన చాలామందిలో ఉంది. అనవసరమైన 'అలకలకు' పోతే చివరకు నష్టపోయేది మనమే!_*
*_ఏటిలో తోటి జీవులతో పడటం లేదని, చేప అలిగి ఒడ్డుపైకెళితే ఒరిగేదేముంటుంది..? పైగా ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది._*
*_ఓపికతో మన వంతు వచ్చే వరకు వేచిచూసి, మన ఉనికిని చాటుకోవటం వేరు... ఒకింత అసహనంతో ఏటికి ఎదురీది మొదటికే మోసం కొనితెచ్చుకోవటం వేరు._*
*_జీవితం రంగులరాట్నం లాంటిది. ఒకసారి ఒక కుర్చీపైనుంటే, మరోసారి మరోకుర్చీ పైనుంటుంది. స్థానమేదైనా సర్దుకుపోతేనే జీవనచక్రం సాఫీగా సాగిపోతుంది._*
*_నువ్వు జీవితంలో ఎప్పుడూ వైఫల్యాన్ని చూడలేదంటే, నీ లక్ష్యాలు అంత గొప్పవి కాదని అర్ధం. నీకు ఎన్నడూ సవాళ్లు ఎదురు కాలేదంటే నువ్వు అసలు లక్ష్య సాధనకు ప్రయత్నమే చేయలేదని అర్ధం. వైఫల్యాలు మన వృద్ధికి ఇంధనంగా పనిచేస్తాయి. సవాళ్ళు మన నైపుణ్యాలను సానబెడతాయి._*
*_ప్రయోగించినప్పుడే ఆయుధం ఎంత శక్తిమంతమైనదో తెలుస్తుంది. ఉపయోగించినప్పుడే నీ సామర్థ్యాల సత్తా ఏంటో అర్థమవుతుంది కాబట్టి కష్టం వచ్చిందని కుమిలిపోకుండా ఓర్పు నేర్పుతో ఎలా ముందుకు వెళ్ళాలో తెల్సుకుని అడుగు వేస్తే నీకు విజయం తధ్యం.☝️_*
🌹🪷🌹 💓🙇🏻💓 🌹🪷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి