22, అక్టోబర్ 2024, మంగళవారం

శాస్త్రాలలో చెప్పబడిందే

 *శాస్త్రాలలో చెప్పబడిందే పాటించటం మనకర్తవ్యం* 


 శాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞలను పాటిస్తే మనకు శిరోదాయకంగా ఉంటుంది. వాటిని విస్మరించటానికి మనం అనర్హులం , పాటించకపోతే ఆ శాస్త్రానికి గాని, శాస్త్రాన్ని తెలియచెప్పిన దేవునికి గాని నష్టం లేదు. మేము పాఠశాలలో కూడా అదే విధంగా చదువుతాము. మా గురువుగారు “బాగా చదువుకో, ఇలా ఉండకు; ఇలా చేస్తే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తదుపరి తరగతికి వెళతావు" అని ఆయన చెప్పినట్టు చేయకపోతే పరీక్షలో తప్పి కూర్చుంటాం.ఆయన చెప్పినట్టు ఆ విద్యార్థి చేసినా, చేయకున్నా ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు .కనుక ఎదుటివారు చెప్పేవన్నీ మన కోసమే, మన బాగు కోసమే జరుగుతోంది అని ఆలోచించి సరైన మార్గంలో వెళ్ళండి. అదేవిధంగా, మన పూర్వీకులు మనకు ఇచ్చిన బోధనలే సుగుణాత్మక బోధనలు. ఆబోధనలను మనం శిరోధార్యంగా పాటించడం చాలా అవసరం.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

కామెంట్‌లు లేవు: