22, అక్టోబర్ 2024, మంగళవారం

సత్సంగాలు

 క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ మనకి indirect గా చెప్తున్నారు.


బైబిల్  మా క్రిస్టియన్స్ బుర్రల్లోకి ఎక్కిస్తున్నాం,

 అలాగే ముస్లింలు చెప్తున్నారు మా ఖురాన్ ముస్లింల బుర్రల్లోకి ఎక్కిస్తున్నాం,  

మీకు ఎన్నో దేవాలయాలు,వాటికి పాలకవర్గాలు ఉన్నాయి కానీ మీరు భగవద్గీత కోసం మీ ఆలయాల్లో హిందువులకు ప్రవచనాలు పెట్టి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించుకో లేక పోతున్నారు.. 

ఎంతసేపు పూజలు,ప్రసాదాలు పెట్టడం, హుండీ లో డబ్బులు వేసి దేవాదాయ శాఖ కి అప్పజెప్పడం, అవి కాస్త సెక్యులర్ రాజకీయ నాయకులు కిరస్తానీ, ఇస్లాం వారికి యాత్రలకు లబ్ది చేయడం.. జరుగుతుంది. 

 

అదే ప్రతి దేవాలయంలో  ప్రతిరోజు ఒక గంట భగవద్గీత  చెప్పడం అంటూ మొదలు పెడితే, ఏ క్రిస్టియన్ అయినా  ముస్లిం  అయినా  హిందువుల  దరిదాపులకి రాలేరు కదా.

అలోచించి ముందుకు పొతే  అప్పుడే సనాతనధర్మం నిలబడుతుంది.లేకుంటే మీరు కన్న కలలన్ని అన్య మతస్థులకు అవకాశం అవుతాయి... 


ఇకనైనా మేలుకోండి హిందువులారా!


ఇంట్లో తల్లి తండ్రులు పిల్లలకు మన సనాతన సంప్రదాయం, భారతీయ సంస్కృతి, రామాయణ మహాభారతం భగవద్గీత అధ్యయనం చేయించండి.


వారం లో ఒక రోజు ఎన్నుకొని సమీప దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళి సత్సంగం లో పాల్గొనాలి.

మన కాలనీ, మన గ్రామం లో మనము ప్రతి దేవాలయం లో సత్సంగాలు ప్రయత్నం చేసి సంస్కారం, సనాతన ధర్మం గురించి తెలిసిన పెద్దలచే మాట్లాడించాలి.


ఈ పని చేస్తారని ఆశిస్తూ....

మీ 

బొడ్ల మల్లికార్జున్ 

సంస్కార శిక్షణ ప్రాంత ప్రముఖ్ 

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ

కామెంట్‌లు లేవు: