భారత సంస్కృతి లో రామాయణం పాత్ర ఎంతో ఉంది. రామాయణం అధ్యయనం చేసినవారి మనోనిశ్చలత అసాధారణమైనది. ఎందరో కవులు వివిధభాషలలో రామాయణాన్ని తమదైన భాణిలో రచించినప్పటికి వాటన్నిటిలో వాల్మీకి రామాయణానిదే పెద్దపీట. వాల్మీకి రామాయణం ఆమూలగ్రం పఠిస్తే కలిగే మానసిక ప్రశాంతతను ప్రత్యక్షంగ అనుభవిస్తే కానీ తెలియదు.
మన దురదృష్టవశాత్తు రామాయణం పై మంచి అభిప్రాయంతో పాటు అపోహలు కూడ బలంగానే ప్రచారంలో ఉన్నాయి. అసలు రామాయణంలో ఉన్నదేమిటో తెలియకపోవటంతో చెప్పినవన్నీ లేక చదివినవన్నీ నమ్మే స్థితిలో ఈ తరంవారు తప్పుదారి పడుతున్నారు.
నిత్యం పరుగులతో నిండిపోయిన ఈ జీవితశైలిలో సుమారు 24 వేల శ్లోకాలను చదవటమంటే మాటలు కాదు. పైగ అది సంస్కృతంలో ఉన్నవాయె. రామాయణం పై సరైన అవగాహన లేకపోవటానికి ఇదికూడ ఓ కారణం కావొచ్చు. వీటన్నిటికి పరిష్కారంగ వాల్మీకి రామాయణం ఆధారంగ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పరచబడినది.
రోజుకో సందేశమనే నిబద్ధతతో, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ల గొడవలు ఏమాత్రంలేకుండ కేవలం వాల్మీకి రామాయణం ఆధారంగ క్రమపద్దతిలో సందేశాలు పంపబడుతాయి. సరళమైన తెలుగులో ఈ సందేశాలు ఉండటం ఓ ప్రత్యేకత. ఉదయమే సందేశాలు పంపబడుతాయి కాబట్థీ మీ వీలును బట్టి రోజులో ఏ సమయంలోనైన చదువుకోవచ్చు. అంతే కాక నిత్యరామాయణ పారాయణ చేసే మరెందరో పెద్దలు వారు అనుభవంతో చేసే వ్యాఖ్యలు కూడ చాలా ఉపయోగకరంగ ఉంటాయి.
ఆసక్తి ఉన్నవారు చేరటానికి లింకు ఇవ్వబడింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. పూర్తి స్థాయి సందేశాలు మొదలవటానికి మరో 2 లేక 3 రోజులు పట్టొచ్చు. మీ స్నేహితలను, కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించొచ్చు.
జై శ్రీరామ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి