9, అక్టోబర్ 2024, బుధవారం

హైందవం వర్ధిల్లాలి 25*

 *హైందవం వర్ధిల్లాలి 25*


సభ్యులకు నమస్కారములు.


*ధర్మప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, హిందూ నాయకులు హైందవ జాగ్రుతికై ప్రజలలోకి రావాలి* vi) :- తెలుగునాట వేద, స్మార్త, వైష్ణవ, శైవ విద్వన్మూర్తులు, పండితులు, ధార్మిక వరేణ్య బిరుదాంకితులు, స్వర్ణ కంకణధారులు, తత్వవేత్తలు, జీయరుస్వాములు, ఎకరాలకొద్దీ మాతృ భూమిని పొందిన ఆశ్రమాధిపతులు, మహా ఘనతవహించిన పీఠాధి పతులు ఇంకా ఎందరెందరో మహానుభావులు. దేశం యావత్తు గమనిస్తే ఇంకా ఎందరెందరో గొప్ప వారు. స్వదేశీ పలుకుబడి కలవారితో బాటు అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రముఖులు, విదేశీ దౌత్యవేత్తలు వీరందరూ భారతీయులే గదా. భారత దేశ మూల మరియు అనాదిగా నెలకొని ఉన్న హిందూ/సనాతన ధర్మానికి, సంస్కృతి, సంప్రదాయాలతో బాటు జనులకు గూడా హాని జరుగుచున్నపుడు, వీరందరూ కేంద్ర మరియు రాష్ర్ట ప్రభుత్వాలను, వివిధ రాజకీయ నాయకులను కలసి పరిస్థితులను సరిదిద్దాలి గదా. 


*ధర్మ సంస్థాపనార్థం మరియు అధర్మమునకు అడ్డుకట్టు వేయుటకు మళ్ళీ శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారే దివి నుండి భువికి రావల్సిందేనా*. 


భారతదేశ ప్రజలు భగవత్ చింతన లేనివారా, అధార్మికులా అంటే కానే కారు అని ఘంటాపథంగా చెప్పవచ్చును. రుజువులు ఎన్నెన్నో. అసంఖ్యాకంగా దేవాలయాలు దర్శనమిస్తున్నాయి, ఇంకా నిర్మించబడుచున్నాయి. దైనందిక పూజలతో సహా ప్రజలు శ్రీ అయ్యప్ప స్వామి మాలలు ధరిస్తున్నారు, మరికొందరు శ్రీ ఆంజనేయ స్వామి మరియు దుర్గా దేవి మండల దీక్షలు చేపడుతున్నారు, ఇవన్నీటితో బాటు వీలుని బట్టి, అవసరమైనప్పుడల్లా ప్రజలు హోమాలు, యాగాలు, యజ్ఞాలు, శాక్తేయ పూజలు, గణేష్ మరియు దేవి నవ రాత్రులు నిర్వహిస్తున్నారు. *ఇవన్నిటి ఉద్దేశ్టమేమిటి, ప్రజలు భక్తులుగా మారి ఏమి నేర్చుకుంటున్నారు*. 


హిందువు అను పదమునకు ఉన్న నానార్థాలలో ఒక అర్థము గురించి పరిశీలిద్దాము. *హింసామ్ దూషయతి ఖండయితి హిందు*. అర్థం:- హింస మరియు దూషణ ఎక్కడ ఉంటుందో వాటిని ఖండించే వాడే హిందువు. *హిందువులుగా మన స్వభావాన్ని మనధర్మాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాము*. మరింత విపులంగా చెప్పాలంటే *మన జాతిపై పరజాతి వారి హింసాత్మక చర్యలను మాత్రమే ఖండించమని* అర్థము. హింసా చర్యలను ఖండించడానికైనా ప్రతి పౌరుడు ముందుండాలి. హిందూ సమాజ రక్షణకు చుక్కానిగా నిల్చి, జనుల రక్షణ చేపట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ ఉదయించాలా, అంతే సామర్థ్యంతో హిందూ ధర్మ వ్యతిరేకులను నిరోధించిన మహారాజ్ రాణా ప్రతాప్ సింగ్ అరుదెంచాలా. ధర్మ వ్యతిరేకులను ఎదిరించండి అని కురుక్షేత్రంలో నుడివిన శ్రీ కృష్ణ పరమాత్మ మళ్ళీ అవతరించాలా. ఇవన్నిటికి సమాధానం, ప్రజలు, పెద్దలు మరియు మేధావులే సమాధానం చెప్పాలి. *స్వధర్మ రక్షణ, ప్రోత్సాహం నేరం కాదు, కాదు, కాదు*.


హైందవ ధర్మ ప్రచారం కొనసాగిస్తున్న పెద్దలందరికి సవినయ విజ్ఞప్తి. మహానుభావులారా ముఖాముఖి గాని, బహిరంగ సభలలో గాని, వీడియోలలో, Tv మరియు రేడియోలలో గాని మీరు ఎక్కడ ఏ గీతోపదేశము, ధర్మోపదేశము చేసినా, సంప్రదాయ భజనలు గావించినా దయచేసి అరుదెంచిన లేక మీ కార్యక్రమాలను వీక్షిస్తున్న భక్తులకు, శ్రోతలకు *ప్రస్తుతం దేశానికి, ధర్మానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు వాటిల్లుతున్న హాని గురించి విశదీకరించి, హిందు సమాజ జాగ్రూతికై*, తప్పనిసరిగా సమయము కేటాయించగలరు. *వినే ప్రజలు క్షేమంగా ఉంటేనే చెప్పే మహానుభావుల ఉనికి మరియు అస్థిత్వము*. ఇది పరమ సత్యము. అన్యధా భావించకండి.


*కావున, మన హిందూ ధర్మానికి సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: