*శ్రవణ కళ*...
*ART of LISTENING*
🙏🌹🙏🌹🙏
*వినడం కూడా ఒక కళ*...
నిజమైన ఆధ్యాత్మిక సాధన అంటే శబ్దాలు వినబడకుండా చేసుకునే ప్రయత్నం కాదు.
నిశ్శబ్దాన్ని కూడా వినగలిగేలా చేసుకోగలిగిన సౌలభ్యం.
విభిన్న విశ్వాసాలతో సతమతమయ్యే మనుషులు...
ప్రార్థనలో బైబిల్... ఖురాను... గీత... వగైరా గ్రంథాలను ఆలకిస్తున్నారు.
కానీ దైవం చెప్పింది ఎంతమంది వింటున్నారు అన్నది ప్రశ్న..?
గబ్బిలాలు నీటి అడుగున ఉన్న జీవుల కదలికల శబ్దాన్ని కూడా వినగలవు.
కానీ *మనిషి కన్నీటి అడుగున ఉన్న రొదను కూడా సాటి మనిషి వినలేక పోతున్నాడు*
.
వినడానికి సమయం లేదంటారు కొందరు...
*వినడం కోసమే వాళ్లు కూర్చున్నప్పటికీ*
*ఎవరికోసమైతే మన దుకాణం*... *వ్యవహారం... ఉద్యోగం... *ఉన్నదో వాళ్లను వినడానికి మనకు సమయం ఉండదు*.
నాయకులు ప్రజలను విసుక్కుంటారు...
డాక్టర్లు పేషంట్లను.. టీచర్లు స్టూడెంట్స్ ను.. పోలీసులు పీడితులను.. ఉద్యోగస్తులు ప్రజలను..
*మే ఐ హెల్ప్ యు*
*MAY I HELP YOU*
అన్న బోర్డు కింద కూర్చున్న వ్యక్తి...సహాయానికి వచ్చిన వారినీ విసుక్కుంటారు.
ఎదుటి వారిని ఎంత వినకపోతే...
ఎంత నిర్లక్ష్యం చేస్తే...
అంత గొప్ప వాడన్న దురభిప్రాయం సమాజంలో నాటుకుంది...
సమయం ఇవ్వ లేకపోతే బిజీ అని అర్థం.
బిజీ అంటే ప్రముఖులనీ...
గొప్ప వాళ్ళనీ పరమార్ధం.
వినడం అంటే సొంత ఆలోచనలకు స్వస్తి పలకమని కాదు... మనలోపలి ఆలోచనా ప్రమిదని బయటి దివ్వేతో వెలిగించమని అర్థం... మనుషులంతా ఎవరి ఆలోచనలతో వాళ్లే వెలిగిపోతే చెవులు ఉండేవి కావు.
తెలియనిది అడిగి తెలుసుకోవాలి.
అది పిల్లలైనా పెద్దలైనా.
*అన్ని నాకే తెలుసన్న భావన వినడంలోని సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది*.
అడగడం అంటే ఎదుటివారి మనస్సుకు దండ వేసి నమస్కరిస్తున్నట్లే.
వినడం అంటే శబ్దం పలకని అర్ధాన్ని గ్రహించినట్లే.
శబ్దం లేని చోట కూడా భావం ఉంటుంది.
వాక్యాల వెనక దాగిన భావాన్ని గ్రహించడం వినడం అవుతుంది.
అడ్డగించక ప్రతిఘటించక విమర్శించక..కాదనక... అవుననక ... అసలు ఏమీ అనకుండా గ్రహించడమే వినడం.
చాలామంది మేధావులు.. జ్ఞానులు... అని
స్వథ్రువీకరించుకునే అజ్ఞానులు...
సలహాకి.. జోక్యానికి మధ్య గోడను గమనించరు.
*ఎవరైనా సలహా ఇస్తే తమ సామ్రాజ్యాన్ని దొంగిలిస్తున్నట్లుగా భావిస్తారు*.
*అందుకే ఎదుటి వాళ్లు సలహా ఇవ్వకుండా... ఇచ్చినా వినకుండా ఒక బంకరును నిర్మించుకుంటారు*.
కానీ విషయం ఏమిటంటే కొందరికి సరియైన సమయంలో లభించిన సలహా మహమ్మారిని నిర్మూలించే వైద్యంలా పనిచేస్తుంది...
అందుకే వినాలి...
వినే విధంగా మన మనసుకు మనం యోగాభ్యాసం చేయించాలి...
అప్పుడే మనసుకు...
సరి అయిన శక్తి లభిస్తుంది...
మానసిక శక్తియే దైవ శక్తి...
🙏🌹🙏🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి