6, జనవరి 2026, మంగళవారం

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ


సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః 

ఇష్టో௨సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ (64)


మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు 

మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో௨సి మే (65)


నీ వంటే నాకెంతో ఇష్టం. అందువల్ల నీ మేలుకోరి పరమరహస్యమూ, సర్వోత్కృష్టమూ అయిన మరో మాట చెబుతాను విను. నామీదే మనసు వుంచి, నాపట్ల భక్తితో నన్ను పూజించు; నాకు నమస్కరించు. నాకు ఇష్టుడవు కనుక ఇది నిజమని శపథం చేసి మరీ చెబుతున్నాను. నీవలా చేస్తే తప్పకుండా నన్ను చేరుతావు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

కామెంట్‌లు లేవు: