శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
శా||
యోగాభ్యాసమొనర్చి నిన్నుబడయన్ యోగ్యుండనా? కాను పో
నీ గాఢమ్మగు భక్తి రెండు కనులన్ దీయించి మెప్పింతునా
భోగాసక్తుడనౌటఁగానిపని; సంపూర్ణానుకంపన్ పురా
రీ! గోపున్ ననుఁ బ్రోవ వేడుకొనెదన్ శ్రీ సిద్దలింగేశ్వరా !
భావం;
కఠినమైన యోగాభ్యాస సాధన చేసి నీ కృపను పొందుదామంటే, నాకా యోగ్యతలేదే,
పోనీ గాఢమైన మూఢ భక్తితో
భక్త కన్నప్పలా రెండు కళ్లూ పెకల్చి నీకు అర్పిద్దామనుకొంటే
ఇంకా లౌకిక విషయాల పట్ల ఉన్న ఆసక్తి వల్ల అది నాకు సాధ్యమయ్యే పని కాదు.
అందుకే నయ్యా
పురారీ! ఓ శివా
ఇవేమీ చేతకాని వాడినైన
నన్ను సంపూర్ణమైన కరుణతో కటాక్షించమని వేడుకొంటున్నాను స్వామీ,శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి