4, అక్టోబర్ 2020, ఆదివారం

ధర్మ బద్ధంగా సంపాదించండి

 *తల్లి గర్భము నుండి ! ధనము తేడెవ్వడు !*

*వెళ్ళి పోయెడి నాడు ! వెంట రాదు !*

*లక్షాధికారైన- లవణ మన్నమే కానీ !*

*మెరుగు బంగారంబు ! మింగ బోడు !*

*విత్తమార్జన జేసి ! విర్రవీగుటె కానీ !*

*కూడ బెట్టిన సొమ్ము ! కుడవ బోడు !*

*పొందుగా మరుగైన- భూమి లోపల బెట్టి !*

*దాన ధర్మము లేక ! దాచి దాచి !*

*తుదకు దొంగల కిత్తురో- దొరల కవునో !*

*తేనె జుంటీగ లియ్యవా- తెర వరులకు !*

*భూషణ వికాస ! శ్రీ ధర్మపురి నివాస !*

*దుష్ట సంహార ! నరసింహ ! దురిత దూర !!*


*వ్యాఖ్య:- మనము తల్లి గర్భము నుండి ఈ లోకములోకి ఉత్తచేతులతోనే వచ్చాము !! ఉత్త చేతులతోనె పోతాము !! పుట్టిన వాడు*

*గిట్టక తప్పదు!!*

 *లక్షాధికారి అయినా ఎవరూ బంగారం తినరు కదా !!* *ఉప్పుకారంతోకూడుకున్న అన్నమే తింటారు!! అన్యాయంగా అక్రమంగా అధర్మంగా ధనాన్ని సంపాదించి ఎంత విర్ర వీగినా కూడ బెట్టిన సొమ్ము ఎవరై నా తినగలుగుతారా !! తినలేరుకదా !!*


*దానము,ధర్మము లేక!! దోచి దోచి దాచిన సొమ్ము చివరకు దొంగలకవుతుందా !!*

*దొరలకవుతుందా !! ప్రభుత్వమే జప్తు చేసు కుంటుందా!! చెప్పటం కష్టం!!*

*మన కళ్ళ ముందర ఎంత మందిని చూడటం*

*లేదు!! అవినీతి మహారాజుల జీవితాలు*

*తారు మారు కావటం లేదా!!*

*తేనెటీగలు జీవితాంతము కూడ బెట్టిన తేనె ను అవి తినగలుగుతున్నాయా ? తినలేవు!!*


*మన హిదుత్వ ఆధ్యాత్మిక జీవన విధానం త్యాగమయమే కాని భౌతిక భోగలాలసత్వం కాదు!!*

*" త్యాగేనైక అమృతత్వ మానుషుః! న ధనేన*

*న ప్రజేన" అని వేదం ఘోషిస్తుంది!!*


*త్యాగము చేయటం వలననే "అమృతత్వం"*

*సిద్ధిస్తుంది! ధనం వలన గానీ సంతానము*

*వలన గానీ ప్రజాబలం వలన గానీ లభించదు*


*ధర్మ బద్ధంగా సంపాదించండి !!*

*ధర్మ బద్ధంగా జీవించండి !!*

*ఇదే మన భారతీయ జీవన విధానం !!*

*హిందూ ధర్మ జీవన వైభవం!!*

కామెంట్‌లు లేవు: