తేనె గురించి సంపూర్ణ వివరణ - 4 .
* పౌత్రికం అనెడి తేనె -
ఇది నల్లని తేనెటీగల వలన చెట్ల తొఱ్ఱలలో పెట్టబడును. ఉష్ణం కలిగించును. విదాహమును పుట్టించును . వేడిని పుట్టించి విరేచనం కలిగించును. విషము , ఛర్థి , పిత్తము , వాతములను పోగొట్టి మిక్కిలి హితము చేయును .
* పౌష్పికము అనెడి తేనె -
ఇది పచ్చగా ఉండును . విషహరము .
* భ్రామరము అనెడి తేనె -
దీనిని చిన్న ఈగలు సమకూర్చును. రూపమునకు ఇది తెల్లగా , జిగటగా , తియ్యగా ఉండును . పిత్తమును పెంచును. అనారోగ్యము కలిగించును. వాత శరీరం కలవారు వాడవచ్చు .
* మాక్షికం అనెడి తేనె -
మంచి గంధపు చెట్ల నుంచి తీసినట్టి తేనె దీనికి "కిట్ని " అను పేరు కలదు. కొంచెం చేదు , వెగటు కలిగి రుచికరంగానే ఉండును . ఉష్ణమును , అగ్నిదీపనము ఇచ్చును . వాతము , మేహము , క్షయ , కుష్ఠు , నేత్రరోగములు , ఛర్థి , ఉపిరిగొట్టు నొప్పి మొదలైన వానిని , విషదోషములను పోగొట్టును . వ్రణములను మాన్పును తేనెలన్నింటిలో మిక్కిలి శ్రేష్ఠమైనది .
* సౌషిరము అనెడి తేనె -
నురుగు రంగులో ఉండును . రుచిగా ఉండును. శ్వాస , కాస రోగ హరమై పథ్యకారిగా ఉండును .
* క్షాద్రం అనెడి తేనె -
ఇది పింగళ వర్ణముగా ఉండే ఈగలతో ఏర్పరచబడును. మలబద్దకం కలిగించును . అగ్నిమాంద్యం కలుగ చేయును . మేహమును హరించును . వీర్యవర్ధకము , చలువని ఇచ్చును . బలాన్ని కలిగించును. ఆరోగ్యకరం .
సమాప్తము
మరింత విలువైన సమాచారం నేను రచించిన గ్రంథముల యందు ఇవ్వడం జరిగింది.
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి