కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పుడిప్పుడే కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. దాదాపు రెండు నెలల పాటు మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. మరి, కరోనా మొదటి దశను పకడ్బందీగా ఎదుర్కొన్న భారత్.. రెండో దశలో ఎందుకు ఇబ్బందులు పడాల్సివచ్చింది..? ఫస్ట్ వేవ్ ను అడ్డుకోవడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మనం.. సెకండ్ వేవ్ ను ఎందుకు ఈజీగా దాటలేకపోయాం..? అసలు ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా.. డబుల్ మ్యూటెంట్ అనే పదం భారత్లోనే ఎందుకు వినిపించింది..? కరోనా రెండో దశ విధ్వంసం భారత్‌నే ఎందుకు ఇంతగా బాధిస్తోంది..? కరోనా అంటేనే అడ్డూ అదుపూ లేకుండా విస్తరించే మహమ్మారి. దేశాలు, ఖండాలు దాటి విజృంభించే రాకాసి పురుగు. అలాంటి కరోనా.. రెండో దశలో భారత్ నే ఎందుకు ఎక్కువగా బాధించింది..? ఏదో గోడకట్టినట్టు, బోర్డర్లన్నీ మూసేసినట్టు.. డబుల్ మ్యూటెంట్ భారత్ లోనే ఎలా తిష్టవేసింది..? కనీసం పక్కనున్న నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో కూడా రెండో దశ విధ్వసం కనపడలేదు.. డబుల్ మ్యూటెంట్ పదం వినపడలేదు. అంటే భారత్ ప్రజలు మిగతా ఉపఖండ దేశాల ప్రజల కంటే అంత క్రమశిక్షణ లేకుండా బతుకుతున్నారా..? ఇవన్నీ వింటుంటే ఏదో తేడా జరిగినట్టు అనిపిస్తుంది కదా..! ఎస్.. నాకూ అనిపించింది. అందుకే, ఆ దిశగా కొంచెం లోతుగా వెళ్లి పరిశీలించాలనిపించింది. అలా పరిశీలిస్తూ పోతే.. ఓ భయంకరమైన నిజం బయటపడింది. అదే బయోవార్.
ఎస్.. వీరు విన్నది నిజమే. కరోనా సెకండ్ వేవ్ అనేది భారత్ పై ప్లాన్డ్ బయోవార్..! పైకి బద్ధశత్రువులుగా కనిపిస్తున్నా.. తమ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి అమెరికా, చైనా కలిసి చేసిన పెద్ద కుట్రగా ఇది కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఒకలా.. ఆ తర్వాత ఒకలా మారిన పరిణామాలే ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. అటు జో బైడెన్, ఇటు జిన్ పింగ్ ఇద్దరు కలిసి మోదీని టార్గెట్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరి, ఎందుకు..? మోదీ ఆ ఇద్దరు నేతలకు ఎందుకు టార్గెట్ గా మారారు..? ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ లాగా మోదీ కూడా గ్లోబల్ ఆయుధ, ఫార్మా, ఆయిల్ లాబీయింగ్ లకు లొంగడం లేదు కాబట్టి.
ఒక్కసారి వాస్తవాల్ని లోతుగా పరిశీలిస్తే.. అసలు నిజం మీకే అర్థమవుతుంది. ముఖ్యాంశంలోకి వెళ్లేముందు.. అసలు డొనాల్డ్ ట్రంప్ ఓటమికి దారితీసిన కారాణాలను ఓసారి పరిశీలిద్దాం. ట్రంప్ అధికారంలో వున్నప్పుడు.. మళ్లీ అధికారంలోకి వస్తే.. నాటో దేశాల బాధ్యతల నుంచి తప్పుకుంటామని ప్రకటించిన విషయం మీకు గుర్తుండే వుంటుంటుంది. అదే ఆయనకు శాపంగా మారింది. యూరప్ అంతటా మిలిటరీ బేస్ లు ఏర్పాటు చేసి.. సంవత్సరాల తరబడి అమెరికా సైన్యాలను అక్కడ మోహరించి ఉంచడం ట్రంప్ కు మొదటి నుంచి ఇష్టం లేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. మొదటి నుంచి అమెరికా జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తూ వచ్చారు. ఆయన చర్యలు కూడా అలాగే వుండేవి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం.. పెద్దరికం పేరుతో ఇతర దేశాల కోసం ఏళ్ల తరబడి వేల కోట్లు ఖర్చుపెట్టడం ఆయనకు నచ్చేది కాదు. అందుకే నాటో కూటమి నుంచి అమెరికా వైదొలగుతుంది అని ప్రకటించాడు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే అన్నంత పనీ చేసేవాడే. ఇదే అమెరికా చెప్పుచేతల్లోని గ్లోబల్ ఆయుధ లాబీకి అస్సలు నచ్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఉద్రిక్తతలు చెలరేగాలి. దేశాలు కొట్టుకు చావాలి. బాంబులు విసురుకోవాలి. అప్పుడు అక్కడికి అమెరికా సైన్యం వెళ్ళాలి. తమ ఆయుధాలను అమ్ముకోవాలి. ఇదీ గ్లోబల్ ఆయుధ లాబీ కుతంత్రం. కానీ, ట్రంప్ ఉంటే అది సాధ్యం కాదు. అందుకే ఆయన దిగిపోవాలి.
మరి, ట్రంప్ దిగిపోవాలంటే ఏం చేయాలి..? ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేయాలి. అందుకే, వచ్చిన ఏ అవకాశాన్నీ ఆయుధ లాబీ వదులుకోలేదు. ఇందులో ఒకటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ను డెరెక్ షావిన్ అనే పోలీస్ ఆఫీసర్ చంపడంతో ఈ ఉద్యమం మరోసారి ఊపందుకుంది. నల్లజాతీయుల పట్ల శ్వేతజాతీయుల దురహంకారాన్ని ఆయుధంగా చేసుకుని.. ట్రంప్ మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత చేశారు. ఒక్క పోలీసు చేసిన తప్పు.. ట్రంప్ అధ్యక్ష పీఠానికే ఎసరు పెట్టింది. ఇక్కడ ఎసరు పెట్టింది అనేకంటే కూడా ఎసరు పెట్టేలా చేశారనడం సరిగ్గా సరిపోతుంది. నిజానికి, దేశాధ్యక్షుడు కావచ్చు, ప్రధాని కావచ్చు. దేశంలోని ప్రతి పోలీసును నిలువరించడం సాధ్యమయ్యే పనికాదు. కానీ, ఒక్క పోలీసోడు చేసిన తప్పును.. ట్రంప్ కు విజయవంతంగా అంటగట్టారు. అమెరికాలో అప్పటివరకు అసలు శ్వేతజాతి దురహంకారమే లేనట్టు. నల్లజాతీయులపై మొదటిసారి దాడి జరిగినట్టు విపరీత ప్రచారం కల్పించారు. ఇంకేం.. ఆయుధ లాబీ పాచిక పారింది. ట్రంప్ ఓటమికి బాటలు పడ్డాయి. చైనా రహస్య చేయూతతో గ్లోబల్ ఆయుధ లాబీ అనుకున్నది సాధించింది.
ఇప్పుడు మోదీ విషయానికి వద్దాం. నాడు ట్రంప్ ఓటమికి ఏవైతే శక్తులు వెనుక వుండి పకడ్బందీగా ప్లాన్ చేశాయో. ఇప్పుడు అవే శక్తులు మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే, మోదీ సైతం ట్రంప్ లాగే జాతీయవాదాన్ని భుజానికెత్తుకున్నాడు కాబట్టి. ఆయన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటే.. ఈయన ‘మేకిన్ ఇండియా’, ‘స్టాండప్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ అంటున్నాడు. అదే ఇప్పుడు అగ్రరాజ్య కనుసన్నల్లో నడుస్తున్న ఆయుధ, ఫార్మా, ఆయిల్ లాబీలకు నచ్చడం లేదు. ఇక భారతే అన్నీ తయారు చేసుకుంటే, తమ పబ్బం గడిచేదెలా..? తమ ఆయుధాలు, తమ వ్యాక్సిన్లు అమ్ముడుపోయేదెలా..? అందుకే మోదీ వ్యతిరేక ఎజెండాను ఎత్తుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కరోనా మొదటి దశ విజయవంతంగా దాటడం అనేది భారత దేశ చరిత్రలో అతి పెద్ద విజయం. 2020 జనవరి నెల నుంచే పశ్చిమ దేశాల మీడియా ప్రొపగాండ మొదలు పెట్టింది. కరోనా మహమ్మారితో భారత్ లో శవాల గుట్టలు లేస్తాయని జోస్యం చెప్పింది. కనీసం రెండు కోట్ల మందైనా చనిపోతారని అంచనావేసి విపరీత ప్రచారం చేసింది. కానీ, వాళ్ల జోస్యం నిజం కాలేదు. ఫస్ట్ వేవ్ లో భారత్ లో మరణాలు రెండు కోట్లు కాదు కదా రెండు లక్షలు కూడా దాటలేదు. డెత్ రేట్ 1 పర్సెంట్ ను మించలేదు. పైగా హైడ్రోక్లోరో క్వీన్ ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసింది భారత్. సాక్షాత్తు ట్రంప్ సైతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించాలంటూ మోదీని అభ్యర్థించాడు. నిజానికి, ఇదే సమయానికి, అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. మొదట్లో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్,. ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్, బ్రిటన్ వంటి దేశాలు అతలాకుతలమవుతున్నాయి. దేవుడిని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామంటూ.. సాక్షాత్తు ఇటలీ అధ్యక్షుడే కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ, అదే సమయంలో భారత్ మాత్రం పెద్దగా నష్టపోకుండా మొదటి దశ నుంచి బయటపడింది. ఫస్ట్ వేవ్ లో భారత్ కరోనాను కట్టడి చేసిన తీరును చూసి ప్రపంచం నివ్వెరపోయింది. చివరికి చైనా తొత్తు అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ కూడా.. కొవిడ్ ను ఎదుర్కోవడం ఎలాగో భారత్ ను చూసి నేర్చుకోవాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాడు.
ఇక వాక్సిన్ విషయానికి వద్దాం. భారత్ కరోనా ఫస్ట్ వేవ్ ను పక్కాగా ఎదుర్కొంది సరే. అత్యధిక జనాభా కలిగిన ఆ దేశానికి కనీసం వ్యాక్సిన్లు అమ్ముకుని అయినా లాభపడదామంటే.. గ్లోబల్ ఫార్మా లాబీకి ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు మోదీ. అన్నీ దేశాల కంటే ముందే వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించి వాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టేలా.. స్వదేశీ ఫార్మా కంపెనీలకు వెన్నుదన్నుగా నిలిచాడు. టైం టూ టైం అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహించాడు. దీంతో భారత్ బయోటెక్ అనుకున్నది సాధించింది. అగ్ర దేశాలకు దీటుగా వ్యాక్సిన్ ను తయారు చేసింది. సరిగ్గా ఇక్కడే గ్లోబల్ ఫార్మా లాబీకి వెన్నులో వణుకుపుట్టింది. ప్రతి ఏటా గ్లోబల్ ఫార్మా చేసే వ్యాపార విలువ ఎంతో తెలుసా..? 4 నుంచి 6 ట్రిలియన్ డాలర్లు. అదే వాక్సిన్ల ద్వారానే 1.25 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. కానీ, భారత్ బయోటెక్ కోవాగ్జిన్,.. లైసెన్స్ తీసుకొని తయారు చేస్తున్న కొవీషీల్డ్ వ్యాక్సిన్లు గ్లోబల్ ఫార్మా లాబీ కడుపుకొట్టాయి. ఉత్పత్తిలోనే కాదు.. ధర విషయంలో మిగతా దేశాలకంటే 60 శాతం తక్కువగా ఉండడం.. పశ్చిమ దేశాలకు మింగుడు పడడం లేదు. అదీ చాలదన్నట్టు మోదీ వ్యాక్సిన్ దౌత్యంతో 60 దేశాలకు భారత వ్యాక్సిన్లను పంపిణీ చేయడం జీర్ణించుకోలేకపోయాయి. చివరికి జర్మనీ ఛాన్సిలర్ ఏంజిలా మెర్కెల్.. భారత్ ప్రపంచ ఫార్మా హబ్ గా ఎదిగేదాకా చూడటం మనం చేసిన తప్పు అంటూ బహిరంగంగా ప్రకటించింది. దీనిని బట్టి మోదీ పట్ల పాశ్చాత్య దేశాలు ఎంత అక్కసుతో రగిలిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అటు, తమ ప్రధాన వ్యాక్సిన్ అయిన ఆస్ట్రా జెనెకా వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం.. మరణాలు సంభవించడం.. అదే సమయంలో అదే కంపెనీ లైసెన్స్ తో భారత్ లో తయారైన కొవీషీల్డ్ ఎలాంటి దుష్ప్రభావాలు చూపకపోవడం.. గ్లోబల్ ఫార్మా లాబీకి పుండుమీద కారం చల్లినట్టయింది. పోనీ, వ్యాక్సిన్ల ఆదాయం పోతే పోయింది.. కనీసం మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లయినా అమ్ముకుని చిల్లర పోగేసుకుందామంటే.. మోదీ అదీ సాగనివ్వలేదు. మేకిన్ ఇండియాలో భాగంగా.. అన్నీ దేశీయంగానే తయారయ్యేలా ప్రోత్సహించారు. కరోనా ప్రారంభ సమయానికి సాధారణ ప్రజలకు అసలు పీపీఈ కిట్ అంటే ఏంటో తెలియదు. అలాంటిది, ప్రస్తుతం ప్రతిరోజూ లక్షల కొద్ది పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో 500 బిలియన్ డాలర్ల పీపీఈ కిట్లు, మాస్కుల మార్కెట్ కు కూడా గ్లోబల్ ఫార్మాకు భారత్ అవకాశం ఇవ్వలేదు. దీంతోపాటు వాక్సిన్ ఎగుమతులు చేసి సంపాదించాలనుకున్న 1.25 ట్రిలియన్ డాలర్లు కూడా గ్లోబల్ ఫార్మా ఆశల మీద నీళ్ళు చల్లింది. రెండు వాక్సిన్లు భారత్లోనే తయారు చేసుకోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగలేదు. దీంతో తమ కీలుబొమ్మ బైడెన్ అధికారంలోకి రాగానే తన అక్కసు ప్రదర్శించింది.
ఎప్పుడైతే 2021 జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారం చేశాడో.. ఆ తర్వాత కొద్దిరోజులకే వ్యాక్సిన్ ముడిసరుకుల ఎగుమతులపై నిషేధం విధించేలా.. గ్లోబల్ ఫార్మా లాబీ ఆయనపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించింది. తమ వ్యాక్సిన్ల తయారీకి ముడిసరుకు సరిపోవడం లేదనే సాకుతో ఇమ్మడిముబ్బడిగా రా మెటీరియల్ బ్లాక్ చేసింది. అసలు ట్రయల్సే పూర్తి కాని తమ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కోసం.. టన్నుల కొద్ది రా మెటీరియల్ ముందే బుక్ చేసి పెట్టుకుంది. ఇలాగే మరికొన్ని అమెరికన్ ఫార్మా కంపెనీలకు భారీ మొత్తంలో ఆర్డర్ చేసింది. దీంతో ఓపెన్ మార్కెట్ లో భారత్ వ్యాక్సిన్ ముడిసరుకు దొరకడం కష్టమైంది. ఫలితంగా భారత్ లో వ్యాక్సిన్ తయారీ నెమ్మదించింది. ఇది వ్యాక్సిన్ కొరతకు దారితీసింది. ఇదంతా తెలియన రాష్ట్రాలు కేంద్రం దుమ్మెత్తిపోయడం ప్రారంభించాయి. ఇలా మనలో మనకు తగువుపెట్టి.. మోదీకి మచ్చతెచ్చేందుకు గ్లోబల్ ఫార్మా ప్రయత్నించింది.
ఇదిలావుంటే, భారత్ లో సెకండ్ వేవ్ ఇంతలా విజృంభించడానికి కూడా గ్లోబల్ ఫార్మా లాబీ కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో విజృంభిస్తున్న కరోనా రకం.. రెండుసార్లు మార్పు చెందినట్టు పరీక్షల్లో తేలింది. ఇలా ఒకే వైరస్ రెండుసార్లు మ్యూటేట్ కావడం.. కరోనా వెలుగుచూసిన ఈ ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ జరగలేదు. అసలు డబుల్ మ్యూటెంట్ అన్న పదమే భారత్ లో తప్ప ఎక్కడా వినిపించలేదు. అంటే, ఇది ప్రత్యేకంగా పని కట్టుకొని వ్యాప్తి చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని చికెన్ నెక్ ప్రాంతం గుండా ఈ మ్యూటెంట్ ను దేశంలోకి ప్రవేశపెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హడావుడిలో వున్న బెంగాల్ అయితేనే ఇందుకు సరైన ప్రదేశమని.. అక్కడి నుంచి అయితేనే ఎవరికీ అనుమానం రాదని.. భావించి.. అక్కడి నుంచే భారత్ లోకి డబుల్ మ్యూటెంట్ వైరస్ ప్రవేశపెట్టారన్నది నిఘా వర్గాల సమాచారం. లేకపోతే, ఒక వైరస్, అదీకూడా ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను కబళిస్తున్న వైరస్.. కేవలం భారత్ లోనే డబుల్ మ్యూటేషన్ ఎలా జరగడం విడ్డూరమే కదా..! దీనిపై భారతీయ శాస్త్రవేత్తలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఇది కచ్చితంగా భారత్ పై అగ్రదేశాలు కలిసికట్టుగా చేస్తున్న బయోవార్ గా అనుమానించక తప్పదు. లేకపోతే, కేవలం డబుల్ మ్యూటెంట్ భారత్ లోనే ఎలా విజృంభిస్తుంది..? పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి సరిహద్దు దేశాల్లో దాని ప్రభావం కొంచెమైనా కనపడకపోవడమేంటి..? బైడెన్ రహస్య ఫ్రెండిషిప్ తో ఇది భారత్ పై చైనా చేసిన కుట్రగా రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరి, అమెరికా, చైనా బద్ధ శత్రువులు కదా..! ఎలా మద్దతు ఇచ్చిపుచ్చుకుంటాయనే అనుమానం రావొచ్చు. అయితే, నువ్వు లేదంటే నేను.. మధ్యలో మూడోవాడికి అవకాశం ఇవ్వొద్దన్న సామెత ఉండనే వుంది కదా..! ఇదే ఇప్పుడు జరుగుతున్న జగన్నాటకం. నిజానికి, జో బైడెన్ విజయం వెనుక చైనా హస్తం వుందన్నది సుస్పష్టం. పైగా బైడెన్ మంత్రివర్గంలోని అధికారులంతా కరుడుగట్టినన కమ్యూనిస్టు భావజాలం కలిగినవారే. కాబట్టి, పైకి కనపడకుండా చైనాకే మద్దతు ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా మోదీ ఇప్పుడు వారికి ఉమ్మడి శత్రువు. ఆయన భారత ప్రధానిగా వుంటే.. అటు గ్లోబల్ ఫార్మా, ఇటు ఆయుధ లాబీలతో పాటూ.. ఆయిల్ లాబీ పప్పులు ఉడకడం లేదు. అందుకే మూకుమ్మడిగా కుట్రలు చేస్తున్నాయి. వీరి కుట్రలకు, విదేశీ బిస్కెట్లకు అలవాటు పడిన పెంపుడు మీడియా ఓవైపు.. అధికారం కోసం ఆవురావురంటున్న ఇటలీ ఫ్యామిలీ ఓవైపు ఇతోధికంగా సాయం చేస్తున్నాయి. దేశంలో కరోనా మరణాలను మాత్రమే హైలైట్ చేయడం, భారతీయ వ్యాక్సిన్లపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం వీరికి నిత్యకృత్యంగా మారింది. ది గ్రేట్ విపక్ష ఇటలీ ఫ్యామిలీలో ఇప్పటివరకు ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోలేదు. కొవాగ్జిన్ తీసుకుంటే ఎక్కడ బైడెన్, జిన్ పింగ్ మనసులు గాయపడతాయోమోనని పాపం వాళ్లు వ్యాక్సిన్ కూడా తీసుకోవడం లేదు. బహుశా భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వేయించుకుంటారేమో. మోదీని గద్దె దించేందుకు ఎంతగా రగిలిపోతున్నారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా..?
అమెరికాలో ఒక నల్ల జాతీయుడు అమెరికన్ పోలీసు చేతిలో హత్యగావింపబడటం దానిని ఎన్నికల ప్రచార ప్రధాన అస్త్రంగా వాడుకొని అక్కడ చైనా అనుకూల లెఫ్ట్ వింగ్ అధికారంలోకి వచ్చింది. ఆ లెఫ్ట్ వింగ్ ను నడిపిస్తున్న గ్లోబల్ ఆయుధ, ఆయిల్, ఫార్మా లాబీలే.. దేశంలో కాంగ్రెస్ మద్దతుతో కరోనాను పెనుభూతంగా చూపిస్తున్నాయి. ఇందుకు మోదీనే బాధ్యుడిగా చిత్రీకరిస్తున్నాయి. కానీ, ఒక్కటి మాత్రం నిజం. మోదీ ఉన్నంత కాలం DRDO అద్భుతాలు చేస్తుంది. త్రివిధ దళాలు శత్రువుకు చుక్కలు చూపిస్తాయి. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించడంలోనే కాదు.. విపత్కర పరిస్థితుల్లో పౌరులకు రక్షణగా నిలుస్తాయి. కొవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తాయి. కరోనా ఔషధాలను కూడా కనిపెడతాయి. విదేశీ కుట్రలను వెలుగులోకి తెస్తాయి. అందుకే మోదీని ఏదో విధంగా దించి భారత్ ను అభాసుపాలు చేయడమే గ్లోబల్ ఆయుధ, ఫార్మా, ఆయిల్ లాబీల లక్ష్యం. మరి, ఈ కుట్రలను ఛేదించుకొని మోదీ నిలుస్తారా..? లేక ట్రంప్ లా బలవుతారా..? అన్నది మనమీదే ఆధారపడి ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి