ధనం అంటే రూపము లేక వస్తువా శక్తి లక్షణమా లేక మరే దైనానా పరిశీలన. మహా భాగ్యం అనగా ఆరోగ్యమని వేద వచనం. అనారోగ్యం దాపురించిన అనుభవించుటకు ఏమీ వుండదు. భాగ్యం అనగా పరిమితి అది ఏదైనా కానీ. మహా అనగా అనంతమైన శక్తి వలన ఆరోగ్యం. దీనిని ప్రకృతి వలననే వశపరచుకొనుట తల్లి గర్భం నుండే మూల సూత్రం. ధనం అనగా అగ్ని, వాయువు, సూర్యశక్తి, వసు భూమి శక్తి ద్వారా సస్య శక్తి సృష్టి చైతన్య శక్తి, యింద్ర యింద్రియశక్తి,బృహస్పతిః,దైవ శక్తి,వరుణ శక్తి నీటి శక్తి, వీటి స్వరూపములు వాటి ద్వారా వచ్చు లక్షణ శక్తిని ధనమని అది శరీరములో ప్రకృతిలో సమ పాళ్ళలో వున్నట్లయితే ఆరోగ్యం. అదే మహా భాగ్యం. శుద్ద లక్ష్మీ మెూక్ష లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీః లక్ష్మీ వరలక్ష్మీ ఈశ చ సుప్రసన్న వరదా శుభాః.యిక్కడ మందుగా శుధ్దంతో స్వచఛ్చతో ప్రారంభం మెూక్షమని, తరువాతనే జయం అని అనగా శుధ్ద తత్వ ఙ్ఞానం తో కూడిన పునరావృత్తి రహితరహితే మెూక్షమని లలితా సహస్రం వలన తెలియుచున్నది. అమ్మ సులువుగా మెూక్షమిస్తుందా? అయితే సృష్టి ఆగిపోవుట అమ్మకు యిష్టంలేదు. అది ధర్మ మార్గమున నడచుటయే తల్లి వుద్దేశ్యం. ధర్మ మార్గమే ప్రకృతి. అధర్మమార్గములో నడచిన తానే లయం చేయుటకు సృష్టించిన వారే లయమునకును కూడా అర్హత కలిగియుండును. పైన తెలిపిన ధనమునకు అర్ధం ప్రకృతి రూపమే శక్తియని ఆ చైతన్య శక్తియే ధనం.ధనం అనగా ఇ అనే శక్తి ++++......వృధ్దియగుట అనంతమగుటయే. అది ప్రకృతి లోనైనా లేక అట్టి ప్రకృతి కారణమైన దేహములోనైనా. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి