7, ఆగస్టు 2021, శనివారం

శ్రీ దేవరాహా బాబా ( దేవరియా బాబా ) చరిత్ర - 1

 🌹🤘🌹🤘🌹🤘🌹🤘🌹🤘🌹

*శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే*

_"ఓం దేవరాహాయ దిగంబరాయ మంచాసీనాయ నమో నమః."_

*బ్రహ్మర్షి శ్రీ దేవరాహా బాబా ( దేవరియా బాబా ) చరిత్ర - 1 వ భాగం*


అనంత శక్తి సంపన్నమూ, ఆధ్యాత్మిక వైభవోపేతమూ అయిన పవిత్ర ధరిత్రి ఈ భరతభూమి. మహాత్ములకు, సిద్ధులకు, మహిమాన్వితులకు ఆవాసమిది. వివిధ కాలములలో వివిధ సంప్రదాయములకు చెందిన మహనీయులు ఉద్భవించి- తమ శక్తితో, సామర్థ్యముతో విశ్వమునకు శాంతిని ప్రబోధించారు. అయితే ఇందులో కాలాతీతులు అనిర్వచనీయ శక్తి సంపన్నులు అయిన మహా యోగులు కొంతమంది. వారిలో _*సుప్రసిద్ధులు బ్రహ్మర్షి యోగిసామ్రాట్ శ్రీ దేవరాహా బాబా 🤘*_ ఒకరు.


రాధాకృష్ణుల పవిత్ర పాదస్పర్శతో పునీతమైన ప్రాంతము బృందావనము. సుందర యమునా నదిలో ఒక సుందర మందిరమున దర్శకులందరి చూపు ఒక భవ్యమైన, దివ్యమైన మూర్తి పై ఉన్నాయి అది విగ్రహమే కానీ అందరికీ అభయప్రదానము చేస్తూ ఉన్న సజీవ మూర్తియా అన్నట్లు ఉన్నది. ఆ దివ్య మందిరము మరెవరిదో కాదు ... *శ్రీ దేవరాహా బాబా సమాధి మందిరము*. _అది విగ్రహం కాదు సాక్షాత్తు శ్రీ దేవరాహా బాబాయే._


జ్ఞాన వృద్ధుడిగా, గొప్ప యోగ సాధకునిగా, కల్పాంతర యోగిగా, ఆశ్రితులకు ఆనంద ప్రదాతగా, ఆర్తత్రాణ పరాయణుడిగా, భక్తుల పాలిటి భగవంతునిగా లోకంలో ఆరాధనలను అందుకుంటున్న దివ్య భవ్య స్వరూపం శ్రీ దేవరాహా బాబా. 

*జననమన్నదే లేని శరీరంతో దాదాపు 900 సంవత్సరాలు ఆర్తులనందరినీ అనుగ్రహించిన ఆ మహనీయుని జీవితంలోని అద్భుత విశేషాలను, ఆశ్చర్యపరిచే అనుభవాలను ఆస్వాదించి, ఆనందిద్దాం....!*🙏

*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*


🌹🤘🌹🤘🌹🤘🌹🤘🌹🤘🌹

కామెంట్‌లు లేవు: