7, ఆగస్టు 2021, శనివారం

అదే ఆఖరి మాటా .. ?*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాకు నచ్చిన విజయ వెంకట కృష్ణ సుబ్బారావు పొన్నాడ గారి హాస్య కథనం.*

                 🌷🌷🌷   


*అంతేనా ... అదే ఆఖరి మాటా .. ?* 

రొక్కించి మరీ అడిగాను . 

ఒళ్ళు మండిపోతోంది. తను అడిగింది ఏనాడైనా కాదన్నానా? వేలకు వేలు పోసి ఏదడిగితే అది క్షణాల్లో తీసుకొచ్చి ఒళ్లో పోయలేదూ .. అదే అదే ఒళ్లో పెట్టలేదూ ? 

పాతికేళ్ళ ' కాపడం ' లో నాకంటూ ఏనాడన్నా ఏమైనా .. కొనుక్కున్నానా ? ఒహ వేళ ఒహటో అరో కొనుక్కున్నానే అనుకోండి ..అదన్నా నా ఇష్టప్రకారం ఏదన్నా సాగిందా హంఠ?

షష్టి పూర్తి మహోత్సవం దగ్గర కొచ్చేస్తోమ్దీ .. హేదో .. సరదాగా .. ఆ ఒక్కటీ .. కొనుక్కుంటా కాంతం ... హన్నా ... ! హంతే ! 

పోయిన ఎలక్షన్లలో రాబోయే రిజల్ట్స్ లో డిపాజిట్ కూడా రాదు సుమీ హని .. సర్వేలో చెప్పిన వాడి మీద దూకి పీక పిసకడానికి తయారైనట్లు హెంత ఆర్భాటం చేసిందీ ?

గుండె గుభేల్ మంది. హేదో .. అలవాటైన ప్రాణంకాబట్టీ తట్టుకుని కొట్టుకుంటోంది !

తను హెన్ని వెండి, బంగారు నగలూ నట్రా చేయిన్చుకోలేదూ?

హేదో ... ' తీరని కోరిక తీయ తీయగా ' అనే పాత పాట గుర్తుకొచ్చి .. మనసులోని కోరిక బయటికి తీయగా, తీయగా ... ,

' నో ... కుదరదు కాక కుదరదు అని ఘీంకరించడమే కాకుండా , హెవరన్నా వింటే నవ్వి పోతారు హంటుందా? హేంతటి అవమానం? హేంతటి అవహేళన? 

దుర్యోధనుడి ఏక పాత్రాభినయనం లో అనేకానేక సత్కారాలందుకున్న ఈ అభిమాన ధనుడికా, ఈ ఘోరాతి ఘోర హవమానం ! 

చండ ప్రచండ భానుడి తీక్షణాతి తీక్షణమైన అగ్ని కిరణాలను కూడా లెక్క చేయకుండా, పట్టుకుని, చుట్టుకుని, తట్టుకుని నిలబడ్డ ఈ మకుటం లేని మారాజు తలకట్టుని ఉన్న పళాన ఓ ప్రక్కకి నెట్టేసి తీసి గోడకి కొట్టేసినట్టు ఖాదూ? 

హెంతటి అవహేళన?  

హెంతటి అప్రదిష్ట?

'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అని మహానుభావుడు మనువు ఊరికే చెప్పాడంటారా? 

ఏ పెళ్ళానికీ ... స్వాతంత్ర్యం కూడదు ! 

హదీ మనకి సలహాలు చెప్పే విషయంలో అస్సలు ఖూడదు!

ఆలీ ..... న సలహా దేనా పడేగా!

హన్తే ... మనకి కోపం నషాళానికి అంటినప్పుడు .. హిలా , రాని హిందీలో వాయించేయాలి!

బంగారం విష్యం పక్కన పెట్టేద్దాం!

వెండివి .. ఎన్ని వస్తువులు కొన్నాను?

హెన్ని ఆభరణాలు చేయించాను?

పెళ్లి రేపనఘా .. కాలి పట్టీలు హివ్వలేదూ? హిప్పుడే ఇవన్నీ హెందుకూ ... మా హమ్మ తిడుతుంది బాబూ .. అంటూ .. వయారాలు పోతూనే ... ఈ పట్టీ సరిగ్గా పట్టడం లేదు ఓ సారి చూడండి అంటూ ... నా చేత ఆ పట్టీ పెట్టిన్చుకోలేదూ? 

అదే సమయానికి హేక్కడినుండి ఊడిపడ్డాడో వాళ్ళ మావయ్య ' , " అక్కా , బావ గారూ రండి రండి .. ఈ వింత చూడండి ... మన అమ్మడిని ... అల్లుడి గారితో హప్పుడే కాళ్ళు వత్తిన్చేసుకుంటోంధీ '" అంటూ నానా రభసా చేసి నన్ను నవ్వుల పాలు చేయలేదూ ? 

వాళ్ళ వాళ్ళందరూ ... మాతల్లె , మా హమ్మే హేంత హెదిగి పోయావే .. ' హింక హప్ప గింతలప్పుడు , అనవసరంఘా ఏడవక్కర్లేకుండా చేసావ్ ..గోదారికి టైం సరిపోతుందో లేదో అనుకుంటున్నాం సుమీ .అని హెంత ఆనందపడి గెంతలేదూ ?

పిచ్చి సన్నాసిని సంసారమనే ఊబిలో పెళ్లి కి ముందే కాలేసి దిగబడి పోయాననే విషయం హప్పుడు అర్ధం అయి ఏడవ లేదు ! 

హిప్పుడేడ్చి లాభం ఏమిటి గనుఖ !!

సరే అయితే ... చేయించుకోవడం మానేస్తాలే ... హన్నా ! 

అదీ కీచు గొంతుకతో !

దానిఖీ ఒప్పుకోదే .... !

అస్సలు , మీ కేమన్నా బుద్దుందా ? హంది !

బుద్దుంటే ... నిన్నెందుకు ..... ( ధైర్యం చాలక ... మాటలు మింగేసా ) !

హేమిటీ ... బుద్దుంటే ... హన్టున్నారూ అని గదమాయించి పారేసింది ..!

అదే .. బుద్దుంటే .. ఆ కోరిక ఇప్పుడెందుకు కోరతానూ ... హన్నా ! ... అన్నా !

అస్సలు ఆ బట్టతల మీద ఉన్నవే ... గుప్పెడు వెంట్రుకలు ... పెళ్ళికీ , అవే , ఇప్పుడూ అవే ..! ( అవే ఎందుకుంటా య్ .. హెన్ని సార్లు మ్రొక్కు తీర్చుకోలేదూ .. హెన్ని సార్లు క్రొత్త వెంట్రుకలు రాలేదూ ... ? అందామనుకున్నా ఖానీ హెందు కొచ్చిన తల చిక్కు లని ఊరుకున్నా )

'ముక్కుసూటిఘా ఉందే .. 'కన్నీ ' , నిజాయితీ పరుడిలా నే ఉన్నాడు కుర్రాడు ... ఆ కళ్ళు , ఆ చూపూ చూస్తుంటే వట్టి అమాయఖ ప్రాణిలా ఉన్నాడు ! నువ్ చెప్పిందల్లా చేసేట్లానే ఉన్నాడే .. చేసేసుఖో ... అని మా వాళ్ళంతా గోలెడితే ఖాదూ మిమ్మల్ని చేసుకున్నదీ ? అంది !

అప్పటికి హేదో నన్ను ఉద్ధరించడానికే నా చేత తాళి కట్టించుకున్నట్లు !

ఆ గొడవంతా ... హిప్పుడెందుకులే హన్నా ... బుద్ధి తక్కువై !

' గొడవా .... అదీ ... నేను చేస్తున్నానా ' అని మీద పడి నంత పని చేసింది ...!

పక్కకు తప్పుకుని హమ్మయ్య అనుకుని , ఊపిరి పీల్చుకున్నా !!

ఓ నిముషం ఆగి .. నెమ్మదిగా హన్నా ... అయితే ... ఊరుకోనా , అదే ... అది చేయించుకోవడం మానేయనా ... అని .... అంతే ! 

' మళ్ళీ అదే పాట !! ఆ బోడి గుండు మీద ఉన్న నాలుగు వెంట్రుకలనీ సవరించడానికి మీకు .. ' వెండి దువ్వెన ' కావాల్సి వచ్చిందీ ? నవ్వి పోతారు ఎవరన్నా వింటే ... మీ అమ్మ గారు ... , నాకు ఆవిడ గారి ' బంగారు జడ గంటలు ' ఇచ్చారనేఘా మీ బాధ ! నా జడ చూసి , మెచ్చుకుని అవి నాచేత్తో పెట్టారు ... !

మీకూ యద్దనపూడి సులోచనా రాణి గారి నవలా నాయకుడిలా ... గిరజాల జుట్టు ఉండి ఉంటే , నేనే చేయిన్చేదాన్ని వెండివేం ఖర్మ .. బంగారం దువ్వేన్లనే ఓ డజను ... వెండి దువ్వెన కావాల్సి వచ్చిందంట .. వెండి దువ్వెన !! 

ఆ సణుగుడు ఆపి, వెళ్లి .. పుల్ల మామిడి కాయలు తెండి ఓ డజను ... పులిహారావ ఖాయ ' వేస్తాను ... మా మావయ్య వస్తా నన్నాడు .... తనకి అదంటే చాలా ఇష్టం , అని కూరల సంచీ ... ముఖాన కొట్టింది !

ఎవడితో చెప్పుకోను ... నా బాధ !! 

ఆ గోవిందు డితో తప్ప .. ఈ ఉన్న నాలుగు వెంట్రుకలనీ కూడా , ఆనందంగా మ్రొక్కు రూపంలో తీసుకునేది హాయనేఘా !! ఖానీ మళ్ళా ఆ నాలుగింటి నే ప్రసాదిస్తావేం స్వామీ ? ఈ సారన్నా గుండు నిండుగా గుత్తులు గుత్తులుఘా గిరజాల జుత్తు ని ప్రసాదించు స్వామీ ..... " అని అడిగేయాలి ... !

గోవిందా ! గోవింద !

లాభం లేదు...ఆ జటాఝాటధారినే అడగాలి .. ఓ ఝూటాన్ని మొలిపించమనీ ... ఒంటికాలిమీద నిలబడి తపస్సు చేసైనా సరే !

ఇప్పటినుంచే మొదలెట్టేస్తే పోలే ....

ఓం హర హరా .... ఓం నమః శివాయః 

      🌺🌺🌹💐🌹🌺🌺

 *డా. పొన్నాడ*

కామెంట్‌లు లేవు: