16, ఆగస్టు 2021, సోమవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*970వ నామ మంత్రము* 16.8.2021


*ఓం సువాసిన్యై నమః*


నిత్య సుమంగళియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సువాసినీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సువాసిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులు ఆ తల్లి కరుణచే శుభప్రదము, సుఖప్రదము, శాంతిప్రదమైన జీవనమును కొనసాగించుదురు.


పరమేశ్వరి సర్వమంగళ, నిత్యయౌవ్వని. నిత్యసుమంగళి. నిండు ముత్తైదువుగా ఆ తల్లి పచ్చని పసుపురంగు కూడిన ముఖంపై, సిందూరవర్ణభరితమైన కుంకుమతో *(పసుపుకుంకుమలతో)* , గలగలలాడుచూ మంగళరవములు వినిపించు గాజులతో *(గాజులు)*, మంగళప్రదమైస కాలి *మట్టెలు* వాటి సవ్వడితో, శుభప్రదమైన కాంతులు విరజిమ్మే *మంగళసూత్రము* లతో, ధగధగకాంతిపుంజములీను గళసీమయందలంకరింపబడిన *నల్లపూసల* తో సౌభాగ్యవతిగా, నిత్యసుమంగళిగా దర్శనమిచ్చు అమ్మవారు ముత్తైదువులలో తానొక ముత్తైదువ. అందుకే ఆ అమ్మ *సువాసినీ* యని అనబడినది.


పసుపు కుంకుమలు, గాజులు, మట్టెలు, మంగళసూత్రాలు, నల్లపూసలు సౌభాగ్యాభరణములు. ఇవి ధరించిన స్త్రీమూర్తి *సువాసిని* యని అనబడుతుంది. అమ్మవారు నిత్యసుమంగళి. అమ్మవారు ఎన్ని అవతారములు ధరించినను, పరమశివుడే ఆమె భర్త. పరమశివుడు మృత్యువుకే మృత్యువు. ఆయనను ఎదిరించు తాహతు మృత్యువుకు కూడా లేదు. అందుకే ఆయన మృత్యుంజయుడు. మృత్యుంజయుడే తన భర్త అయిన పరమేశ్వరి *సువాసినీ* యని అనబడినది.


అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం సువాసిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: