24, మార్చి 2022, గురువారం

ప్రాచీన వృక్ష వైద్య గ్రంధం

 సటికా వ్రుక్షాయుర్వేధం  - ప్రాచీన వృక్ష  వైద్య గ్రంధం .


 * వృక్ష జాతులు అనగా తిన్త్రిని మామిడి మొదలగు చెట్లు ను తీగలుగా మార్చుట - 


  బియ్యపు పొడి 1 భాగము , మినుముల 1 బాగము , నలగ దంచిన వడ్ల పిండి 1 భాగము , నువ్వుల పిండి 1 భాగము, వీటిని మాంసము కడిగిన నీళ్లలో కడిగి పసుపు పొడి పోగవేసి పాటి మట్టి నేలలో నాటితే అవి తీగలుగా మారును.


 చెట్లు అప్పటికి అప్పుడే పెరిగి చిగుర్చుట  - 


 * అంకోల తైలము లొ యే చెట్టు యెక్క బీజములు నైనా నూరు మాట్లు తడిపి వడగండ్లతో కలిపి పాటిమట్టి లొ నాటితే అప్పటికప్పుడే చెట్టు మొలిచి పండ్లు, పువ్వులు ఇచ్చును.


 బీజములు తొందరగా మొలుచుటకు  - 


 ఆయా పండ్లు కాచే సమయమున వాటి విత్తనాలు సేకరించి వాటిని బాగుగా ఎండించి పాలలో తడిపి అయిదు దినములు ఎండనించి వాయు లవంగాల కషాయముతో కలిసిన నేతితో పోగవేసి పంచాంగం, బృహతి, నిప్పుల బూడిద ను పాలలొ కలిపి ఆ విత్తనాలను దీనితో పిసికి ఆ ప్రకారము అయిదు రోజులు అయిన పిమ్మట ఆ బీజములు ఆవు పేడతో , ఆవు మూత్రములో ఒక్కో దినము నానబెట్టి విత్తిన మొక్కలు తొందరగా మొలుచును . 

 

 *  చేప మాంసమును , ఆవు పేడతో కలిపి చెట్లకు వేసి యావలు, నువ్వులు , మిణుములు, పెసలు, వులవులు ఈ ఐదింటిని సమబాగాలుగా కలిపి నీళ్లు పోసి వుడకపెట్టి ఆ నీళ్లు చల్లార్చి రెండు దినములు వరసగా చెట్లకు చల్లితే చెట్లు విశేషముగా ఫలించును. 


 * మామిడి చెట్లకు నక్క మాంసం , ఉడుము మాంసం లేదా లేడి, పంది మాంసం , రావి చిగుల్లు, మర్రి చిగుల్లు , అత్తి చిగుల్లు, మామిడి చిగుల్లు, నేరేడు చిగుల్లు, కషాయం పెట్టి చల్లార్చి పాదులో పొసిన మంచి పండ్లు పండును. 

 

 * మామిడి చెట్టు వేరు దగ్గర చుట్టు గొడ్డలితో కొంచం కాటు చేసి కషాయం పొసిన విశేషమైన ఫలములు ఇచ్చును.


 * పెసలు , మినుములు ఉడక పెట్టి చల్లార్చి ఆ నీళ్లు తేట వంచి ఆ గుజ్జు కొబ్బరి చెట్టు వేళ్ళకు పట్టించి ఉప్పు నిండా వేసి ఆ నీళ్లు పోస్తే పెద్ద పెద్ద కాయలు కాయును , కాయలు రాలవు.


 * పోక చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పైన ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల చుట్టు త్రవ్వి పైన చెప్పిన కషాయము పొస్తే అధికముగా పండును.


 * అరటి చెట్టు కు ఏనుగు దంతపు పొట్టు కాల్చిన నిప్పులోగాని, పంది పెంటికలు, గుర్రపు పెంటికలు కాల్చిన నిప్పులో గాని ఇనప సలాకు ఎర్రగా కాల్చి చెట్టు మొదట వేరులో గుచ్చితే చాలా గొప్ప ఫలితాలు ఇచ్చును.


 * రేగు చెట్టుకి నువ్వులు , పెసలు సమబాగములు గా చేర్చి దానితో కొంచం అతిమధురం వేసి చెట్టు చుట్టు వేసి మాంసం కడిగిన నీళ్లు పొసిన మరియు నూవుల పిండి , అతిమధురం కలిపి ఎరువు వేసిన తియ్యటి ఫలములు మరియు తియ్యటి ఫలములు ఇచ్చును. 


 * పత్తి విత్తనాలను ఆవు పేడలో , ఆవు పంచితములో చాలుమార్లు తడిపి పేడనీళ్ళు చల్లుతూ నాటిన తరువాత పందికొవ్వు, మాంసం కడిగిన నీళ్లు చల్లిన అది తన జాతిని విడిచి నిమ్మ జాతిగా మారును. 


 *  తామరవిత్తనాల చూర్ణము ఉడుగ తైలముతో నానబెట్టి నీటి యందు వేసినంతనే తామర తీగలు పుట్టును . 


 *  నల్ల కలువ బీజములను ఉడుగ తైలముతో తడిపి నీటియందు వేసిన వెంటనే తీగలు బయలుదేరి పుష్పించును . 


 *  కలువ దుంపలు తెచ్చి గేద పేడలోను  , గేద మూత్రములోను  7 సార్లు భావన చేసి నాటిన వెంటనే మొలకెత్తును . 


 * పత్తిగింజలు ఆవుపేడలో , ఆవు మూత్రములో భావనచేసి నాటి పందికొవ్వు , మాంసము కడిగిన నీరు పోయుచున్న నిమ్మచెట్టుగా మొలకెత్తును . 


 *  దాసనపు చెట్టుకు పాలుపోయుచున్న తెల్లని పువ్వులు పూచును మరియు ఎర్రని పువ్వు పూచెడి చెట్లకు వేర్ల వద్ద జాగ్రత్తగా తవ్వి ఆ వేర్లకు నెయ్యిని పట్టించుచున్న తెల్లగా పూచును . తెల్లగా పూచెడి చెట్ల వేర్లకు తేనె పట్టించుచున్న ఎర్రగా పూచును . ఈ పధ్ధతి అన్నిచెట్లకు పనికివచ్చును . 


 *  పారిజాత ( పగడమల్లె ) చెట్టు వేరుకు రంధ్రము చేసి ఆ రంధ్రము నందు మల్లెతీగను గుచ్చి మట్టికప్పి ఆ రెండు కలిసిపోయి ఒకటైన తరువాత మల్లె వేరు కత్తిరించి వేరేగా పాతిన యెడల ఎర్రని మల్లె పువ్వులు పూచును . మంచి సువాసన కలిగి ఉండును . 


 *  ఏ చెట్టు విత్తనములు అయినా సరే పాతిపెట్టి వాటికి ఏ రంగు నీటిని పోయుచున్న ఆ రంగు పువ్వులే పూయును . 


 *  తెల్ల జిల్లేడు విత్తనములును , ఎముకలు కలిగిన భూమిలో పాతిన ఎర్రని పువ్వులు పూయును . 


 *  వంకాయ విత్తనములను తేనెతోను , నేతితోను భావన చేసి పేడలో నాటిన పెద్ద వంకాయలు అగును . 


 *  చెట్టు నందే ఎండిన మునగకాయ తెచ్చి దాని విత్తనములను కొన్నింటిని తీసివేసి ఆ తీసేసిన విత్తనముల స్థానములో కాకర విత్తనములు ఉంచి దానిని దారంతో గట్టిగా బంధించి భూమిలో పాతి నీళ్లు పోయుచున్న రెండు జాతుల కాయలు కాచును . 


 *  యవలు , నువ్వులు , పసుపు చెట్టు ఆకులు వీటిని పత్తిచెట్టు మొదట వేసి నీళ్లు పోయుచున్న ఎర్రని దూది పుట్టును . 


 *  బూరుగు చెక్క , పసుపు , నీలి , కరక , తాడి , ఉసిరికలు , చెంగల్వకోష్టు , సారాయి తీసుకుని వీటన్నింటిని కలిపి ముద్దగా నూరి ప్రతిచెట్టుకు లేపనం చేసి నీళ్లు పోయుచున్న చిలుక రెక్కల వంటి దూది పుట్టును . 


 *  మంజిష్ట , నువ్వులు , యవలు , చింతగింజలు , జీవంతి ఆకు , మనశ్శిల  వీటన్నిటిని నూరి చెట్టుకు పూసి ఆవు , గొర్రె , మేక వీటి పాలు పోయుచున్న నల్లని దూది పుట్టును .


 *  నువ్వులు , కడుగు , వాయువిడంగాలు , గోమయము వీటన్నింటిని చెట్టు మొదట వేసి చెరుకు రసము పోయుచున్న అకాలము అనగా పండ్లు , పువ్వులు పూయని సీజన్ లో కూడా పుష్పించి చెట్టు పువ్వులు పూయును , పండ్లు ఇచ్చును . 


 *  తేనె , అతిమధురం , నువ్వులు , కోష్టు , ఇప్పపువ్వు వీటన్నింటిని చేర్చి ముద్దగా నూరి చెట్టు వేరు నందు ఉంచి మన్ను కప్పిన టెంక లేని అనగా విత్తనములు లేని కాయలు కాచును . 


      పైన చెప్పిన విషయాలలో భావన చేయుట అనగా తేనెలోగాని , నెయ్యిలో గాని లేక మరేదైనా ద్రవపదార్ధము నందు విత్తనాలను నానబెట్టి అటు తరువాత ఎండించండం . ఇలా పలుమార్లు చేయుట వలన మంచి ఫలితాలు పొందవచ్చు.


       సరైన ముహూర్తము నందు పంటలు వేయుట , పొలమును దున్నుట వంటివి కూడా దిగుబడి పైన ప్రభావం చూపించును . ఇటువంటి ముహూర్తాలను కూడా నేను నా  గ్రంథాలలో సంపూర్ణముగా వివరించాను . 


          మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కామెంట్‌లు లేవు: