31, మే 2022, మంగళవారం

పుష్కరిణి - ఫలశ్రుతి

 వైశాఖ పురాణం


30వ అధ్యాయము - పుష్కరిణి - ఫలశ్రుతి


నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును.


దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా నేకాదశియందు అమృతము జనించినది. ద్వాదశినాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడమృతమును దానవులనుండి కాపాడెను. త్రయోదశినాడు దేవతలకు నమృతమును యిచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను. పూర్ణిమనాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ యను మూడు తిధులకును, "ఈ మూడుతిధులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను యిచ్చును. వైశాఖమాసము ముప్పది దినములును వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. యీ మూడు తిధులయందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము. ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను, దడచునంతవరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు, దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములు ఉన్నంతవరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠలతో నాచరించినవారు కోరినకోరికలను పొందుటయేకాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు. వైశాఖమాసముల నెలనాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధులయందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాసవ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని, గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు, లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి. కావున నీ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చి సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినములయందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు యెన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు.


శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు.


మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము యెక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయము కంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా.


నాయనా! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి యడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తికొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను.


అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.


ఈ యుత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి యింటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.


వైశాఖ పురాణం సమాప్తం.

మనోనైర్మల్యం

 శ్లోకం:☝️

*భ్రమన్ సర్వేషు తీర్థేషు*

    *స్నాత్వా నత్వా పునఃపునః |*

*నిర్మలం న మనో యావత్*

   *తావత్ సర్వం నిరర్థకం ||*

    - జనక శుక సంవాదం 


భావం: మనోనైర్మల్యం లేనంత వరకు ఎన్ని తీర్థాలలో పదే పదే మునిగినా, ఎన్ని దేవతలకు మ్రొక్కినా ఉపయోగం లేదు అని దేవీ భాగవతంలో శుకునితో జనకుని ఉవాచ.

మరొకచోట అంతఃకరణ శుద్ధి (మనోనైర్మల్యం) కొరకు తీర్థయాత్రలు చేయమన్నారు. రెండూ నిజమే! 🙏

30, మే 2022, సోమవారం

పొడుపు పద్యము

 మన తెలుగు భాష ప్రేమికులకు ఇదిగో మరో పొడుపు పద్యం. ఛేదించడానికి ప్రయత్నించగలరు. 


.... జాతీయ తెలుగు సాహితీ పీఠము …. 

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          ……  పొడుపు పద్యము  …...

ఆ. నాలుగక్షరముల మేలైన పలుకొండు 

మూడు, రెండు నరసి చూడ ''దురద'' 

ఓండు, రెండు, నాలు గొప్పును  ''చారు''యై   

పదము తెలుప వలయు పసిడి బాల..!

సుభాషితమ్

 🌄💫 *_-||శుభోదయమ్||-_*💫🌄

🪔 *ॐ卐 _-||సుభాషితమ్||-_ ॐ卐* 💎


శ్లో𝕝𝕝 కాలేవర్షతు పర్జన్య:పృథివీ సస్యశాలినీ! 

దేశోయం క్షోభ రహితో,బ్రహ్మణాస్సంతు నిర్భయా:!!


తా𝕝𝕝 *ఈ పుడమిని మేఘములు సరిఐన సమయములో కురియు గాక*...

భూమి సస్యస్యామలమగు గాక.....

*దేశములో ఏ సంక్షోభములు లేకుండు గాక*.... 

బ్రాహ్మణులకు సరిఐన గౌరవం లభించు గాక.... 🧘‍♂️🚩🌄🇮🇳🌅

సోమాతి(సోమావతి) అమావాస్య-విశిష్టత*

 *నేడు సోమాతి(సోమావతి) అమావాస్య-విశిష్టత*


సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.  మౌని అమావాస్య ని శని అమావాస్య అని కూడా పిలుస్తారు. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి. కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే.. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణాలు చేసి నట్లయితే అంతా శుభం కలుగుతుంది


సోమవతి రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…


దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.


సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.


నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ... ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.


శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి... తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.


సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే... సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.


🙏నమః శివాయ🙏

సమాధానం ఉండే ప్రశ్న - ప్రశ్నే

 సమాధానం ఉండే ప్రశ్న - ప్రశ్నే.


కానీ సమాధానం లేని కేవల ప్రశ్న, ప్రశ్న కాదు,

అది దైవస్వరూపమే.


ఆ సమాధానం లేని కేవల ప్రశ్న "నేనెవడను" అనేదే.


"నేనెవడను" అన్న ప్రశ్నే

బ్రహ్మవిష్ణువుల యెదుట శివజ్యోతి స్తంభంగా వెలసింది.


వెలసింది అంటే అప్పుడే వెలసింది అనికాదు,

బ్రహ్మవిష్ణువులకు అప్పుడే తెలిసింది అని.


దేశకాలములకు అతీతమైన పరమాత్ముడే 

ఆ స్తంభం.


సృష్టి అనే అంతవంతమైన తీగకు ఆలంబన 

ఆ అనంతమైన స్తంభం.


ఆ స్తంభం యొక్క అంతు(అంచు) కనుగొనాలని బ్రహ్మవిష్ణువులు చేసిన ప్రయత్నమే సైన్స్ లో తొలిప్రయోగం.


క్రిందకు తవ్వుతూ ఒకరు (విష్ణువు)

పైకి ఎగురుతూ ఒకరు (బ్రహ్మ)

అన్వేషణ ప్రారంభించారు.


ఉనికే లేని దేశకాలాలు వారి వ్యర్థప్రయత్నాన్ని చూసి ఎగతాళి చేశాయి.


విష్ణువు సిగ్గుపడి యథాస్థానం చేరుకున్నాడు.

"నాకు తెలియదు" అన్న పరమసత్యాన్ని ఆవిష్కరించాడు. శివుడు సంతోషించాడు.

కాలాన్నే చక్రంగా శివుని చేత బహుమానంగా పొంది చక్రహస్తుడైనాడు.


"కనుగొన్నాను" అనే ఓ పెద్ద అబద్ధంతో

 బ్రహ్మ అహాన్ని అలంకరించుకుని

దొంగసాక్ష్యాలతో తిరిగొచ్చాడు.

'గుడిలేని దేవుడు'గా శివుని చేత శాపం పొందాడు.

తన తలవ్రాతను తానే అలా వ్రాసుకున్నాడేమో!


కాబట్టి విజ్ఞానశాస్త్రంలో "తెలుసు" అనడం గొప్ప.

అధ్యాత్మికశాస్త్రంలో "తెలియదు" అనడం గొప్ప.


* * *


"నాకు తెలియదు" అని 

సిగ్గుపడకుండా చెప్పేవాడు - జ్ఞాని.


"నాకు తెలుసు" అని 

సిగ్గులేకుండా చెప్పేవాడు - అజ్ఞాని.


* * *


"నాకు తెలియదు" అన్నా

"భగవదిచ్ఛ" అన్నా

రెంటి అర్థం ఒక్కటే.


* * *


"నాకు తెలియదు" అన్న స్థాయికి శిష్యుణ్ణి ఎదగనిచ్చేవాడే నిజమైన గురువు.


"నాకు తెలుసు" అనే బరువును శిష్యుని బుర్రలో  పెట్టేవాడు కపటగురువు.  


జ్ఞానం పెరిగేకొద్ది మనం అజ్ఞానులమేమోనని తెలుస్తుంది...అంటారు వివేకానంద.


* * *


"అల్లా మాలిక్" అని బాబా అన్నా


"అప్పా! నీ ఆజ్ఞమేరకు వచ్చాను" అని రమణుడు అన్నా.


"అంతా జగజ్జనని ఇచ్ఛ" అని రామకృష్ణులు అన్నా


తమ అల్పత్వాన్ని, తెలియనితనాన్ని  బాహాటంగా తెలియజేయడానికే...


అందుకే వారి బోధనలన్నీ శరణాగతి వైపుకే దారి తీస్తాయి...


"నాకేమీ తెలియదు" అని ఉత్తినే మాట వరుసకు అంటే చాలదు, త్రికరణశుద్ధిగా నాకేమీ తెలియదు అని ఉండాలి.


పైకి "అప్రయత్నంగా" కనిపిస్తే చాలదు.

త్రికరణశుద్ధిగా  అప్రయత్నంగా ఉండాలి.


బరిణెలోకి ఏనుగును పట్టించలేం అని తెలిసి

అప్రయత్నంగా ఉండడమన్నమాట.


అంతేగాని పైకి చెప్పి...లోపల ప్రయత్నం చేయడం కాదు.


అప్పుడే అది నిజమైన శరణాగతి అవుతుంది.

అంతేగానీ భగవాన్ అన్నట్టు ప్రతిరోజా బోర్లాపడి లేస్తుండడం శరణాగతి కాదు...


పరిమితులను గుర్తించడం ఒక ప్రజ్ఞ.


ప్రకృతిలోని సహజ పరిమితుల నుండి నువ్వు విముక్తి పొందాలని ప్రయత్నిస్తున్నావ్. అదే నీ దుఃఖానికి, బాధకి కారణం.


* * *


84లక్షల జీవరాసుల్లో ఒక్క మనిషి తప్ప

మిగతా అన్ని జీవరాసులూ

ప్రకృతి శాసనాన్ని ఎదిరించక, ఏ సందేహమూ లేక బ్రతికేస్తున్నాయి...చచ్చిపోతున్నాయి...


ఒక్క మనిషే ప్రకృతి శాసనాన్ని అధికమించడానికే ప్రయత్నిస్తుంటాడు.


బాహ్యంగా చేసే ప్రయత్నానికి సైన్స్ అని పేరు.

ఆంతరంగా చేసే ప్రయత్నానికి తపస్సు అని పేరు.


వైజ్ఞానికంగా మార్స్ పైకి రాకెట్తో దూసుకెళుతున్నా సరే...

 

సౌకర్యవంతమైన వస్తువులు ఇంటి నిండా నింపేసుకున్నా  సరే...


ఇంకా ఏదో అసంతృప్తి...ఏదో అస్పష్టత...

అంతరాంతరాలలో ఏ మూలో నలుగుతున్న సంశయం...గంభీరమైన విచారం...


ఇది మనిషికి అనాది నుంచి వస్తున్న స్వాభావ వారసత్వం కాబోలు...


ఈ తత్కాలిక ఐహిక సుఖాల నుంచి 

ఈ మానసికవ్యధ నుంచి తప్పించుకుని 'శాశ్వతానందం' పొందే  దిశగా మనిషి చేసే ప్రయాణమే ఆధ్యాత్మికం అయ్యింది.


* * *


పుట్టాలని పుట్టలేదుగాని, పుట్టాడు.

చావాలని చావడు గాని, చస్తాడు.


ఎందుకు పుట్టాలో, ఎందుకు చావాలో

చచ్చేలోపు కనుగొనే ప్రయత్నమే ఆధ్యాత్మికం అయ్యింది.


ఈ శరీరమే నేనని మోసుకు తిరుగుతుంటాడు...  శరీరం లోపల ఏం జరుగుతుందో (అనాటమీ) తెలియదు.


ప్రతిదానికీ  నేను-నేను అంటూ తెలిసినట్టే వ్యవహరిస్తుంటాడు.

కానీ నేను (ఆత్మ) గురించి ఏమీ తెలియదు.


తెలుసు-తెలియదు ఈ  రెంటి మధ్య ఊగిసలాడుతుంటాడు మనిషి.


భౌతికత-ఆధ్యాత్మికత  ఈ రెంటి మధ్య 

ఊగిసలాడుతుంటాడు మనిషి.


* * *


ఈ ఊగిసలాటను పోగొట్టే ఉపాయాన్ని సద్గురుసన్నిధిలో పొందవలసిందేగానీ ఇక వేరే మార్గం లేదు. 


* * *


నాలుగు పావలాలు కలిస్తే రూపాయి అయినట్టు


ఒకటవ పావలా - వ్యక్తి (నేను)

రెండవ పావలా - సంసారం (నాది)

మూడవ పావలా - జగత్తు.

నాల్గవ పావలా - జగదీశ్వరుడు.


ఈ నాల్గింటిలో ఒకటవభాగమైన వ్యక్తిగా (ఒక పావలాగా) మాత్రమే తానుండడం వల్లనే

అనగా వ్యష్టిభావనే తన అసంతృప్తికి కారణం.


* * * 


1. నేను అంటే ఈ తనువు మాత్రమే తానని  

ఉన్నవాడు - పావలా (బ్రహ్మచర్యాశ్రమం)


2. నేను అంటే 'తను, సంసారం' 

నేనని ఉన్నవాడు - అర్థరూపాయి (గృహస్థాశ్రమం)


3.నేను అంటే 'తను, సంసార, ప్రపంచములు' కలిపి నేను అని ఉన్నవాడు - ముప్పావురూపాయి

(వానప్రస్థాశ్రమం)


4. నేనుఅంటే 'తను, సంసార, ప్రపంచ, దైవములు' కలిపి నేను అని ఉన్నవాడు- రూపాయి (సన్న్యాసాశ్రమం)


పూర్ణానుభవం అనేది 'రూపాయి'కి తప్ప 

నాల్గు పావలాలలో ఏ ఒక్క పావలాకూ  కలుగదు.

ఏ ఒక్క పావలా పూర్ణం కాదు. మిగతా మూడుపావలాలతో కలిస్తేనే పూర్ణం.


కాబట్టి పావలాగా ఉన్న నీవు 

రూపాయిగా విస్తరించడమే మోక్షం.


పావలాగా ఉన్నప్పుడూ 'తెలియదు' అని ఉంటాడు.

రూపాయిగా ఉన్నప్పుడూ 'తెలియదు' అని ఉంటాడు.


మొదటి 'తెలియదు' - జ్ఞానము లేక.

రెండవ 'తెలియదు' - అన్యము లేక.


స్వస్తి


* * *

అకాలమరణం

 *అకాలమరణం... ఓ సమీక్ష*


ఒక రోజు కైలాసంలో పార్వతీదేవి ఈశ్వరునితో నాధా, చావు అనునది ఏమి,  దాని స్వరూపము ఏమిటి అని అడిగారు.


అప్పుడు పరమశివుడు, దేవి,  ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనము చేత రోగముల చేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఆ దేహమును వదిలి పోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక. కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు అని పరమేశ్వరుడు చెప్పారు.


పార్వతీ దేవి, నాధా, బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి అని అడిగారు పార్వతి మాత.. 


ఆ ప్రశ్నకు పరమేశ్వరుడు, దేవీ,  ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం, తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది. పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది అని చెప్పారు ఈశ్వరుడు.


పార్వతీదేవి, పరమేశ్వరా మనిషికి ఆయుష్షు ఎందువలన పెరుగుతుంది ఎందువలన తగ్గుతుందిఅని అడిగారు.


పరమేశ్వరుడు, పార్వతీ మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయ కలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తి కలిగి ఉండాలి. వీటన్నింటిని వల్లా మానవుడి ఆయువు వృద్ధి పొందుతుంది.


అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటి వలన ఆయువు క్షీణిస్తుంది.


పార్వతీ తపస్సు చేతనూ, బ్రహ్మచర్యము చేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములో తిరిగి జన్మిస్తాడు. అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది అని పరమేశ్వరుడు చెప్పారు.


🔱*ఓం నమః శివాయ*🔱

29, మే 2022, ఆదివారం

ఉచిత మందులు

 సేకరణ.*పేద , మధ్యతరగతి బ్రాహ్మణులకు ఉచిత మందులు అందచేస్తాం* 

*మీ బాధ్యతగా ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి ఇది షేర్ చెయ్యండి*

కన్ఫర్మేషన్ కాల్ అవసరం లేదు .. మా వెబ్సైట్ చూడండి .. 


ఇది నిరంతర సేవ , హాలిడేస్ ఉండవు .. ఎప్పుడైనా ఈ సేవను అందుకోవచ్చు .. 


తెలంగాణ , ఆంధ్ర  ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో,  జిల్లాలలో , గ్రామాలలో నివాసం ఉంటున్న బ్రాహ్మణ పేద మధ్యతరగతి కుటుంబాల వారు నెల నెల మందులు కొనలేని పరిస్థితి ఉన్నపుడు లేదా ఆసుపత్రి ఖర్చులు భరించలేనపుడు హైదరాబాద్ లోని బ్రాహ్మణ సంక్షేమ భవన్ ద్వారా మందులు ఉచితంగా పొందవచ్చని .. అతి ఖరీదైన మందులు , ఇంజెక్షన్లు కావలసినపుడు సబ్సిడీ ధరలలో ఫార్మా కంపెనీలతో మందులు నేరుగా కొనుగోలు చేసి సబ్సిడీ పై  ఇంటికే పంపబడుతాయని వ్యవస్థాపక అధ్యక్షుడు గిరి ప్రసాద్ శర్మ తెలియ చేశారు .. దీనికోసం తప్పని సరిగా పేషేంట్ వివరాలు అన్ని ముందుగా వాట్సాప్ చేసి నమోదు చేసుకోవాలన్నారు. వాట్సాప్ నంబర్ : *బ్రాహ్మణ వైద్య సహాయ కేంద్రము : +91 81064 71244* నకు పంపండి. 

ఇది మీరు ముందు సేవ్ /ఫీడ్ చేసుకోండి .. 


మందులు కావాల్సిన వారు చెయ్యాల్సిన పని : 


మీ వివరాలు ఇలా పంపండి : 

*స్మార్ట్ ఫోన్ లేని పెద్దలకు మందులు కావాలి , కొనలేము అని అన్నపుడు వారి  వివరాలు సగటు బ్రాహ్మణ సోదర సోదరీమణులు ఎవరైనా మీ మొబైల్ నుండి పంపండి* 


మీరు ఇలా పంపాలి 


*పేషేంట్ పేరు* 

ఇంటిపేరు 

గోత్రము 

వయసు 

గ్రామము / మండలము : 

జిల్లా : 

రాష్ట్రము : 

మొబైల్ నంబర్ : (ఎవరిదీ ?)

వాట్సాప్ నంబర్ : 

మొత్తం కుటుంబ ఆదాయం నెలకు ఎంత : 

ఇంటి అద్దె ఎంత కడుతున్నారు : 


రోగము / వ్యాధి / అనారోగ్యము ఏమిటి ? 

డాక్టర్ గారు ఎవరు 

చివరిగా ఎప్పుడు చూపించుకున్నారు 

ప్రస్తుతం మీకు కావాల్సిన మందుల పేర్లు రాయండి 

(మందుల పేర్లు రాసేప్పుడు కరెక్ట్ గ రాయాలి) 

ఎన్నో రోజులకు వాడాలి ?


రెండు విభాగాలు ఉంటాయి : 


1. అత్యవసరంగా హాస్పిటల్ లో చేరినప్పుడు కావాల్సిన మందులు 

2. దీర్ఘకాలికంగా నెల నెల కొంటున్న మందులు 


మీరు మీ ఆర్ధిక పరిస్థితి , ఇంట్లో ఉన్నవారి సంపాదన గురించి క్లారిటీ ఇవ్వాలి 

అనగ 


నా పేరు ... .. . .. ..  

నేను ... . . .. . . చిరునామా లో ఉంటున్నాను ... 

1. మా కుటుంబ ఆదాయము : ..... (అందరిదీ కలిపి) 

2.  మా కుటుంబానికి ఎలాంటి ఆదాయము లేదు ... 


1. మాకు కుమారులు లేరు .. 

2. మా కుమారులు 18ఏళ్ల కంటే చిన్నవారు 


నేను గతంలో .. . . .. .. . .  .ఉద్యోగం /పని చేసేవాడిని 

నేను ప్రభుత్వ ఉద్యోగిని కాను / ప్రభుత్వ పెన్షన్ 3 వేలకు మించి రాదు 


ఇవన్నీ మీరు వ్రాసి మెసేజి పెట్టాలి 


పెట్టినపుడు 

మీకు మొదట కాల్ వస్తుంది 

అందులో ఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది 


తదుపరి 

తదుపరి డాక్టర్ గారి నుండి కాల్ వస్తుంది 

అయన మీ వ్యాధిని నిర్ధారిస్తారు , 

లేదా ఏవైనా సలహాలు ఇస్తారు 

తదుపరి 

ఫార్మసిస్ట్ నుండి కాల్ వస్తుంది 

వారు మీ మందులను అడుగుతారు .. 


మీకు కావాల్సిన మందులు 

వారు మాకు రెఫర్ చేస్తారు 


మీ మందులు నిర్ధారణ అయ్యాక 

మీకు పోస్ట్ చెయ్యబడతాయి .. 


లేదా 


అత్యవసర పరిస్థితి లో ఉంటె 

అక్కడే రెఫర్ చెయ్యబడతాయి 


కాల్ చెయ్యరాదు 

మొత్తం మెసేజిలు మాత్రమే పెట్టాలి .. 


డాక్టర్ సౌకర్యము : 


మీకు ఏదైనా దీర్ఘకాలిక ఇబ్బందులు ఉంటె 

ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 వరకు 

ఏరోజైనా మా కార్యాలయానికి వచ్చి 

అవుట్ పేషేంట్ కార్డు తీసుకోండి .. 

(పేషేంట్ రావాల్సిన పనిలేదు) 

వచ్చినా పరవాలేదు 


అవుట్ పేషేంట్ కార్డు ద్వారా మీకు ఉన్న 

రోగానికి / జబ్బుకు / అనారోగ్యానికి 

మేము మంచి హాస్పిటల్ 

కన్సల్టెన్సీ ఉండదు 

మందులు కూడా ఉచితమే 


సదా బ్రాహ్మణుల సేవలో 

సోదరభావంతో సేవలు అందిస్తున్న 


*బ్రాహ్మణ సంక్షేమ భవన్*


మా సేవలు ఈ పేజీలో ఉన్నాయి చదవండి : 


http://www.indianbrahmins.com/?page_id=452 


*Brahmins Help Desk*

*Brahmin Welfare Bhavan*

Beside Reddy Womens College, 

BARKATPURA, NARAYANAGUDA 

HYDERABAD 


*_Founder President_*

*Kalle Giri Prasad Sarma*


*_Administrative Officer_*

*Smt Sripati Durgarani*

Dial : 6304921292

భగవద్గీత

 


🌹భగవద్గీత🌹


పదునైదవ అధ్యాయము

పురుషోత్తమ యోగము

1వ శ్లోకo

 

శ్రీభగవానువాచ 


ఊర్థ్వమూలమధశ్శాఖమ్ 

అశ్వత్థం ప్రాహురవ్యయమ్ ౹

ఛందాంసి యస్య పర్ణాని 

యస్తం వేద స వేదవిత్ ౹౹ (1)


ఊర్థ్వమూలమ్ , అధఃశ్యాఖమ్ ,

అశ్వత్థమ్ , ప్రాహుః , అవ్యయమ్ ౹

ఛందాంసి , యస్య , పర్ణాని , 

యః , తమ్ , వేద , సః , వేదవిత్ ౹౹ (1)


ఊర్థ్వమూలమ్ = ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగాను

అధఃశ్శాఖమ్ = బ్రహ్మయే ముఖ్యశాఖగాను కలిగిన 

అశ్వత్థమ్ = సంసారరూపమైన అశ్వత్థవృక్షము (రావిచెట్టు) ను

అవ్యయమ్ = శాశ్వతమైనదానినిగా 

ప్రాహుః = పేర్కొందురు 

ఛందాంసి = వేదములు 

యస్య , వర్ణాని = దేనియొక్క ఆకులో 

తమ్ = అట్టి సంసారరూపవృక్ష తత్త్వమును 

యః = ఏ పురుషుడు 

వేద = (సమగ్రముగా) తెలిసికొనునో 

సః = అతడు

వేదవిత్ = వేదార్థములను బాగుగా ఎఱిగినవాడు 

                           

తాత్పర్యము :- శ్రీ భగవానుడు పలికెను. ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగను , బ్రహ్మయే ముఖ్యశాఖగా (కాండముగా) , వేదములే పర్ణములు (ఆకులు) గా గల ఈ సంసారరూప - అశ్వత్థ వృక్షము నాశరహితమైనది . ఈ సంసార వృక్షతత్త్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎఱిగినవాడు . (1)

   

        

భారతదేశం సర్వస్వతంత్ర ప్రజా రాజ్యం

 ...


నేడు మన భారతదేశం సర్వస్వతంత్ర ప్రజా రాజ్యం అయింది. ఇది నిజంగా గర్వకారణం. కాని దాదాపు నూటయేబది సంవత్సరాలనుండి పరదేశీయుల పాలసక్రింద నలిగిన హిందువుల ఆచారవ్యవహారాలు కాపుదల లేక రూపుడి అంతరించాయి. కడుపు కక్కు రితికై కడగండ్లు మెండైన కొద్ది ఆర్య సంతతియొక్క తేజస్సు తరుగడం జరుగుతోంది.


వేదశాస్త్రాలయందు ప్ర్రామాణ్యబుద్ధి తొలగి పోతోంది. పూర్వుల చరిత్రలు చెప్పే పురాణాలు కల్పిత గాధలుగా పరిగణింప బడుతున్నాయి. రామాయణం జంకు భారతం బొంకు అనే ప్రబుద్ధులు బయలుదేరారు. మతధర్మాలు మాయమై సౌంకర్యం ప్రబలుతోంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు నేటి నాగరిక సోద కులు జుట్టు బొట్టు కట్టు మున్నగువాటిలో స్వధర్మాలు విడిచి పరధర్మాలు అవలంబిస్తూన్నారు. జందెం ధరించ డం ఛాందసం కొందఱి ద్విజాతుల దృష్టిలో, వారి విష యంలో నిత్యకర్మానుస్థానం, శ్రాద్ధక్రియలు, ఆబ్దికాలు అనే వానిని గూర్చి వేతే చెప్పనక్కరలేదనుకొంటాను.


వేదవిద్య, సంస్కృతభావ విడిచి పెట్టి కేవలం


ఆంగ్లభాష అనే ఎంగిలికూడు జీర్ణంకావడం 'చేతనే


కొందఱికిట్టి హైన్యగతి పట్టింది. మహర్షుల ఆధ్యాత్మిక


iv


చింత, తపశ్శక్తులు, దివ్యబోధలు, తిరుగులేని వాళ్ళుద్ధి, అపూర్వమహిమలు వీరి చెవిని పడియుండవనితోస్తుంది. కారణం ఏదైనా కావచ్చు. తెలియక చెడేవారు, తెలి సినా ప్రమాదవశంచేత చెడేవారు, తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంచేత చెడేవారు, చెడినవారిచే చెఱప బడేవారు ఇట్లా నూటికి తొంబదిమంది చెడడం జరుగు తోంది.


ఇంతకు చెప్పవచ్చే దేమం టే పరధర్మం ఆశ్రయిం చడరుంచీ తాము నిర్వీర్యులై తమ వ్యక్తిత్వాన్ని చంపు కోవడం అన్నమాట. పెద్దలు స్వధర్మపాలనలో నిధన మైనా శ్రేయమేయని హెచ్చరించారు. మహాత్ముల మార్గం తు చాలు తప్పక అనుసరించడం నేటి వారికి శక్యం కాకపోవచ్చు. శక్తివంచన లేకుండా ప్రయత్నిం చడమైనా మన కనీస ధర్మంగా భావించాలి. త్రోన నున్న వాడు ఎన్నడు తప్పిపోడు. ఎన్నటికైనా గమ్య స్థానం చేరుతాడు.


సారాంశమేమం ఓ దేశశాలపాత్రతల ననుసరించి మంచివని మీకు తోచిన పూర్వుల సత్సాంప్రదాయాల నవలంబిస్తూ కగ్మభూమియైన పవిత్ర భారతదేశంయొక్క పూర్వపు బాన్న త్యాన్ని పునరుద్ధరణం చేయవలసినదిగా నా సోదర ప్రజానీకానికి వినయపూర్వకమైన వేడికోలు.

సాధకుడు- సంసారం

సాధకుడు- సంసారం 

అనాదిగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉదయిస్తున్న సందేహం ఏమిటంటే సాధకునికి సంసారం ప్రతిబంధకమా?? ఇది ఏ ఒక్క సాధకుని సమస్య కాదు జ్ఞ్యానాన్వేషణలో ప్రయాణించే ప్రతి సాధకుని హృదయంలో తలెత్తే ప్రశ్న. నేను ఒక ప్రశ్న వేస్తాను, వంటచేసె  తల్లికి చంకలోని శిశువు ప్రతిబంధకమా  కాదా. దీనికి సమాధానం కాదు అంటే ఫై ప్రశ్నకు కూడా కాదు అని చెప్పాలి. లేక అవును అయితే దానికి కూడా అవును అని చెప్పాలి. నిజానికి ప్రతి తల్లికి తమ సంతానం మీద అపారమైన ప్రేమ ఉండటం కద్దు.  అలాఅని చంకలో పిల్లవానిని ఎత్తుకొని వంటపని చేయలేదు కదా.  కాబట్టి ఆ తల్లి ఆ పిల్లవానికి ఏదైనా ఆటవస్తువు ఇచ్చి వానిని ఏమార్చి తనపని తాను చేసుకుంటుంది.  కానీ సాధకుని విషయంలో ఆలా సంసారాన్ని ఏమార్చి తన సాధన తాను చేసుకోలేడుకదా సంసారం అంటే చాలా బాద్యతాయుతమైనది.  నిజానికి రోజులో చాలా సమయం భార్య పిల్లల విషయంలోనే గడపాల్సి వస్తుంది. ఇల్లు అంటేనే పనులు, సమస్యలు. మన మహర్షులు సంసారాన్ని సాధకుడు తామరాకు మీద నీటి బిందువులా వుంటూ జీవించాలని చెప్పారు.  కానీ అది ఎంతవరకు ఆచరణ సాధ్యము అనేది ప్రశ్నర్ధకం. 

స్థిత ప్రాజ్ఞుడిగా జనక మహారాజును పేర్కొంటారు. అలా ఇప్పుడు మనం ఎంతవరకు ఉండగలం అంటే అది ఎంతమాత్రం వీలుకాదు అని చాలామంది అనవచ్చు. ఆధునిక విజ్ఞనాభివృద్దితో పాటు సగటు మనిషి అవసరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక్కప్పుడు భోగప్రదంగా వున్నది ఇప్పుడు అవసరంగా మారుతున్నది. మనిషి చుట్టూ వున్న  సమాజం, అతని జీవన సరళి మనిషిని రోజులో చాలా సమయాన్ని వివిధ విషయాలమీదికి  మళ్ళిస్తుంది.  గతంలో ఒక సంసారికి దొరికే తీరిక సమయం ఇప్పుడు మనుషులకు కరువు అయ్యింది.  అటువంటప్పుడు దైవ చింతనకు సమయం కేటాయించటం దుర్లభమైపోతున్నది. ఒక వైపు జీవితంలో సౌకర్యాలు పెరిగాయి అంటున్న మరోవైపు సమయం దొరకకుండా పోతున్నది. 

జీవితం ఒక పరుగు పందెం: ఉదయం లేచిన దగ్గరనుండి ఏదో ఒక సమస్య ఇంట్లో సామానులు లేవని, నీళ్లు రావటం లేదని, కరంటు పోయిందని, అది పనిచేయడంలేదు, ఇది పనిచేయటంలేదా అని అనేక విధాలుగా సగటు సామాన్య సంసారి అనేక విధాల సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. రోజులో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడంలేదు. ఇక మనస్సు దైవం మీదకు ఎలా మళ్లుతుంది. కాసేపు మనస్సు ప్రశాంతంగా ఉండాలని ఏదైనా గుడికి వెళితే అక్కడ మానసిక ప్రశాంతత విషయం అటుంచి అక్కడి వాళ్ళు అది కొను, ఇది కొను పూజకు ఇంతకట్టు కొబ్బరికాయను అంటకట్టు అని నిలువు దోపిడీ చేస్తున్నారు.  కొన్ని గుడులకు వెళితే గుడికి ఎందుకు వచమురా ఇంట్లోంచి దేముడిని మొక్కుకుంటే సరిపోయేదిగా అనే విధంగా తయారయ్యాయి.  గుడులు ఆధ్యాత్మిక కేంద్రాలుగా పూర్వం ఉండేవట.  మరి ఇప్ప్పుడు వ్యాపార కేంద్రాలుగా అవుతున్నాయని చెప్పటానికి బాధపడుతున్నాను. ఎంతసేపటికి గుడికి భక్తులను ఎలా ఆకర్షించాలి, భక్తులనుండి ఎలా డబ్బులు వాసులు చేయాలి అనే విషయం మీదే ఎక్కువ శ్రార్ధ చూపుతున్నారు. చక్కగా రోజుకు ఒక ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమం అంటే పురాణం కాలక్షేపం, హరికథ గానం, సంగీత కచేరీలు పెట్టి సందర్శకులను భక్తి, వైరాగ్య మార్గంలో నడిపిద్దామన్న ఆలోచన గుడి నిర్వాహకులకు లేకపోవటం  శోచనీయం. ఇక కొన్ని ప్రైవేట్ ఆధ్యాత్మిక కేంద్రాలు అని చెప్పుకునే సంస్థలు సంస్థ నిర్వాహక మండలిలో విభేదాలు, పోట్లాటలు, గొడవలు, కోర్టుల్లో కేసులు. ఇలా అయితే మన హిందువ సంస్కృతీ ఎలా పునరుద్ధరించ బడుతుంది అనేది సందేహాత్మకమే. 

ఇంట్లో ధ్యానం: ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేద్దామని కొందరు సాధకులు సదా కోరుకోవటం కద్దు.  దానికి ఉషోదయ కాలంలో నిద్రనుంచి మేల్కొనటానికి ఎంతమంది శరీరం సహకరిస్తుంది అనేది మొదటి ప్రశ్న అథవా నిద్రనుంచి లేచిన మనస్సు ఎంతవరకు స్థిరంగా ఉంటుందన్నది రెండవ ప్రశ్న.  నిద్రలేచిన దగ్గరినుండి రోజు అనేక జీవన వ్యాపారాలతో మునిగిన మనస్సు అవే ముద్రలు కలిగి వుంది ధ్యానంలో వాటిమీదే మనస్సు  పోతుంది. మనస్సుని ప్రస్తుత కాలంలో నిగ్రహించటం ఆ విశ్వామిత్రుని వల్ల కూడా కాదేమో. 

ఇల్లు గడవటం: ఈ రోజుల్లో ప్రతి వస్తువు ఖరీదు రోజు రోజుకి పెరిగి పోతున్నది. ఎంతోకష్ట పడితే తప్ప సగటు మానవుడు తన దినందిక అవసరాలను చేరుకోలేక పోతున్నాడు.  అటువంటి తరుణంలో సామాన్యు గృహస్తు తన జీవన అవసరాలమీద కాలాన్ని వెచ్చిస్తాడా లేక దైవ చింతనలో కాలం గడుపుతాడా, అంటే తప్పకుండ జీవన అవసరాలకే కాలాన్ని గడిపి మిగిలితే ఆ మిగిలిన సమయాన్ని దైవచింతనకు కేటాయించాలని అనుకోవటంలో తప్పులేదనిపిస్తుంది. ఈ సందర్భంలో ఆధ్యాత్మిక జగత్తులో వినిపించే ఒక కధ చూద్దాం. 

ఒకసారి నారద మహర్షి శ్రీ విష్ణుమూర్తి గారివద్దకు వచ్చి నారాయణ భూలోకంలో మానవులు మీ దివ్యనామ జపం చేయకుండా అనేక సాంసారిక విషయాలలో విలీనమై వుంటూ తమ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు వారిని మీరు ఉద్దరించాలి అని వేడుకుంటారు.  నిజమే మహర్షి మీరు చెప్పినట్లు వారు నన్ను మారుస్తున్నారు కానీ ఏమిచేద్దాము వారి కార్యకలాపాలు వారివి వారిని మనం ఎలా కాదనగలం అని  బదులిస్తారు. దానికి పరమాత్మా నేను త్రిలోక సెంచరీని అయి కూడా నిత్యం నారాయణ స్మరణ మారువను కదా మరి వారు కూడా వారి వారి పనులల్లో ఉండి కూడా నారాయణ నామ స్మరణ చేయవచ్చు కదా అని అంటారు. అప్పుడు స్వామి నారదమహర్హిని పరీక్షించనెంచి నారదా ఇదిగో ఈ బంగారు గిన్నెను తీసుకో దీనినిండా ఆముదము వున్నది దీనిలోంచి ఒక్క బిందువు కూడా జాగ్రత్తగా పట్టుకొని ఒకసారి మూడులోకాలు తిరిగి రాగలవు? అని అంటారు.  సరే స్వామి మీరు ఏ ప్రయోజనము ఆశించి నాకి పరిక్ష పెట్టారో తప్పక నేను మీరు చెప్పినట్లు చేస్తాను అని ఆ స్వర్ణ పాత్ర పట్టుకొని బయలుదేరుతారు.  మొదట్లో కొద్దీ కొద్దిగా నారాయణ స్మరణ వేగం తగ్గింది ఎందుకంటె ఇప్పుడు నారదులవారి మనస్సు తన చేతిలోని పాత్ర మీద వున్నది ఆలా ఆలా ఆ పాత్రను ఏకాగ్రతగా చూస్తూ అందులోంచి ఆముదం క్రింద పడకుండా జాగ్రత్తగా మూడు లోకాలు తిరిగి చివరకు వైకుంఠానికి చేరుకుంటారు.  అక్కడ శ్రీ మహావిష్ణువుని చేరుకొనే లోపు శ్రీ మహా లక్ష్మి ఎదురు పడుతుంది తల్లిని చూసి అమ్మ ప్రక్కకు తప్పుకోండి నేను ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా ఇందులోని ఆముదము తోణుకుతుంది అని అంటారు.  ఇదేమిటి మహర్షి ఇలా ఆ పాత్రను పట్టుకొని జాగ్రత్తగా నడుస్తూ బాహ్య స్మృతి లేకుండా  నడుస్తున్నారు అనగా దానికి  మహర్షి జరిగిన వృత్తాంతం మొత్తం వెల్లడించి నిశ్శబ్దంగా శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకొని స్వామి మీరు చెప్పినట్లుగానే ఈ పాత్రలోని ఆముదం తొణకకుండా తీసుకొని వచ్చాను అని అన్నారు నారదా ఇంజంగా ఆ పాత్రలోని ఆముదము ఒక్క చుక్క కూడా జారలేదా అని శ్రీ మహావిష్ణువు నారదుల వారిని అడిగారు లేదు  స్వామి నేను ఒక్క ఘడియ కూడా నాదృష్టిని పాత్రనుంచి తొలగించకుండా జాగ్రత్తగా పెట్టుకొన్నాను అని అన్నారు. అది సరే కానీ నారద నీవు ఎప్పుడు నాసన్నిధికి వచ్చిన నారాయణ,నారాయణ అని గానం చేస్తూ వచ్చేవాడివి కదా మరి ఇప్ప్పుడు నిశ్శబ్దంగా ఎలా వచ్చావు అని  అడిగారు. ఏమి చెప్పమంటారు స్వామి మీరు నాకు వప్పచెప్పిన పని (task ) అటువంటిది నా మనస్సు దీన్నే మీద తప్ప మరిదేనిమీద లేదు లేకుంటే ఎక్కడ ఆముదం తొణుకుతుందో అని దిగులు చేత పూర్తిగా గిన్నె నుండి మనస్సుని  మరల్చలేదు. అందుచేత నే నేను తమ దివ్య నామస్మరణ చేయకుండానే మీ సమక్షానికి వచ్చాను అని బదులు చెప్పారు. అప్పుడు స్వామివారు నవ్వి నారద నేను నీకు ఒక్క చిన్న పని చెపితేనే దానిలో లీనమై సదా స్మరించే నారాయణ నామాన్నే నీవు మరచి పూర్తిగా నీ జాసను గిన్నె మీదనే ఉంచావే మరి భూలోకంలో నిత్యము మానవుల మనస్సు  అనేక విషయం వాంఛలమీద వుండి ఉండటం చేత వారు దైవ స్మరణ మరవటంలో ఆశ్చర్యం ఏముంది అని చెపుతారు.  కాబట్టి మిత్రులారా సంసార జీవనం చేస్తూ సాధన చేయటం అనేది రెండు నావలా మీద ప్రయాణం  లాంటిది. అంటే గృహస్తు మోక్ష పిపాసి కాకూడదా గృహస్తు మోక్షానికి అర్హుడు కాదా అంటే కాదని చెప్పలేము కానీ ఒక సన్యాసి, ఒక అరణ్యంలో జీవనం చేసే యోగి, హిమాలయాలలో వుండే యతి తమ జీవన సాఫల్యం కేవలం కైవల్యంలోనే వున్నదని నమ్మి అహర్నిశలు అవిరామ కృషి చేస్తారు కాబట్టి వారికి మోక్షమ్ము కరతలామలకం అవుతుంది.  అదే నిత్యం అనేక జీవన  వ్యాపారాల్లో మునిగితేలే గృహస్తుకు అత్యంత శ్రమదమాలకు ఓరిస్తే తప్ప మోక్ష సిద్ది కలుగదు. 

సాధకుడు ఉషోదయకాలంలో నిద్రనుచి మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని సాధన చేస్తూ ధర్మబద్ధమైన జీవనం సాగిస్తూ ఉంటే కొంతవరకు మోక్షము సింద్దించటానికి వీలు  ఉండవచ్చు. 

ఇది ఇట్లా ఉండగా ఇంకొక విషయం సాధకునికి అవరోధంగా ఉండవచ్చు కూడా.  సాధకుడు నిధిజసలో ఉంటే బాహ్య స్మృతి కోల్పోవటం సర్వ సాధారణం.  సాధకునికి సామాజిక కట్టుబాట్లు నిరోధించలేవు.  అంటే చక్కగా దుస్తులు ధరించాలి, చక్కగా కేశాలంకరణ చేసుకోవాలి.  ఇతరులతో సఖ్యతతో గడపాలి ఇవ్వన్నీ కూడా సాధకుని సాధనకు అవాంతరాలుగానే చెప్పవచ్చు. నిధిజాసలో వున్నసాధకునికి బాహ్య స్పర్స్య, స్మృతి వుండవు కాబట్టి చూసే వారికి సాధకుని ప్రవర్తన వింతగా గోచరించవచ్చు. 

ఒకసారి సాధకుడు తన కుమారునితో కారులో వెళ్ళాడు.  కుమారుడు కారు డ్రైవు చేస్తున్నాడు.  పెట్రోల్ పోయించటానికి కారుని పెట్రోల్ బ్యాంకువద్ద నిలిపితే నిధిజాసలో వున్న సాధకుడు కారు దిగాడు.  అక్కడ అందరు మోటారు సైకిళ్ళు, కార్లు తీసుకొని వచ్చారు. సాధకునికి బాహ్య స్మృతి లేదు.  కారులో వున్నవాడు ఉండకుండా క్రిందికి ఎందుకు దిగాడు అని అడగవచ్చు దానికి సమాధానం సాధకుడు కూడా చెప్పలేడు.  ఒక స్కూటరిస్ట్ హారన్ కొట్టితే సాధకుడు గమనించలేదు.  నాన్న మీకు హారన్ సవుండు వినిపించలేదా అన్న పిలుపుతో స్మృహ లోకి వచ్చాడు సాధకుడు,  నాన్న శరీరం మాత్రమే అక్కడ వుంది నాన్న అక్కడ లేదని ఆ కుమారునికి తెలియదు కదా!.   ఇలా సమాజంలో వుంటూ నిధి జాసలో ఉండటం కుదురుతుందా 

నిది జాసలో వున్న సాధకుడిని ఒక ఉపమానంతో తెలుప ప్రయత్నిస్తాను.  ఇంటిలోని అన్ని తలుపులు తెరచి ఉంచి యజమాని ఇల్లు వదలి వెడలితే ఎలా ఉంటుంది.  అలానే నిధి జాసలో వున్న సాధకుని శరీరం కూడా అంతే మనిషి బాహ్య స్మృతి లేకుండా ఈ సమాజంలో సంచరించగలడా?  అటువంటి మనిషిని సమాజం ఆదరిస్తుందా. అన్నది ప్రశ్నర్ధకం.  పూర్తిగా సదా  స్మృతిలో వుండి (ever active )  వారినే ఏమార్చి మోసగించాలని చూసే ఈ మాయా సమాజంలో సాధకుడు మనగలడా? 

అరణ్యంలో జంతువులు సదా సాధకునికి (యోగులకు) అండగా ఉంటాయి.  ప్రక్రుతి పూర్తిగా సాధకునికి సహాయకారిగా ఉంటుంది.  అక్కడ సాధకునికి ఎలాంటి సామాజిక భాద్యతలు వుండవు.  యేవో కందమూలాదులు తింటూ ఎక్కడో గుహలో తన జీవితాన్ని గడిపే సాధకునికి మోక్షము కరతలామలకం అవుతుంది.  మరి సమాజంలో ఉండి గృహస్ట  జీవితం గడిపే సాధకునికి సాధన ఎంతవరకు సాగుతుంది.  అనేది ప్రతి సాధకుడు యోచించాలసిన అంశం.   ఆలా అని ప్రతి సాధకుని సన్యాసిగానో, మౌనిగానో మారమని నేననను. ప్రయత్నం చేయటం మానవ ధర్మం ఇక ఆపై దైవేచ్ఛ. ఇప్పటికి అనేక వందల సంవత్సరాలుగా తపమాచరించి తాపసులు హిమాలయాలలో వున్నారంటే ఆశ్చర్యపడ నవసరం లేదు. 

గృహస్తు సాధన చేయకూడదని నేననను.  కానీ గృహస్ట ధర్మం నిర్వహిస్తూ సాధన చేయటం అనేది మాత్రం కత్తిమీద సాము వంటిదే.  ఆలా అని సాధన మానకూడదు.

కాబట్టి సాదాకా ఇంకా జాప్యం చేయక ఇప్పుడే మేల్కొని జన్మ సార్ధకత చేసుకో 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

28, మే 2022, శనివారం

బ్రాహ్మణులు

 బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?

-------------------------


చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ

సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అను కుని క్షమించి వదలివేసింది


అంతకుమించి...

మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వ విద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి


కానీ... 

ధర్మ పరిరక్షణకు

సమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు


గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది


ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం


సమాజంలో తమదే ఉన్నతస్థానమని చాటుకునేందుకే బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా రూపొందించుకున్నారని

సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా


అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ

వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు


ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి


బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే,(  కొందరు తప్ప )


వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు

(రాజకీయం తప్ప )


చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి చారిత్రక ఆధారమేదైనా ఉందా? 


(సమైక్య భారతావనికోసం చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు


చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు


అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం

వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం

కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడు


పురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా? 


కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది


సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు


ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం


బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి   


మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి


భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు


బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు


మరి..

ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా? 


వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు


కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన


బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు?


చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే?


ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం


ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది


ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం 


ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు?


తిరువళ్లువార్ తిరుక్కురళ్‌ను ఎలా లిఖించగలిగాడు?


ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా?


మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా? 


వశిష్టుడు

వాల్మీకి

కృష్ణుడు

రాముడు

బుద్ధుడు

మహావీరుడు

తులసీదాసు

కబీర్

వివేకానంద...

వీరంతా బ్రాహ్మణేతరులే


వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా? 


అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ?


మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే!

ఆయన ఓ క్షత్రియుడు


కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు


ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి


అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే


అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు


గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు


బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి


ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు


 ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా?


వారణాసి

గంగాఘాట్

హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు


పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు


ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరిక

వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు


కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు


ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? 


ఎందుకంటే వారు హింసను వదిలి అహింసా జీవనాన్ని గడిపేవారు


(భారత్‌కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. 

పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు

దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని)


సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు


జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు


కాశ్మీర

గాంధార దేశాల్లో

(ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు)

సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు


ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనా కనిపించరు


ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు ఉన్నాయా?


ఎందుకంటే వారు తాపస జీవనాన్ని వృత్తిగా ఎంచుకున్న వారు


(పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు

ఉగ్రవాదులు చేపట్టిన కాశ్మీరీ లోయ ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి తాళలేక కాశ్మీరీ పండిట్లు విలువైన తమ ఆస్తిపాస్తులనే కాదు...

ప్రాణాలనూ కోల్పోయారు


ఐదు లక్షలమందికి పైగా పండిట్లు కాశ్మీర్ లోయను వదలిపెట్టి వలస పోయారు


వీరిలో 50వేలమందికి పైగా ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లోనే కాలం గడుపుతున్నారు


కాశ్మీరీ పండిట్లు ఇంత పీడనకూ, వేదనకూ గురైనా ఎన్నడైనా తిరగపడిన ఉదంతాలు ఉన్నాయా?


ఎందుకంటే వారు వారు ద్వేషాన్ని వదిలి శాంతి జీవనాన్ని గడిపేవారు


భారత్‌పైకి అరబ్బు దేశంనుంచి దండెత్తి వచ్చిన

మహమ్మద్ బీన్ ఖాసిం బ్రాహ్మణులంతా

సున్తీ చేయించుకోవాలని షరతు విధించాడట


వారు నిరాకరించినందుకు పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు మరణశిక్ష విధించేవాడట


ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాస్తవమిది


భారత్‌పై దండయాత్రలు జరిగిన సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు


కానీ...

బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు ఒక్కటీ కనబడవు


ఎందుకంటే వారు సౌత్విక జీవనాన్నీ - సాత్విక గుణాలనే సంపదగా భావించేవారు


19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ దీపావళి రోజున టిప్పు సుల్తాన్ సైన్యం మేల్కోటే ప్రాంతంపైకి దండెత్తివచ్చి 800 మందిని ఊచకోత కోసింది


మృతుల్లో అత్యధికులు మాం డ్యం అయ్యంగార్లే. సంస్కృతంలో ప్రవీణులు వారు

(ఇప్పటికీ మేల్కోటేలు దీపావళి పండుగ జరుపుకోరు)


వారణాసిలో రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులనే విషయం ఎంతమందికి తెలుసు? 


ఢిల్లీ రైల్వే స్టేషన్లలో బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది


 కానీ ఇది నిజం


న్యూ ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతం మంది బ్రాహ్మణులే


ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లలో పనిచేసేవారు వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే


మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు


వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస పోతున్నారు


అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు


మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు? 


గత కాలపు బ్రాహ్మణ సమాజం మొత్తం పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు


వారిలో ఏ కొద్దిమంది చేతులకో రక్తం అంటి ఉండవచ్చు


వారు చేసిన తప్పులను మొత్తం బ్రాహ్మణులందరికీ అంటగట్టడం సబబేనా?


సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ ప్రపంచం ఏనాడో మరచిపోయింది


బ్రాహ్మణులు కేవలం

వేదాలు

గణిత

ఖగోళ శాస్త్రాల అధ్యయనానికి మాత్రమే పరిమితం కాలేదు


ఆయుర్వేద

ప్రాణాయామ

కామసూత్ర

యోగ

నాట్య శాస్త్రాలను అభివృద్ధి చేసి మానవాళికి అందించిన ఘనత నిస్సందేహంగా వారిదే


బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే

విలువైన ఈ శాస్త్రాలన్నిటిమీద హక్కు తమదే అని చాటుకునేవారు


అతి ప్రాచీనమైన శాస్త్రాలపై తమ పేర్లు లిఖించుకుని ఉండేవారు


 ‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అనే ఒకే ఒక్క ఆశయంతో మానవాళి సంక్షేమంకోసం తమ జీవితాలను త్యాగం చేశారు


అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని శిలువపైకి ఎక్కించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తోంది


ఎంత విచారకరం!


"చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతు

లోకాసమస్తా సుఖినోభవంతు"

అనేది తరతరాలుగా వస్తున్న ప్రార్థన


అంటే నాలుగు సముద్రాల వరకు వ్యాపించిన ఈ భూమిపై నివసించే

ఆవులూ -బ్రాహ్మణులు శుభకరంగా ఉండు గాక !


అప్పుడే ఈ లోకం లో కూడా ధర్మం వృద్ధి చెంది సుభిక్షంగా ఉంటుందని అర్థం


ఇప్పుడు ఆవులకూ విలువ ఇవ్వడం లేదు


బ్రాహ్మణులనూ ఉద్దేశపూర్వకంగా అణిచి వేస్తున్నారు


సర్వం శివ సంకల్పం, అంటూ సర్దుక పోతారా ? సమైక్యతతో పూర్వవైభవాకి పాటు పడతారా ??

పితృకార్యం

      "పితృకార్యం" అంటే చాల పవిత్రమైనది. "పితృదేవతలు" కూడ "దేవతా" సమానులే..... 


    ఈ మధ్య చాల మంది "శ్రార్ధం" పెట్టడం (( బియ్యం ఇచ్చుకోవడం )) మొక్కుబడి భావిస్తున్నారు. 


      ((శ్రాద్ధక్రియ, విమర్శనదినము))


     చనిపోయిన వారకి "శ్రాద్ధక్రియ" ఎందుకు చేయాలని "సూతుడుని" మునులు అడుగగా "సూతుడు" ఇలా వివరించాడు. 


మరణించినవారు "ప్రేతరూపంలో" ఒక సంవత్సరకాలం ఉండును. అందులో మొదటి పదిరోజులు ఆజీవుని "పంచప్రాణాలలో" ఒకటి చనిపోయిన స్థలంలోను, మరొకటి స్మశానంలోను, మూడవది కర్తయందును, నాలుగవది వాయసములందును, ఐదవది వాయువునందును ఉండును. ఎత్తిపోతలు (సంచయము) అయ్యేదాకా ఆ ప్రాణములు దుర్భరమైన తాపము అనుభవించుచుండును. 


"యథోక్తముగా" కర్మలు చేసిన తరువాత ఆ ప్రాణములన్నియు తాపము శమించి, ఒకచోట చేరి యాతనా శరీరము ధరించును. ఆ యాతనాశరీరము (ప్రేతాత్మ) "నరకమునకు" పోవుటకు ఒక సంవత్సరము కాలము పట్టును. 


మనకొక మాసము "వారికి" ఒక దినము. కనుక ప్రతినెల "మాసికము" పెట్టవలయును. "యమలోకమునకు" పోవు మార్గములో "18 తావుల" ఆగుదురు కనుక "18 మాసికములను" పెట్టి, "సంవత్సరాంతమున" సాహపిండము పెట్టవలెను. ఆ నాటితో మృతులు ప్రేతరూపమును చాలించి "పితృదేవతలగుదురు". 


"పితృదేవతలు" కూడ దేవతా సమానులే.


సంవత్సరాంతమున "సాంవత్సరికము" జరిగిన మరుదినము అయిన "విమోకము" నాడు - యాతనా శరీరములో నున్న జీవుని యమభటులు "యమధర్మరాజు" వద్ద ప్రవేశపెట్టుదురు. "చిత్రగుప్తుని" ఖాతాను కాలము, "సూర్యచంద్రుల సాక్ష్యముతో" సరిచూచెదరు. "జీవులకు" శిక్షలేమైనా ఉంటే అనుభవించి ఆపైన వారు "పుణ్యలోకమునకు" పోవుదురు. "కర్మ" జరుగని జీవులు "ప్రేతరూపములోనే" ఉండవలసివచ్చును. అట్టివారికి "గయలో పిండప్రదానము" చేసినట్లయితే వారి "ప్రేతరూపము" పోయి "పుణ్యలోకములు" ప్రాప్తించును.


"సంవత్సరికము" పెట్టిన మరుసటి దినమున తిథి ప్రయోజనము (ఆబ్దికము) పెట్టవలెను. తదాధి ప్రతి సంవత్సరము మృతనమాసమున "పితరులను, విశ్వేదేవతలను" అర్చించవలెను.


"పితృదేవతలు" (( శ్రార్ధం )) ఆచరిస్తేనే "సంతానభివృధి, వంశాభివృద్ది" కలుగుతుందని "పురాణాలు" చెపుతున్నాయి.

  

  అలాగే ఈ మధ్య చాల మంది "ఇంగ్లీష్ క్యాలెండర్లను" చూసి (( సంవత్సరికం )) ఒక నెల ముందు "పెట్టుకోవాలని" వారికి వారె "నిర్ణయం" తిసుకుంట్టున్నారు. అది చాల తప్పు. 

             "జీవుడు" ఏ రోజైతే మరనిస్తాడో ఆ "మాసం" (( తెలుగు మాసాలు )) ఆ "తిధి" నాడే "శ్రార్ధం" (( బియ్యం ఇచ్చుకోవడం ))

ఆచరించాలి.

27, మే 2022, శుక్రవారం

నిర్మల భక్తి

                *_నేటి మాట_*



          *నిర్మల భక్తి - ఆడంబర భక్తి*



నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద ఉన్న విష్ణుమూర్తిని చూడగానే... నారదుడిలో ఓ ఆలోచన మెదిలింది. 



విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు' అనుకున్నాడు. ఆవిషయాన్నే సాక్షాత్తూ విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. 



'ఓ దేవదేవా! ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా


కొలుచుకునేది ఎవరు' అని అడిగాడు. 


'ఓస్! అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు. 


అల్లదిగో ఆ పల్లెటూరిలో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా! అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. 


నన్నడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే!' అన్నాడు విష్ణుమూర్తి.



అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు?' అనుకుంటూ ఓసారి తన దివ్యదృష్టితో ఆ రైతు జీవితంలోకి చూశాడు.



ఆ రైతు మహా పేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానాచాకిరీ చేస్తే కానీ అతనికి బొటాబొటీకా తిండి దక్కేదికాదు.



ఉదయం లేచిన దగ్గర నుంచీ రాత్రి నిద్రపోయే దాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీదా మహా అయితే ఓ నాలుగైదు సార్లు నారాయణుడిని తల్చుకునేవాడు అంతే! 



అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదునికి మహా సిగ్గుగా తోచింది.



ఇంతలో విష్ణుమూర్తి...అన్నట్లు నాకో చిన్న సాయం చేసిపెట్టవా నారదా! ఈ పాల కుండ ఉంది చూశావూ దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకువెళ్లి ఇచ్చిరావా అయితే మార్గమధ్యంలో పాలు ఏమాత్రం తొణకకూడదు సుమా! ఒక్క చుక్క కిందకి ఒలికినా అపచారం అవుతుంది.' అంటూ ఓ కుండ నిండుగా పాలని నారదునికి అప్పగించాడు. 



అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయగర్వంతో  నారదుడు విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు.



"చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు. సంతోషం నారదా! కానీ ఓ చిన్న అనుమానం. 


నువ్వు పాలకుండని తీసుకుని వెళ్లేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించారు" అని అడిగాడు విష్ణుమూర్తి.



ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన


దృష్టంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవడంలోనే ఉంది. కాబట్టి నారాయణుడిని తల్చుకునే అవకాశమే లేదు.



అప్పుడర్థం అయ్యింది నారదుడికి... విష్ణుమూర్తి ప్రశ్నలోని


ఆంతర్యం! తను ఈ ఒక్క రోజు ఏదో పనిలో పడి అసలు


నారాయణుడిని తల్చుకోవడమే మర్చిపోయాడు...


అలాంటిది, ఆ రైతు ఎంతో కష్టాన్నీ, శ్రమనీ ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణుడిని తల్చుకోవడం మానలేదు.


అన్నీ ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవడం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తల్చుకోవడం గొప్ప విషయం అని అర్థమైంది నారదుడికి! 


                 


"ఆర్భాటంకంటే భక్తే ముఖ్యం" అనే సూత్రమూ బోధపడింది..



                 *_🌺శుభమస్తు🌺_*


           🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.

 "మృదంగ శైలేశ్వరి ఆలయం"  అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.


కేరళ శాస్త్రీయ నృత్యం "కథాకళి" ఇక్కడే ఉద్భవించింది.


దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు. ఇక్కడ ప్రధాన దేవి దుర్గను "మిఝావిల్ భగవతి"  అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి "మృదంగ శైలేశ్వరి" అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది.  ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయింది అని చెప్తారు. ఇక్కడే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహం లోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని స్థాపించాడు అని స్థలపురాణం.  


ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే, నాలుగుసార్లు, దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు, కానీ వారు దానితో ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడంతో దానిని వెనక్కి తిరిగి ఇచ్చారు.


ఇటీవల కేరళ డిజిపి (రిటైర్డ్) శ్రీ అలెగ్జాండర్ జాకబ్ భగవతి విగ్రహాన్ని దొంగిలించిన విగ్రహ దొంగల కథను ఒక టివి ఛానల్ లో వివరించాడు. ఈ ‘పంచలోహ విగ్రహం’ మార్కెట్ విలువ దాదాపు 1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన సిఫారసు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి సెక్యూరిటీ గార్డులును ఇవ్వలేదట. 


మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తరువాత దానిని పారక్కడవు వద్ద రోడ్డుపక్కన ఒక నోట్‌తో వదిలేశారు - "ఈ విగ్రహం మృదంగ శైలేశ్వరీ ఆలయానికి చెందినది, దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, దానిని తిరిగి ఆలయానికి తీసుకెళ్లవచ్చు అని". 


రెండో సారి, 3 సంవత్సరాల తర్వాత, దొంగలు దానిని 300 మీటర్ల దూరం మాత్రమే తీసుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ ఆలయ ఆవరణలో మరియు వారు విగ్రహం వదలిపెట్టిన స్థలంలో కూడా మలవిసర్జనలు జరిగాయి. 


మూడవసారి దొంగలు దానిని కాల్పేట వరకు తీసుకెళ్లారు. కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియచేసి ఆ విగ్రహాన్ని అక్కడి లాడ్జిలో వదిలిపెట్టారు.


Mr. అలెగ్జాండర్ ఈ మూడు సార్లు డ్యూటీలో ఉన్నందున అతను దొంగల వైఫల్యంతో అబ్బురపడ్డాడు.  తరువాత, చాలా సంవత్సరాల తరువాత దొంగలు పట్టుబడినప్పుడు, వారు దొంగిలించబడిన విగ్రహంతో తప్పించుకోలేకపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని అడిగితే వారు విగ్రహాన్ని దేవాలయం నుండి తీసి తమ వెంట తీసుకెళ్తున్నప్పుడు, వారు తమ దిశను పూర్తిగా కోల్పోతున్నారని, వాళ్ళు తిమ్మిరిలోకి వెళ్ళిపోతానున్నాము అని మరియు అన్నిటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే, వారు తమ ప్రేగు కదలికలపై నియంత్రణను కోల్పోయి మూత్ర విసర్జన మరియు మల విసర్జన అనియంత్రితంగా చేస్తారు అని దొంగలు చెప్పారు. 


ఇదే విషయమై ఆలయ పూజారులను ప్రశ్నించినప్పుడు, విగ్రహం యొక్క 'ప్రతిష్ట కర్మ' చాలా సుదీర్ఘమైన ప్రక్రియ (9 రోజుల కంటే ఎక్కువ జరిగింది) అని,  ఈ దొంగల అసమర్థత కి కారణం ఆ  'ప్రతిష్ట కర్మ' యొక్క  'తాంత్రిక విధి విధానాల' యొక్క ఫలితం అని వారు చెప్పారు.


అయితే ఈ మూడు విఫల ప్రయత్నాలు కూడా విగ్రహాల దొంగల ముఠా తదుపరి ప్రయత్నాలను నిరోధించలేదు. 


ఈసారి అది కేరళ రాష్ట్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన అనుభవజ్ఞులైన దొంగల ముఠా ప్రయత్నించారు. కారణం?  వారు విగ్రహంలోని అతీంద్రియ శక్తులను విశ్వసించలేదు. కానీ వారు కూడా విగ్రహాన్ని  విడిచిపెట్టారు. తరువాత వారు పట్టుబడినప్పుడు, వారు విగ్రహాన్ని విడిచిపెట్టడానికి పైన చెప్పిన కారణాలే  చెప్పారు.


మన తెలివితేటలు మరియు మన శాస్త్రీయ పరిజ్ఞానానికి అంతు పట్టని విషయాలు మన ఈ ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో?


Good afternoon

చాలీసా" అంటే

 1. చాలీసా" అంటే ఏమిటి? 

జ. ఈస్తోత్రంలో  40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)


2. హనుమాన్ అంటే  అర్థం ఏమిటి?

జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. **అజ్ఞానమును* *హననము చేయునది కనుక* *జ్ఞానమునకు హనుమ అని పేరు.* 


3. ఆంజనేయ - అర్థం?

జ. ఆంజనేయ అంటే .... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల  మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.


4. తులసీదాస్ అస్సలు పేరు ?

జ. *రామ్ బోల*. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.


5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?

జ. దేవుళ్ళ భార్యలను,  మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య  వల్ల వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల".

ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.


6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?

జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. 

హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.


7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?

జ.  తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా  అర్ధం  చేసుకోవాలి.


8. హనుమంతుని పంచముఖములు ఏవి?

జ.  హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు,హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....

తూర్పున వానర ముఖం  జన్మతః  వచ్చినది అది సద్యోజాత శివవదనము.

దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.

పశ్చిమం  గరుడ ముఖం  అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.

ఉత్తరం  వరాహ ముఖం  అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 

ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం . వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు  వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ  నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది🙏🙏🙏🙏


9. "జయ" హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?

జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం  అంటే  అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.


10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?

జ.126 సం.జీవించాడు.


11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు? 

జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం  వచ్చినపుడు, ఎవరైనా  గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.


12. రాక్షస సంహారానికై  హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?

జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం  చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి  నారదుని ద్వారా  హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ  ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.


13 . రామకార్యం  చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?

జ. మైనాకుని ఆతిథ్యం  స్వీకరించకుండా వెళ్ళడంలో.


14 . సీతారాములు పట్టాభిషేక  అనంతరం  హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?

జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన  అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని  బహుమతిగా  ఇచ్చాడు.


15.  కపీశ అంటే అర్థం ఏమిటి?

జ. కపీశ  అంటే...

a) కపులకు ఈశుడు

b) కపి రూపంలో ఉన్న ఈశుడు

సి) కం(జలం)  పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా  తేజస్వరూపుడు అని అర్థం.


16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?

జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏


17. హనుమ రామదూత ఎలా అయ్యాడు  ?

జ. రాముని ఉంగరాన్ని దూతలా  వెళ్ళి  సీతమ్మ కు ఇచ్చాడు. వేదం  అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే  

అగ్ని ముఖావై దేవాః. 

దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు  దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం  అంటే  సృష్టి  క్రమంలో  ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి  వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో  పోల్చారు. అగ్ని ఏవిధంగా  అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను  పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు  హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అంటే just messenger అని మాత్రమే కాదు.


18 . అతులిత బలధామా  అంటే అర్థం ? ఒక ఉదాహరణ?

జ. ఎవ్వరితో  పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే  సీతాన్వేషణ కై హనుమని  ఎంచుకోవడం.


19 . ఇంతకూ  హనుమ కేసరి నందనుడా?  వాయు పుత్రుడా?

జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు  సూర్య  నాడి ద్వారా  వాయుదేవుడు  సర్వ దేవతా తేజస్సు  ప్రవేశ  పెట్టాడు కాబట్టి  ఇద్దరికీ.


20 . నామస్మరణ మహిమ ఏమిటి?

జ. కలియుగంలో  తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం.


21. మహాత్ముడు అంటే ఎవరు ?

జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని  తానే  నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.) 


22 . ఆ రోజులలో ఉన్న వానరుల  ప్రత్యేకత ఏమిటి? 

జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి.


23 . *వీర* లో ఎన్ని రకాలు అవి ఏవి?

జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర.


24 . విక్రమ  అంటే  అర్థం  ఏమిటి?

జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు.


25. సూక్ష్మరూపం  ఎప్పుడు ధరించాడు ?

జ. లంకా  ప్రవేశ సమయంలో  పిల్లి లా మారాడు . మరో సారి సీతమ్మ  ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు .


26. వికటరూపం  అంటే  ఏమిటి ?

జ. వికట = హద్దు లేనిది అని అర్థం, వికట రూపం = భయంకర ఘోర రూపం - లంకా దహన సమయంలో  చూపుతాడు.


27. హనుమ తత్వాన్ని ఏ కార్యంలో చూస్తాము?

జ. లంకా దహన సమయంలో  హనుమ  తత్వాన్ని చూస్తాము.


28. భీమరూపధారిగా  ఎపుడు వున్నాడు?

జ. అసుర సంహారం లో , ఉగ్రమైనదే భీమ రూపం .


29. రామచంద్రుని కార్యం చక్కబెట్టడానికి ఏం చేసాడు ?

జ. తనదైన ముద్రతో  దూతే ఇంత చేస్తే ఇంక రాజు ఎంత చేస్తాడో అని  రావణుడు భయపడాలి అని  భావించి లంకా దహనం చేసాడు.


30. అశోకవన నాశనానికి ప్రతిగా  రావణుడు హనుమకి  ఇచ్చిన దండన ఏది? 

జ.వానరులకు వారి తోక అంటే ఇష్టం ఉంటుంది కనుక  తోకకు నిప్పు పెట్టమన్నాడు.( హనుమని  చంపమని ఆదేశిస్తున్న రావణునితో విభీషణుడు, దూతను చంపరాదు అంటాడు) .


31. రఘువీరుడు ఎందుకు  సంతోషించాడు ?

జ. ఇంద్రజిత్తు అస్త్రం వల్ల వానర సైన్యం, రావణుని శక్తి అస్త్రం  వల్ల  లక్ష్మణుడు పడిపోతే సంజీవనీ పర్వతం (2సార్లు) తెచ్చి రామునికి ఆనందం కలిగించాడు హనుమ.


32. అపుడు రాముడు హనుమని ఎవరితో పోల్చాడు?

జ. నీవు నా తమ్ముడు భరతునితో సమానం అని అంటాడు.


33. భీముడు హనుమని  కోరినదేమిటి (జెండా పై వుండమని కాకుండా) ?

జ. మహత్ రూపం  చూపమని  అడుగుతాడు.


34. హనుమ ఎన్ని సార్లు తన మహత్ రూపం చూపాడు? ఎపుడు ?

జ. మహేంద్ర పర్వతం పైన మొదటిసారి, వ్యాకరణం  నేర్చుకున్నపుడు,  అశోకవనంలో సీతమ్మ దగ్గర  మొత్తం మూడు సార్లు తనమహత్  రూపాన్ని చూపాడు.

(సహస్ర వదన తుంహరో యశ గానై---1000 వదనముల హనుమంతుని మహత్ రూపాన్ని శ్రీపతి అనగా సీతారాములు పొగిడారు)🙏🙏


35. హనుమంతుని జన్మదినం  రెండు మాసాలలో చెబుతారు ఏది సరి అయినది? 

జ) చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు కాని ఇంద్రుని దెబ్బకు మూర్ఛిల్లిని హనుమ  బ్రహ్మ స్పర్శద్వారా తిరిగి ఉత్తేజితుడు అయినది వైశాఖ బహుళ దశమి శనివారంనాడు. అందుకు అలా రెండు మాసాలలో  చెబుతారు. ప్రాంతాన్ని బట్టి జరుపుతుంటారు.


36. హనుమ - ఓంకార స్వరూపుడు- ఎలా?

జ)` *హ* 'లో 'అ', *ను'* లో 'ఉ', ' *మ* ని మ గా తీసుకుంటే అకార, ఉకార, మకారాత్మకమే ఓంకారం కదా అదే హనుమ అంటే.


 37. భజరంగీ అంటుంటాం - ఎందుకు? 

జ) వజ్రం వంటి అంగములు అంటే అవయవములు కలవాడు. అదే వజ్రాంగీ కాస్తా భజరంగీ అయింది.


38. తుమ్హారో మంత్ర విభీషణ మానా .. విభీషణునికి మంత్రం ఇవ్వడం ఏమిటి?

జ) రావణాసురుని కొలువులో  రావణునితో హనుమ అంటాడు- రాముని శరణు వేడమని చెబితే బాగుపడే లక్షణం  లేక  వినడు కానీ అక్కడే ఉండి  విన్న విభీషణుడు పాటించాడు. మంత్రం- ఆలోచన, వ్యూహరచన.


39. అర్జునుడి జెండాపైన హనుమంతుడు ఎందుకు ఉంటారు?

జ. అర్జునుడు రాముడు అంతటి వాడిని అనిపించు కోవాలి అనుకుంటాడు. ఒకసారి కృష్ణునితో, రాముడు సేతువు  రాళ్లతో  కట్టడమెందుకు బాణాలతో కట్టవచ్చుకదా అని అంటే, సరే నీవు ప్రయత్నించు అంటాడు. కొంత మేర కట్టగానే హనుమంతుడు ఎక్కి కూల్చుతాడు. నీవు కూల్చలేని  సేతువు నిర్మిస్తానని అంటాడు. అలా చేస్తే నీవు ఏం చెబితే అది చేస్తానని అంటాడు హనుమ. కట్టలేకపోతే గాండీవం  వదిలేస్తా నంటాడు అర్జునుడు. అయితే హనుమ మళ్లీ కూల్చితే, అర్జునుడు గాండీవం వదలబోగా, ఈసారి ప్రయత్నించు అని కృష్ణుడు చెప్పగా, దానిని హనుమ కూల్చ లేకపోతాడు.( అర్జునుడు గాండీవం వదిలితే జరగవలసిన కార్యం జరగదు).నేను ఓడిపోయాను నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంటాడు హనుమ. అప్పుడు అర్జునుడు, నిన్ను ఆజ్ఞాపించే వాడిని కాను అర్థిస్తున్నాను నా రథం పై వుండి నన్ను రక్షించు అంటాడు. అప్పుడు కృష్ణుడు హనుమతో నువ్వు ఓడలేదయ్యా అంటాడు ,మరి అర్జునుడు ? అని అడిగితే , అర్జునుడు గెలవలేదయ్యా అని కృష్ణుడు తన వీపు చూపగా, మొత్తం నెత్తుటి మరకలు వుంటాయి. సేతువు  నిలవడానికి వీపు అడ్డుపెట్టాను అంటాడు. తనను శరణు పొందిన అర్జునుని విజయానికి  అలా కారణమై నాడు.


యుద్ధసమయంలో  అర్జునుడు కృష్ణునితో  అంటాడు, నేను చంపాలనుకున్న వారిని నా కన్నా ముందే జటాధారియై త్రిశూలం పట్టుకొని  ఒకరు చంపుతూ వుంటే, వారిపై నేను బాణాలు వేసి చంపిన కీర్తి తెచ్చుకుంటున్నాను అని అంటే రథ జెండా పై వున్నఆ శివాంశ సంభూతుడు అయిన హనుమనే అలా చేసినవాడు అని రహస్యం  వెల్లడిస్తాడు కృష్ణుడు.🙏🙏🙏🙏


40 . హనుమ సంజీవనీ పర్వతం ఎప్పుడు తెచ్చాడు?

జ) రెండుసార్లు- వానరసైన్యం మూర్చిల్లినప్పుడు.

లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు.


41 . సుందర కాండకి ఆ పేరు ఎందుకు వచ్చింది ? 

జ. సుందరకాండలో రామ కథ రెండు సార్లు చెప్పబడింది. అందుకు ఆ కాండకు ఆ పేరు.

పోయిన దాని యొక్క జాడ తెలుసుకొని ఆనందాన్ని ఇచ్చేవాడే సుందరుడు.ఆ సుందరుని  గురించి చెప్పేదే సుందరాకాండ.


పోయిన వస్తువు అపురూపంగా సుందరంగా ఉంటుంది.అటువంటి సీత జాడ కనుక్కోవడమే సుందరాకాండ.


హృదయమనే అశోక వనంలో ఆత్మ వస్తువనే సీతను దొరక బుచ్చుకోడమే సుందరాకాండ. 


పరబ్రహ్మ తత్వమే, *సత్యం శివం సుందరం.* అటువంటి పరబ్రహ్మ గురించి అసలయిన తత్వాన్ని వెల్లడించిన కాండ కనుక *సుందర* *కాండ* . 


42. చూసి రమ్మంటే కాల్చి రావడమేమిటి?

జ. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటే, మరి రాముని మాట జవదాటాడు అని అనుకుంటే  హనుమ శివాంశ సంభూతుడు చూపులోనే అగ్ని ఉన్నవాడిని  చూసి రమ్మంటే కాల్చి రావడమే కదా మరి.


43. రాబోయే కల్పానికి హనుమంతునికి రాముడిచ్చిన పదవి ఏంటి?


జ.  *బ్రహ్మ పదవి.* 


పట్టాభిషేక అనంతరం హనుమ గంధమాదన పర్వతం పై తపస్సుకు వెళితే ఒకసారి రాముడు రమ్మని కబురు చేస్తాడు. "బ్రహ్మ  నా అంగుళీయాన్ని పూజించుకుంటాను అంటే ఇచ్చాను దానిని సీతమ్మ చూస్తానంటుంది  బ్రహ్మలోకం వెళ్లి తీసుకు రమ్మంటాడు. యోగ మార్గం( సుషుమ్నా) ద్వారా  బ్రహ్మ లోకం వెళ్లి  బ్రహ్మ ను అడిగితే, ఇచ్చిన దానిని అడగరు అని అంటాడు. చర్చ అనవసరం ఇవ్వమంటాడు. ఇవ్వనంటాడు బ్రహ్మ .అప్పుడు బ్రహ్మ కి వింశతి (20) బాహువుల హనుమ  దర్శనమిస్తాడు. దాంతో బ్రహ్మ నమస్కరించి, తాను పూజిస్తున్న పళ్ళెంలోని అంగుళీయాన్ని తీసుకో  మన గా  చూస్తే  అందులో చాలా ముద్రికలు ఉన్నాయి . ఎన్నో కల్పాలు ఎందరో రాములు. నాకు 100 కల్పాల ఆయువు. కాబట్టి ఇప్పటి ముద్రిక  ఏదో వెతికి తీసుకో అని అంటాడు బ్రహ్మ.హనుమ గుర్తించి తీసుకుంటాడు.


 బ్రహ్మకు హనుమ గొప్పతనం తెలియజేయడానికే రాముడు అలా చేస్తాడు.


తిరిగి వచ్చిన హనుమతో బ్రహ్మలోకం ఎలా ఉంది అని రాముడు అడిగితే , బానే ఉంది కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అని అంటాడు.అప్పుడు  రాబోయే  కల్పానికి నీవే బ్రహ్మవు, ఆ దోషాలను నువ్వు అప్పుడు సరిదిద్దు అని చెబుతాడు.


*వింశతి భుజ హనుమ అభీష్ట సిద్ధి రూపం.* 

20 చేతులలో *ఖడ్గం* , **డాలు,మొనగలిగిన ఆయుధం,పరశువు,పాశం,* *త్రిశూలం,వృక్షం,చక్రం, శంఖం, గద, ఫలం,అంకుశం,అమృత పాత్ర, నాగలి,పర్వతం, టంకం (పార),పుస్తకం,ధనుస్సు,సర్పం* , **ఢమరుకం* ధరించి వున్నాడు .


.అటువంటి హనుమకు బ్రహ్మతో సహా  మనందరo మానసికంగా దర్శించుకొని ప్రణమిల్లుదాం.🙏🙏


 **రామ లక్ష్మణ జానకి జై బోలో* **హనుమాన్ కి* 🙏🙏

 **జై హనుమాన్* ,

 *జై హనుమాన్* ,* 

 *జై జై హనుమాన్.** 

🙏🙏🙏🙏🙏🙏🙏

అసాధ్యస్సాధక

 🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏

*అసాధ్యస్సాధక స్వామిన్,*

*అసాధ్యం తవ కిం వద,*

*రామదూత కృపాసింధో,*

*మత్కార్యం సాధయ ప్రభో!!*

🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏

                                     

*ఒక రోజు శ్రీ రాముడు హనుమంతుని దగ్గరికి పిలిచి ”హనుమా! నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా. దేహ, జీవ, పరమాత్మలకు సమన్వయము చేస్తూ చెప్పు” అని కోరాడు. అదే శిరోధార్యంగా భావించిన పరమభక్త శిఖామణి మారుతి ”శ్రీ రామా! వేదాంత రహస్యము తెలిసిన తరువాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని, జీవుణ్ణి, పరమాత్మను వేరు వేరుగానే భావించాలి. దేహ దృష్టితో పరమేశ్వరుని ధ్యానిస్తూ, సేవించాలి. అన్ని భావాలను త్యజించి, శరణాగతి పొందాలి.*

*ఇతరులకు ఉపకారం చేస్తూ, వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి, సేవించాలి.*

*ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని భావిస్తూ, భగవంతుని స్మరిస్తూ, భగవంతుని పూజలు చేస్తూ, భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండటానికి ద్వైతం అంటారు.*

*జీవుడు, పరమాత్మ ఒక్కరే. ఎందులోను భేదం అనేది లేదు అనే భావనలో, ఆచరణలో చూపించటం జ్ఞాన లేక విజ్ఞాన లక్షణం అంటారు. ఇదే అద్వైత భావన.*

                         ***

”దేహ బుధ్యాతు దాసోహం, జీవ బుద్ధ్యాతు త్వదంశః … ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతిమే నిశ్చితా మతిహ్ ”

                        ***

*రామా! దేహ దృష్టిలో నేను నీకు దాసుడిని. జీవ దృష్టిలో నీవు పరమాత్మవు. నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను.* *పరమాత్మ దృష్టి లో ‘నీవే నేను -నేనే నీవు’ ఈ మూడు లక్షణాలు నాలోనూ, నీలోనూ ఉన్నాయి. ఇంక భేదానికి అవకాశమే లేదు” అని స్పష్ట పరచాడు హనుమ.* *అంజనానందనుడి సమాధానం విని పరమానంద భరితుడయ్యాడు దాశరధి.* 

*”త్వమేవాహం, త్వమేవాహం” అని చాలా సార్లు హనుమను అభినందించాడు.*

                         ***

”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః

యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః

శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం

భోగశ్చ, మోక్షశ్చ, కరస్త యేవ”

                      ***

*అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు. కాని శ్రీహనుమ సేవాతత్పరులైన వారికి భోగమూ, మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం” అను గ్రహించాడు. దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు, నేను భద్రుడను, నీకూ నాకు భేదమే లేదు” అని చెప్పాడు.*

                          

*(శ్రీఆంజనేయం;శ్రీఆంజనేయం;శ్రీఆంజనేయం)*


సేకరించిన అద్భుతమైన సందేశం:-👆

 *ఓం నమో భగవతే పంచవక్త్రహనూమతే నమః!*

*శివాయ గురవే నమః!!*

🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏

ఏకాదస్యాంతు కర్తవ్యం

శ్లోకం:☝️

*ఏకాదస్యాంతు కర్తవ్యం*

    *సర్వేషాం భోజన ద్వయం l*

*శుధ్ధోపవాసః ప్రథమః*

    *సత్కధా శ్రవణం తథా ll*


భావం: మొదటి పాదాన్ని మాత్రం చూస్తే ఏకాదశి నాడు రెండు పూటలా భోజనం చెయ్యమని చెప్పినట్లుగా ఉంటుంది. కానీ "భో, జన" = "ఓ జనులారా" అని సరిగ్గా అన్వయం చేసుకుంటే, అసలు ఏకాదశీ వ్రతం రోజు చేయవలసిన రెండు కర్తవ్యాలూ 1) శుద్ధోపవాసము మరిియూ 2) సత్ కధా శ్రవణము అని బోధపడుతుంది.

26, మే 2022, గురువారం

మహాస్వామి

 మహాస్వామి వారి అన్నపూర్ణావతారం


పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు, “అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా” అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు, ఏమిటి అన్న ఎటువంటి బేధం చూపరాదని చెప్పేవారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సంప్రదాయం గూర్చి ఎప్పుడూ తెలిపెవారు. కేరళలోని చేరుక్కుణ్ణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పధ్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక, ఆహార పొట్లాలు కట్టి, వాటిని చెట్టుకు వేలాడదీసేవారు అటుగా వెళ్ళే దొంగలకోసమని.


సంగం సాహిత్యంలో ఉధియన్ చేరాళదన్ అన్న చేర రాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ ఇరు పక్షాల వారికీ అన్నం పెట్టి ‘పేరుం సోట్రు చేరాళదన్’ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు.


వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ, శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామివారిచే ఆహారం పొందారు.


రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మందీమార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒకచోట వారికి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదట వీరిని శతృవులుగా భావించి బాణాలు చేతబూని విల్లు ఎక్కుపెట్టారు. కాని స్వామివారి దివ్య తేజస్సు చూసి, తప్పు తెలుసుకుని వీరిని ఆదరించారు.


వీరిని అడ్డగించాలని వచ్చినవారే వీరికి కాపలావాళ్లై, సామాను మోస్తూ, రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామివారిని సపరివారంగా తదుపరి చోటుకు చేర్చారు. సెలవు తెసుకునే ముందు అందరూ ఒకచోట చేరారు.


మహాస్వామి వారి వారికి కొంచం ధనం ఇవ్వమని మేనేజరును ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ చెంచుల నాయకుడు మేనేజరుకు ఎదో చెబితే, వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు.

మహాస్వామివారు చిటికె వేసి మేనేజరును పిలిచి, “అతను ఏమి అడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు?” అని అడిగారు.


“పెరియవా ముందర వారు నృత్యం చేయాలనుకుంటున్నారు”


“నృత్యం చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక నేను వారి నృత్యం చూడనని నువ్వు అన్నావు”

మహాస్వామి వారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. మేనేజరు మౌనంగా నిలబడ్డారు.


ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు కూడా చూడని మహాస్వామివారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు ఒక షరతు పైన; మగవారు ఎవరైనా నృత్యం చెయ్యవచ్చు. కాని వారితో పెద్దవారు కాని బాలికలు మాత్రమే కలిసి నృత్యం చెయ్యాలి.


“సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా; దేవుని కోసం, గెలిచినప్పుడు, ఆటలకోసం అలా. మరుప్పుడు మీరు చెయ్యదలచుకున్న నృత్యం ఎలాంటిది” అని అడిగారు మహాస్వామివారు.


“మేము ఇప్పుడు చెయ్యబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే” అని తెలిపారు.


పరమాచార్య స్వామి వారు వారి నృత్యాన్ని చూసి, వారినందరినీ ఆశీర్వదించి, వారికి మంచి విందు ఏర్పాటు చేశారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

25, మే 2022, బుధవారం

పొడుపు పద్యము …...

 ……  పొడుపు పద్యము  …...

ఆ.అలర జేయు పలుకు కైదక్షరమ్ములు 

తలుప మొదటి రెండు ''తపసి'' యగును 

మొదటి రెండు నుడిగి చదువ ''పెళ్ళికొడుకు''  

పదము తెలుప వలయు పసిడి బాల..!

24, మే 2022, మంగళవారం

Comfortable attitude at Old Age*

 *Comfortable attitude at Old Age*


I asked one of my friends who has crossed 60 & is heading to 70. 

What sort of change he is feeling in him?

He sent me the following 

very interesting lines, 

which i would like to share 

with you all.....

1) After loving my parents, 

    my siblings, my spouse, 

    my children, my friends, 

    now I have started loving   

    myself.

2) I just realised that I am not 

     “Atlas”. 

     The world does not rest on 

      my shoulders.

3) I now stopped bargaining 

     with vegetables & fruits 

     vendors. 

     After all, a few Rupees more 

     is not going to burn a hole in 

     my pocket but it might help 

     the poor fellow save for his 

     daughter’s school fees.

4) I pay the taxi driver without 

     waiting for the change. 

     The extra money might 

      bring a smile on his face. 

      After all he is toiling much 

      harder for a living than me

5) I stopped telling the elderly 

     that they've already 

     narrated that story many 

     times. 

     After all, the story makes 

      them walk down the 

      memory lane & relive 

      the past.

6) I have learnt not to correct 

     people even when I know 

     they are wrong. 

     After all, the onus of making 

     everyone perfect is not on 

     me. 

     Peace is more precious than 

     perfection.

7) I give compliments freely & 

     generously. 

     After all it's a mood 

     enhancer not only for the 

     recipient, but also for me

😎 I have learnt not to bother 

    about a crease or a spot on 

    my shirt. 

    After all, personality speaks 

    louder than appearances.

9) I walk away from people 

     who don't value me. 

     After all, they might not 

     know my worth, 

     but I do.

10) I remain cool when 

       someone plays dirty 

       politics to outrun me in the 

       rat race. 

      After all, I am not a rat & 

      neither am I in any race.

11) I am learning not to be 

      embarrassed by my 

      emotions. 

      After all, it's my emotions 

      that make me human.

12) I have learnt that its better 

      to drop the ego than to 

      break a relationship. 

      After all, my ego will keep 

      me aloof whereas with 

      relationships I will never 

      be alone*.

13) I have learnt to live each 

      day as if it's the last. 

      After all, it might be the last.

14) I am doing what makes me 

       happy. 

      After all, I am responsible 

      for my happiness, and 

      I owe it to me.

 ☘ 🥒


I decided to send this to many, because why do we have to wait for so long, 

why can't we practice this at any stage and age...

Best wishes for all my 

grown-up friends & relatives

అమ్మ తీర్పు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

     🙏  *అమ్మ తీర్పు*  🙏           

                 🌷🌷🌷

‘మా ఫ్రెండ్స్ వస్తున్నారు....మందు పార్టీ ఉంది, చికెన్ చేయమంటే, పందిలా పడుకుంటావా?' కోపంగా కాలితో ఒక్క తన్ను  తన్నగానే జ్వరంతో టాబ్లెట్ వేసుకుని పడుకున్న వసుధ ఉలిక్కిపడి లేచింది.  నిద్రలో నుండి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది. ఎదురుగా భీకరంగా కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ భర్త,  కృష్ణమూర్తి.

‘ఎప్పుడూ ఆ దేభ్యం మొహం వేసుకుని ఉంటావు.....ఇల్లు అంటే రావాలి, రావాలి; అనిపించేలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా ...నీ మొండితనం నీదే....ఏదీ వండావా? ’ రంకెలేస్తూ అంటున్నాడు.


‘జ్వరం వచ్చిందండీ, చేతకావట్లేదు, నీరసంగా అంది.


‘ఛీ ...ఎప్పుడూ రోగాలు రొష్టులే, ఎప్పుడు చక్కగున్నావ్ కనుక దరిద్రపు కొంప, దరిద్రపు కొంపాని' కాలితో ముందున్న పిండి గిన్నెను విసిరి తంతూ విసురుగా వెళ్ళిపోయాడు.  ఇల్లంతా ఎగజల్లినట్లు పిండి అంతా పరుచుకు పోయింది.  బాగు చేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వసుధ.


అలా వెళ్ళినవాడు పేకాడుతూ క్లబ్బులో ఆ రాత్రంతా ఉండి పోయాడు.  తర్వాత అక్కడే అలాగే నిద్రపోయాడు.  తెల్లవారి పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయల్దేరాడు.


‘అంటీ మీకీ తాళం చెవి ఇమ్మంది’ అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది.  గుడికో, ఏదైనా పేరంటానికో వెళ్ళినప్పుడల్లా అలా ఇచ్చి పోవడం పరి పాటే.  లోనికి వెళ్ళగానే రాత్రి హాంగోవర్ తగ్గడానికి బాత్రూం కెళ్ళి స్నానం చేసి వచ్చాడు.  తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికి ఎదో తగలడంతో, టవల్ పక్కకు తీసేస్తూ కిందకి చూసాడు.  కింద నిన్న తను తన్ని వెళ్ళిన పిండి. ఏదో అనుమానంతో చుట్టూ పరికించి చూసాడు.  ఎప్పటిలా ఇల్లు కడిగిన ముత్యంలా అద్దంలా మెరిసిపోవటం లేదు.  ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ము దుమ్ముగా ఉంది.  అతని భ్రు ముడి పడింది. పెళ్ళయి ముప్పై వసంతాలు దాటుతున్నా ఎన్ని సార్లు ఎంత పెద్ద గొడవలైనా ఇల్లిలా ఉన్న దాఖలాలు లేవు.  ఏమయ్యింది....నిజంగానే ఆరోగ్యం బాలేక హాస్పిటల్ కి వెళ్ళిందా...కనీసం తనకి ఫోన్ చేస్తుందే....తను తాగిన మత్తులో ఏమైనా ఎత్తలేదా... సెల్ తీసి చూసాడు.  ఏ కాల్ లేదు, సరే తనే ఫోన్ చేద్దామనుకుని చేసాడు. ఊహు, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎంత చేతకాక పోయినా ఇల్లిలా ఎన్నాడూ పెట్టలేదు.  ఆ పరిసరాలు, ఆ నిశ్శబ్దం చికాకు కలిగిస్తున్నాయి.  అసహనంగా అతి భారంగా పావుగంట గడిచింది.... సమయం గడుస్తున్నకొద్దీ కోపం పెరుగుతోంది.. ఆకలి వల్లనేమో అది రెట్టింపవుతుంది.  సరే టీవీ పెడదామనుకుని రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు.  అది బరువుగా పెట్టిన దాని కింది కాగితం ఫాన్ గాలికి ఎగిరి కింద పడింది.  తీస్తూ ఆశ్చర్య పోయాడు.  అది ఉత్తరం.


అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు తీసాయి.


‘నేను చాలా విసిగిపోయాను. అలసిపోయాను.  ఇక నా మనస్సుతో, మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు.  పెళ్ళయిన దగ్గరనుండి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా, భావోద్రేకాలు లేని మరమనిషిగానే భావించారు. అందమైన మీ రూపం వెనుక అందమైన మనస్సుంటుందను కున్నానే కానీ అందం వెనక ఇంత వికృతమైన మనస్సుంటుందనుకోలేదు.  మీకు కావాల్సిన సుఖం, సదుపాయాలను అందించే రోబోలాగానే తప్ప నాకూ మనస్సుంటుందని, దానికేన్నో ఆశలున్నాయని మీరనుకోలేదు. పెళ్ళయి ముప్పై వసంతాలు దాటినా మీరు మారలేదు.  కనీసం పిల్లలూ నా మనస్సు అర్ధం చేసుకోలేదు.  అందుకే ఈ మిగిలిన జీవితం అయినా నా కిష్టమైనట్లుగా గడపడానికి గడప దాటుతున్నాను. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు.  ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు.  ఆ జన్మ సార్ధకత చేసుకునేలా నాకు నేనుగా బతుకుతాను.  మా అమ్మావాళ్ళు బతికి ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి.  పిల్లలకి నా ఆశీస్సులు.  నన్ను వెదకడానికి ప్రయత్నించవద్దు... నా పిచ్చిగానీ మీరెందుకు వెతుకుతారు?  ఒక పనిమనిషిని పెట్టుకుంటారు.’


సెలవ్.... వసుధ.


ఉత్తరం చదివి హతాశుడయ్యాడు. అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు.  ఇంత కాలం కనీసం తనన్న మాటకు ఎదురుకూడా చెప్పలేనిది ఇప్పుడు ఏకంగా ఎగిరేపోతుందా?  ఇది కలా,  నిజమా? చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబిల్ పై నున్న కృష్ణుని పాదాల చెంత పడింది.


కాస్సేపటికి తేరుకుని కర్తవ్యమ్ గుర్తొచ్చిన వాడిలా కొడుక్కి ఫోన్ చేసాడు, ‘అమ్మ వచ్చిందా’ అంటూ, ‘లేదు ఎందుకు ఇంట్లో లేదా?' కొడుకు అడుగుతుంటే పెట్టేసాడు. కూతురుకు చేసాడు. అక్కడా లేదనే సమాధానం వచ్చింది. మైండ్ అంతా బ్లాంక్ అయిపొయింది. షుగర్ పేషంట్ కావడం వల్లనేమో శరీరం వణకడం మొదలయ్యింది.


కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేసాడు.  తరచి తరచి అడగ్గా విషయం చెప్పాడు.  చెల్లి దగ్గరకెల్లిందేమో కంగారు పడవద్దన్నాడు. అక్కడా లేదన్నాక కంగారు పడి బయల్దేరుతా నన్నాడు.  కూతురు వినీల ఫోన్ చేసింది. విషయం తెలిసి తానూ అల్లుడితో చెప్పి బయల్దేరుతానంది. మృదుమధురంగా రవలించే కాలి పట్టాలతో ఇంట్లో నడయాడే ఇల్లాలు లేక ఇంట్లో స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.  ఇంటి ముందు శుద్ది చేసి ముగ్గేసిన ఆనవాళ్ళు లేవు.  పూజ గదినుండి వచ్చే సాంబ్రాణి , అగర్బత్తి సువాసనలు లేవు.  భయం భయంగా బ్రష్ అందిస్తూ, కాళ్ళకు మడుగు లొత్తుతూ , ఇష్టమైనవి కష్టమైనా చేసిపెట్టే ప్రేమదేవత లేదు.  బీపీ, షుగర్ మందులు వేళకు ఇచ్చే ఆత్మీయత లేదు.  ఏం చేసినా ఎందుకు చేసావని గాని, ఎందుకు చేయలేదని గాని అడిగే దిక్కులేదు. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసిందతనికి.  నిగ్రహించుకున్న నిబ్బరం నీరుగారిపోతుంటే అతనికి తెలియకుండానే రెండు కళ్ళల్లోనుండి కన్నీళ్ళు వరదలయ్యాయి.  అలాగే నెమ్మదిగా అచేతనావస్థలో స్పృహ తప్పిందతనికి.


కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో బెడ్ మీదున్నాడు.  ఆసుపత్రిలో చిన్న రూమ్.  పక్కన మరో బెంచీ మీద కూతురు, కొడుకు కూర్చుని ఉన్నట్లున్నారు.  వారి మాటలు వినబడుతుంటే మళ్ళీ భారంగా కళ్ళు మూసాడు.


‘ ఏమో అన్నయ్యా....అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది.  ఏం తక్కువయ్యింది?  నాన్న తాగడం,  కోప్పడ్డం అంతా మామూలేగా... కొత్తేం కాదుగా.... ఏదో మనస్సు ఆపుకోలేక వచ్చాను.  ఆయన అప్పటికే కోప్పడుతున్నాడు, పిల్లలకి ఆయనకు కష్టం అవుతుందని.  త్వరగా వచ్చేస్తానన్నాను.  అయినా నాన్న షుగర్ పేషంట్ అని తెలిసీ ఎలా వెళ్ళింది?  నాన్న ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరి పోయింది గాని, లేదంటే.....ఏదేమైనా నేను ఈ వేళ వెళ్ళిపోతాను’ వినీల అంటోంది.


‘నువ్వెళ్తే ఎలా?  మీ వదిన అయితే ఈ చాకిరీ ఏం చేయదు.  తనకీ చిన్న పిల్ల ఉంది.  అర్ధం చేసుకో... నాన్నను మా ఇంటికి తీసుకెళితే కూడా ఊర్కోదు.  నాకూ ఆఫీస్ ఉంది.  ఈయనతో ఏ టైం కి ఏమవుతుందో?  ఈ టెన్షన్ నేను భరించలేను.’


‘ఆయనకసలే ముక్కు మీద కోపం.  నేను తీసుకువెళ్ళలేను.  ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే, ఇంతకీ అమ్మ ఎక్కడికి, ఎందుకు వెళ్ళినట్లు.  అమ్మే ఉంటే ఈ తలనొప్పి ఉండేదే కాదు కదా!'


‘నేను అందుకే తెలిసిన వాళ్ళనందరినీ వాకబు చేశా....ఉత్తరం ప్రకారం చూస్తే, ఏదైనా ఆశ్రమంకో, హరే రామ హరే కృష్ణ లాంటి మఠం కో వెళ్లి ఉంటుంది’.


‘అవున్రా...నువ్వలా అంటే నాకు గుర్తొస్తోంది.  ఒకసారి అమ్మ ‘అమ్మ అనాధాశ్రమం’ గురించి ఏదో పేపర్ లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలి అని నెట్ లో చూసి చెప్పమంది.’  ఉత్సాహంగా అంది వినీల.


‘అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. నెట్ లో సర్చ్ కొట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను.   ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులమే....’


‘హలో....’అమ్మ 

వృద్ధాశ్రమమానండీ .. డొనేషన్ ఇవ్వడానికి మాకు కొన్ని వివరాలు కావాలండీ... ఓహో... వంద మంది ఉంటారా.......ఈ రెండు రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్తవాళ్ళు చేరారా?  ఆమె పేరు ఏమిటండీ?  ఆ..అవునండీ...వసుధనే, ఉన్నారండీ. మేము ఫోన్ చేసినట్లు 

చెప్పకండి.  మేము వస్తాము. విరాళం తెస్తాము’


‘ఆ... ఏంట్రా అన్నయ్యా !అమ్మ అక్కడికే వెళ్ళిందా?అబ్బా.. ఎంత అదృష్టం !దేవుడు మన మొర ఆలకించాడు...’


అన్నీ వింటున్న క్రిష్ణమూర్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.  తనను ఒక్క రోజు చూసుకోవడం కష్టమయ్యింది పిల్లలకి.  భరించే అమ్మ దొరికిందని సంబర పడుతున్నారు.  నిజంగా వసుధ దేవత.  ఎన్ని రకాలుగా కష్ట పెట్టాడు.  అయినా ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు.  మాటకు ఎదురు చెప్పలేదు.  ఈ కొన్ని గంటలలోనే ఆమె లేకుండా తను ఉండలేదన్నది అర్ధమయ్యింది. బుద్ది వచ్చింది.  తనకు వసుధ కావాలి.  తను లేకుండా ఆమె బ్రతుకగలదేమోగాని ఆమె లేనిది తను బ్రతకలేడు.  డాక్టర్ లోనికి రాగానే హరగోపాల్, వినీల ఆయనతో కల్సి బెడ్ దగ్గర కొచ్చారు.


‘నాన్నా...నాన్నా....అదిగో డాక్టర్ వచ్చారు.  లే నాన్నా...’ పిల్లలు పిలుస్తున్నారు.  నెమ్మదిగా అప్పుడే మెలకువ వచ్చినట్లు కళ్ళు విప్పాడు.


‘ఎలా ఉంది...కొంచెం నీరసంగా ఉంటుంది... మరేం భయం లేదు.  మీరు డిశ్చార్జ్ కావొచ్చు.  కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ‘డాక్టర్ వెళ్ళిపోయాడు.


‘నాన్నా....అమ్మ ఆచూకీ తెలిసింది నాన్నా... ఈ రోజే వెళదాం...’ పిల్లలు డిశ్చార్జ్ కి సన్నాహాలు చేస్తూ అన్నారు.


*********************


‘అమ్మ అనాధాశ్రమం ‘ అన్న బోర్డ్ దగ్గర సరాసరి వెహికిల్ ని ఆపి దిగారు, కృష్ణమూర్తి, వినీల, హరగోపాల్.


‘నవమాసాలు మోసి, కనీ, పెంచి, లాలించి, పాలించి,అనారోగ్యం లో సేవ చేసి, రక్షనిచ్చి, ఆసరా అయి, శక్తి ఉడిగి పండుటాకై నీ చేతిలోనే నేలరాలుతుంది...’ ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మ బొమ్మ దగ్గర రాసి ఉంది.


WOMAN-------W -- Wonderful Mother


O--- Outstanding friend


M--- Marvelous Daughter


A—Adorable sister


N—Nicest gift to Men from God


వినీల ఇలా అక్కడున్న కొటేషన్లు చదువుతుంటే, హరగోపాల్ తొందర పెట్టి తీసుకెళ్ళాడు.


ఆఫీస్ రూమ్ లో పెద్దావిడ కూర్చుని ఉంది. ఆవిడ పైన ‘జీవితం ఒక అద్దం లాంటిది. అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది.  దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది.  తేడా అద్దంలో లేదు. మనలో ఉంది.  జీవితం లోని సమస్యలు కూడా అంతే.  అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి’ అన్న కొటేషన్ రాసి ఉంది.  ఆవిడతో వివరాలు చెప్పి వసుధను ఒక్కసారి పిలిపించమని చెప్పారు.  ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి, పిలిపిస్తాను అంది.  ముగ్గురు ఆ గదిలోకి నడిచారు.  ఆ గది గోడల పైనన్నీ అందంగా రాసిన ఆణిముత్యాల్లాంటి కోటేషన్లే.  టెన్షన్ తో ఉన్న మనస్సు మళ్ళించడానికన్నట్లు మౌనంగా అంతా ఆ కొటేషన్లు చదవడంలో మునిగిపోయారు.


‘ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడువక తప్పదు.


ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు.


ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు.


ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాకతప్పదు.


ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు.


ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు.


ఇదే జీవితం’


‘జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే!


ఎన్ని సార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది.


గమ్యం అనంతం, గమనం అనేకం.


ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం! ‘


 *ముసలితనం* 


‘నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు,


నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు,


నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు,


నీ పనులకు ఒకరి మీద ఆధార పడిన రోజు,


నీ భావాన్ని నీ నోటితో పలుకలేని రోజు’


నీ నిస్సహాయస్థితి కి నీకే జాలికలిగే రోజు నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది.


కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది.


తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు’


చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళల్లో నీరు ఉబికింది. తలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూసారంతా.


పసుపు పచ్చని చీరలో, నుదుట ఎర్రటి బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదు మధుర అందెల సవ్వడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగుపెట్టింది.


‘అమ్మా, అమ్మా,’ అంటూ చిన్నపిల్లల్లా రెండు వైపులా ఏడుస్తూ హత్తుకు పోయారిద్దరు పిల్లలు.  భుజంపై తల ఆన్చిన ఇద్దరినీ ఆర్తిగా భుజాలపై అలాగే రెండు చేతులతో తలనిమురుతూ ఉండి పోయింది వసుధ .


‘అమ్మా...నీకేం తక్కువయ్యిందని వచ్చావ్?' ముందు హరగోపాల్ అన్నాడు విడివడుతూ...


‘అన్నీ ఎక్కువే అయ్యాయి, భరించలేక వచ్చా’ స్పష్టంగా అంది వసుధ .


‘ నీకేదవసరమైనా అన్నీ క్షణాల్లో నాన్న తెచ్చిపెడుతున్నాడుగా, ప్రేమ లేకుంటేనే అలా చేస్తాడా? .’వినీల ఆరా..


‘మొన్ననే గోపాల్ పెళ్ళిలో బంగారం కూడా కొనిచ్చాను.  ప్రేమలేకుంటేనే చేస్తానా?  ఏం లేదని ఇలా వచ్చావ్?’  భర్త అసహనం.


‘ మనశ్శాంతి.  అది దొరకకనే వచ్చా...మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా...’ఏయ్ మనిషీ...ఇగో... ఓ దేభ్యం మొహం..’ ఇవీ నా బిరుదులు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్ళని శాశ్వతంగా వదిలి పెళ్లి కాగానే చిరకాలం కష్టసుఖాల్లో తోడూ నీడై కలిసి ఉంటాడని గుడ్డి నమ్మకంతో వస్తాం.  కానీ ఎన్నడూ నా మనస్సు ఏమిటో కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ.. ఏంటీ.. బంగారం కొనిచ్చానన్నారు కదూ...నేను అడిగానా, అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్ గా కనబడడానికే.  మీకు అన్నీ ఎప్పటికీ అమర్చి పెట్టే భార్య ఈ రోజు మీరు చెప్పింది వండలేదంటే,  ఏ బాధ ఉందో అని ఆలోచించక, చేయిచేసుకునే మనిషికి ఎం ప్రేమ ఉందనుకోవాలి?  ఏ అనురాగ బంధమూ లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది.

చిన్నప్పటి నుండి నా మనస్సులో ఎన్నో కోరికలు ఉండేవి.  ఎంతో చదువుకోవాలని, ఏవేవో చదవాలని, పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు.  కాని ఒక్కటీ నెరవేరలేదు.  కారణం, ఆయనకిష్టం లేదు కాబట్టి.  ఇప్పుడు చదివి ఎవర్ని ఉద్ధరించాలని అంటూ ప్రతీ దానికి ఆంక్షలే.  అందుకే ఈ చరమాంకం లోనైనా ఇప్పుడైనా ఓపెన్ యునివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను.  గుడిలో అందరూ నేను పాడే పాటలు కీర్తనలు చాలా ఇష్టపడతారు. ఎంతో మంది రాసియ్యమని అడిగేవారు.  అలా అవన్నీ గ్రంధస్తం చేస్తాను.  అలనాటి మన సంప్రదాయ సంస్కృతులలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు, కొంగుచాపే పాట, తలుపుల దగ్గర పాడేపాట, అప్పగింతల పాట, బతుకమ్మ పాటలు, మన సంస్కృతీ సంప్రదాయాలు తెలిపే మంగళ హారతి పాటలు, జోల పాటలు ....ఇలా ఎన్నో పాటలు కనుమరుగవుతున్న సంప్రదాయాలన్నింటిని గ్రంధస్తం చేయాలనుకుంటున్నా.  ఆయన మారతాడని ఇంతకాలం ఎన్నో భరించా... కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే  అని తెలుసుకున్నా, అందుకే నా కిష్టమైనట్లు కనీసం ఈ జీవిత చరమాంకం లోనైనా బతకాలనుకుంటున్నా’.


‘అమ్మా...అమ్మ భువిపై దేవుడి అపురూపమైన సృష్టి అంటారు . తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమఉంటుంది కదా!  అందులో ఆడపిల్లని, నా కోసమైనా ఒక్కసారి ఆలోచించలేవా అమ్మా?' వినీల అంది.


‘బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నేరవేర్చాను.  ఇప్పుడు నీకు అన్నీ ఆలోచించే విచక్షణా జ్ఞానం ఉంది. ఎప్పుడూ...'అమ్మా! పిల్లలతో నాకు ఇంత కష్టం అవుతుంది' అని అంటావు.  పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను.  నీ ఇంటి కొచ్చి ఏదో రెండు మూడు నెలలకో నాలుగు రోజులు చేయగలను.  కాని మళ్ళీ నాలుగు రోజులకే 'వచ్చి హెల్ప్ చేయవచ్చుగా' అంటావ్.   నాకూ వయసై పోతుంది... ఇదివరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు.  పైగా నీకు చంటిపిల్ల ఉన్నప్పుడు నాన్న కేరళ లో ఉన్న ఏదో ఫంక్షన్ కి నన్ను తీసుకుని వెళితే, ఈ వయస్సులో హనీమూన్లా తిరుగుతున్నారని అల్లుడు తప్పుపట్టాడని చెప్పావే కాని,’ మరి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు. వారి డబ్బులతో వారు వెళ్ళారు... కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే వెళ్ళాలి కదా' అని మీ ఆయనకీ సర్ది చెప్పుకోలేక పోయావు. ఎప్పుడూ అయ్యో బిడ్డ కష్టపడుతుందని అవో, ఇవో చేసి పంపే నా ఆరాటమే కాని, ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగావా? ఎందుకంటే అమ్మ అది ఆశించదు.   నిజమే... కానీ మళ్ళీ నీ కడుపున పుట్టినవాళ్ళు కూడా నీలాగే తయారవుతారు.  అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు.  అది నేను భరించలేను.  కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువత లోకి చొచ్చుకుపోయేలా చేయాల్సిన అవసరం ఇప్పుడుంది.   నాలా, నా బిడ్డ గాని, మరో అమ్మ మనసు గానీ బాధ పడొద్దని నా ఆశ‘ వినీల కళ్ళనిండా నీళ్ళు నిండాయి.


‘అమ్మా!  మరి నేనేం తప్పు చేసాను.  కనీసం నువ్వు నా దగ్గరికైనా రాకుండాఎందుకు వెళ్ళిపోయావు?’  కినుక చూపాడు కొడుకు.


‘మానవ శరీరం గరిష్టంగా 45 డే(యూనిట్ల) బాధను భరించగలదట.  కానీ బిడ్డకు జన్మ నిచ్చేప్పుడు తల్లియాభై ఏడు డే (యూనిట్ల) నొప్పి భరిస్తుందట. అది 20 ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట.  కాని అంత బాధ భరించి తన కడుపును చీల్చి జన్మ నిచ్చిన తల్లి, బిడ్డను చూసి అంత బాధ మర్చి పోతుందట.  కోడలు ‘మీ అమ్మ కి ఎప్పటికీ కూతురంటేనే ఇష్టం.  నేను చదువుకుంటూ పాపని చూసుకోవడం ఎంత కష్టం, వచ్చి సహాయం చేయొచ్చుగా... ఆమె కన్నీచేసి పెడుతుంది.  అదే కొడుకంటే ప్రేమే లేదు' అంటూ ఎన్నో అందని చెప్పావు.  అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను.  నేనున్నన్ని రోజులు వంట గదిలో గాని, ఏపనిలో గాని నేను చేసింది తనకు నచ్చదు.  ఏదో అని చీదరించుకుంటుంది.  భయం భయంగా బతికాను.  ఆమె నన్ను అలా అన్ని మాటలంటున్నప్పుడు నీ మనసుకి తెలీదా నా మనసు.   ఆమెకు నేను రెండేళ్లుగానే తెలుసు కావచ్చు.  కాని నీకు నేను నువ్వు పుట్టినప్పటి నుండి తెలుసు.  ఒక్క సారి నేనలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు. అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కాని రేపు నీ కొడుకుతో మీరలా బాధపడొద్దని.  నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ ముగిసేలోగా చేయాలని మాత్రమే వచ్చేసాను.  నన్ను క్షమించండి....’


‘వసుధా!' జీవితం లో తొలిసారి మార్దవంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి.


‘నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే.  కాని నీ మనస్సింతగా గాయపడుతుందనుకోలేదు. నువ్వు లేని క్షణమొక యుగమైంది.  నువ్వు లేక నేను బతక లేను....రా వసుధ..నా అవసరం కోసం నిన్ను పిలవడం లేదు.  అక్కడే ఉండి నీకిష్టమైనవన్నీ చేసుకో. ఇక నుండి నీ ప్రతీ కష్టం పంచుకుంటాను. పేకాట, తాగుడు వదిలేసాను. ఇకముందు కూడా వాటి జోలికి పోను.  నువ్వేన్నోసార్లు అవి మానేయడానికి డాక్టర్ దగ్గరకు కౌన్సిలింగ్ కి రమ్మన్నావు.  కదా వస్తాను.  నిన్న డాక్టర్ చెప్పాడు. నీకు తరచూ అనారోగ్యం ఎందుకొస్తుందో. బాబుకు కిడ్నీ చెడిపోతే ఎవరికీ తెలవద్దంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా, దానివల్లనేనట.  నిజంగా ‘అమ్మ ‘ అనే పదానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం.  ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను.  నా మీద ఒట్టు.  నన్ను నమ్ము వసుధా. ప్లీజ్’ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు కృష్ణమూర్తి.


‘అమ్మా, నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా.‘


‘అమ్మా...నీ తల్లి మనస్సు అర్ధం చేసుకోలేక పోయాను.  ఇంకా నేను బాధ పడకూడదనే తపన పడుతున్న నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తోందమ్మా, నన్ను క్షమించమ్మా.’ పిల్లలిద్దరూ కన్నీళ్ళతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు.


‘మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటి వారి లోని లోపాలు, తప్పులూ మరింత చిన్నవిగా కనిపిస్తాయి.  ఓర్పు క్షమాగుణం పెరుగుతాయి.  ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి...‘ ఐశ్వర్యారాయ్ కావాలంటే అందం ఉండాలి..కాని మదర్ తెరిస్సా కావాలంటే మనస్సుంటే చాలు..’ ఎదుట ఉన్న కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి.


ఆ ప్రాంగణం లోని గుడిలోని జేగంటలు తధాస్తు అన్నట్లు మంగళకరంగా మోగాయి. 

ప్రతి ఒక్కరు చదివి అందరి చేత చదించాల్సిన వ్యాసం.


అమ్మకు జేజేలు

👏👏👏👏👏

🙏ఈ  కథ వ్రాసిన  వారికి నా  అభినందనలు. 🙏

యీ మెసేజ్ చూసిన ప్రతి ఒకరు మీ తల్లి తండ్రులను ఏవిధమైన యిబ్బంది కలుగకుండా ప్రేమగా ఆప్యాయంగా, అత్తమామలను తన తల్లి తండ్రులగా చూసుకుంటే వృద్దాప్యంలో వున్న వారికి ఏ సమస్య వుండదు.  అనాధ ఆశ్రమాలు వుండవు.


 *సేకరణ:  వాట్సాప్.*

హనుమజ్జయంతి ప్రత్యేకం - 5

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం - 5

       (ఈ నెల 25వ తేదీ హనుమజ్జయంతి) 


5. హనుమంతుడు - పరమాత్మకి మెచ్చిన దూత 


* మొదటి కలయిక 


    ఋశ్యమూక పర్వతము వద్దనుంచి వచ్చి, 

    శ్రీరాముని తొలిసారి కలసి మాట్లాడిన హనుమ మాటలు విన్న శ్రీరాముడు, 

    హనుమ గూర్చి లక్ష్మణునితో ప్రశంసిస్తూ, 

   "ఇట్టి దూత లేని రాజు తలపెట్టీన పనులు ఎలా సిద్ధిస్తాయి? 

    ఇట్టి గుణగణములు కల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద ఉంటారో, అతని కార్యాలు ఆ దూతలచే నిర్వర్తించబడి, సిద్ధిస్తాయి" అంటాడు.  


* సీతాదర్శనానంతరం 


    హనుమ విషయాలను శ్రీరామునికి నివేదించిన తరువాత,

   దూతలు మూడు తరగతులని శ్రీరాముడు పేర్కొన్నాడు. 

      (యుద్ధకాండ - 1వ సర్గ) 


(i) ఉత్తమ దూత:

       స్వామి శ్రేయస్సు దృష్టియందుంచుకొని, చేసికొని రమ్మన్న పనిని మాత్రమే గాక, దానికి అనుబంధంగా స్వామి ధ్యేయాన్ని సాధించే ఇతరపనులను కూడ సర్వాంగ సౌష్ఠవంగా సాధించువాడు ఉత్తమ దూత:

(ii) మధ్యమ దూత

         చేసికొని రమ్మన్నపని తూ.చ. తప్పకుండా అంతమటుకే చేసికొని వచ్చువాడు మధ్యమదూత. 

(iii) అధమదూత: 

          చేసుకొని రమ్మన్నపనిని సావధానమూగా చేయనివాడు అథమదూత. 


    ఈ సందర్భంలో సముద్రందాటి తిరిగి వచ్చిన కార్యసాధకుడైన హనుమను రాముడు "హనుమ ఒనర్చిన ఘనకార్యములు లోకములోనే 

అత్యద్భుతములైనవి, 

ఊహకందనివి, 

అనితరసాధ్యమైనవి" అని ప్రశంసించాడు.  

    హనుమకు తాను తన గాఢాలింగన సౌఖ్యాన్ని మాత్రమే ఇయ్యగలనని తెలిపాడు. 

    అదియే హనుమకు పరమ సుఖానుభవములను కల్గించగలదని పేర్కొన్నాడు. 

    అప్పటికి తానీయగలిగిన సర్వస్వము అదియే అన్నాడు.  

    పులకితగాత్రుడై, తాను అప్పగించిన కార్యమును సఫలమొనర్చిన హనుమని తన హృదయానికి హత్తుకొన్నాడు. 


* ఉత్తమ దూతయైన హనుమ దౌత్యము నెరిపిన సందర్భములు నాలుగు. అవి 


(౧) సుగ్రీవుని దూతగ రామ సందర్శనము: 

    రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడ్డాడు. 

    హనుమ భయాన్ని వీడమన్నాడు. అప్పుడు ఆ రామలక్ష్మణుల వివరాలను తెలుసుకొని రమ్మని  హనుమంతునే పంపాడు సుగ్రీవుడు. 

    రామలక్ష్మణులు సుగ్రీవుని మైత్రికై ప్రయత్నిస్తున్న విషయం పసిగట్టి హనుమ, 

    కపిరాజ్యాన్ని సుగ్రీవునకు సంపాదించిపెట్టే పథకము రూపొందించుకొన్నాడు. 

    చూచి రమ్మన్నదానికన్న చాల ముందుకుపోయి ఆ ధ్యేయ సాధనకు రాచబాట పరిచాడు. 


(౨) రాముని దూతగ సీతకు సందేశం: 

    సీత జీవించియున్నదో లేదో చూచిరమ్మని పంపిన వేరెవరైనా, చూచిన వెంటనే వెనుదిరిగి పోయి ఉండెడివాడు. 

    లేదా ఆ సంతోషంలో ఆమె ముందు దూకి కార్యము చెడగొట్టేవాడు కావచ్చు. 

    కానీ హనుమ అన్ని విషయాలని తర్కించుకొని 

  - సీతకు రాముని సందేశమూ, 

  - అంగుళీయకమూ అందించాడు. 

    సీత నుంచీ కబురూ, చూడామణీ తీసుకుని, తిరిగి రాముని వద్దకు వెళ్ళాడు. 


(౩) సుగ్రీవుని దూతగ రావణునితో: 

    రావణునితో దౌత్యము నెరపమని హనుమకెవ్వరూ చెప్పలేదు. 

    అయినా వానర బలపరాక్రమాలు రావణునకు తెలిపి, 

    రాక్షసులలో మనోధైర్యాలు శిథిలపరచుట తన స్వామి కార్యమునకు అనుకూలములని ఆలోచించి నిర్ణయించుకున్నాడు.   


(౪) రాముని దూతగ భరతునితో సమావేశము: 

    14 సంవత్సరాలు వనవాస దీక్ష పూర్తిచేసుకున్నాడు రాముడు. 

    తెల్లవారి అయోధ్యకు చేరకపోతే, భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు. 

    హనుమకు రాముడు సంగతి తెలిపి, భరతుని వద్దకు పంపాడు. 

    తనరాక భరతునకు ఆనందమైతే సరే. అట్లుకాక భరతునికి రాజ్యకాంక్ష ఉన్నట్లనిపిస్తే, 

    హనుమను వెంటనే తిరిగి తన వద్దకు వచ్చివేయమన్నాడు. 

    భరతుని అభిప్రాయం తెలిసికొనడం తేలికగాదు. 

    హనుమ పూర్వము నడిపిన దౌత్యములు రామునకు ప్రీతికల్గించాయి. 

    అట్లే హనుమ రామునికి సరియైనదౌత్యాన్ని భరతునితో నడిపాడు. 


    ఈ విధంగా హనుమ సుగ్రీవునికీ శ్రీరామచంద్రునికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఉత్తమ దూత. 


    విశ్వంలో ఏ దౌత్యమైనా, ఏ విధంగా ఉండాలో అందరూ తెలుసుకొనేలా, 

    తాను ఆచరించి చూపిన ఆదర్శవంతుడైన దూత హనుమంతుడు. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)