నాగులచవితి గురించి సందేహ వివరణ
తేదీ 28.10.2022 శుక్రవారం చవితి ఉదయం 10.33 ని.లకు ప్రారంభం అయి తేదీ 29.10.20220 శనివారం ఉదయం 8.13 ని.ల వరకు ఉంటుంది.
సాధారణంగా చవితి మధ్యాహ్నం వరకు ఉన్న సమయంలో నాగదేవత ఆరాధన చేయాలి. అంటే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉన్న శుక్రవారం నాడు మాత్రమే నాగులచవితి చేయాలి. అలాకాకుండా శనివారం ఉదయం 6.00 నుండి 7.40 వరకూ దుర్ముహూర్తం ఉంది. అంటే శనివారం కేవలం 33 నిముషాలు మాత్రమే చవితి ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఉండదు.
అందుచేత శుక్రవారం నాడు ఉదయం 10.33 తరువాత నాగులచవితి పండుగ ఆచరించడం సాంప్రదాయం.
దీని గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శనివారం అని అంటారు. కానీ అది నిజం కాదు. ఈ విషయం మీకు తెలిసిన వారికి తెలియచేయండి.
తేదీ 28.10.2022 శుక్రవారం నాడు మాత్రమే నాగులచవితి చేయాలి.
రకరకాల వాట్సాప్ గ్రూపు లో శనివారం అని అంటున్నారు. అటువంటి మెసేజులు వస్తే వెంటనే దానిని మిగతా వారికి గుడ్డిగా పంపకుండా ఆలోచన లేకుండా అనుసరించవద్దు.
⚘️⚘️⚘️GOOD IMC ⚘️⚘️⚘️
ఇట్లు
మీ
నాగరాజు శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి