28, అక్టోబర్ 2022, శుక్రవారం

నాన్న కోప్పడితే

 /🍀🌺🍀🍀🍀🌺🍀🌺🍀🌺🍀


          *నాన్న..!*

       ➖➖➖✍️


*ఓ తండ్రి కష్టపడి తన కొడుకును బాగా చదివించాడు. తండ్రి కష్టం కళ్ళారా చూసిన తను కూడా రాత్రి పగలు కష్టపడి చదివి IAS సాధించాడు. ఓ జిల్లా కు కలెక్టర్ గా నియమింపబడ్డాడు.*


*కొడుకు కు బయటి భోజనం పడేది కాదు, రోజూ తన తల్లి ఇంట్లో చేసిన భోజనమే తినేవాడు, అందుకు తండ్రి రోజూ ఇంటినుండి తనే స్వయంగా భోజనం క్యారియర్ తీసుకుని వెళ్లేవాడు, అలా తీసుకువెళ్లి తనే స్వయంగా తన కొడుకు కు వడ్డించేవాడు, అలాచేయడం తన మనస్సుకు చాలా సంతోషంగా అనిపించేది.*


*ఓరోజు తండ్రి,కొడుకును అప్యాయంగా దగ్గర తీసుకుని  “ఈ ప్రపంచంలో అత్యంత సమర్ధవంతుడు,గొప్పవాడు ఎవరో చెప్పగలవా?” అన్నాడు.*


*“అది నేనే!” అన్నాడు తడుముకోకుండా.*


*ఆ సమాధానానికి తండ్రి నొచ్చుకున్నాడు, తన కొడుకులో అహంకారం మొదలైందని కాస్త అనుమానం కలిగింది. చివరకు ఉండబట్టలేక గది బయటకు వస్తూ కొడుకు వైపు చూసి మరోసారి అదే ప్రశ్న ను వేసాడు.*


*ఈసారి ఆ కొడుకు తడుముకోకుండా "నాన్న" అన్నాడు.*


*తండ్రి ఆశ్చర్యపోతూ… “ముందు ఇదే ప్రశ్న కు నేనే అన్నావు, ఇప్పుడు అదే ప్రశ్న కు నాన్న అంటున్నావు ఎలా?”*


*కొడుకు చిరునవ్వు నవ్వుతూ తన సీట్ లో నుండి లేచి తండ్రి ముందు మోకాళ్ళ మీద నిలబడి తన తండ్రి చేతులు పట్టుకుని “నాన్నా ! మీరు మొదటిసారి ప్రశ్న అడిగినప్పుడు మీ చేయి నా భుజం పై ఉంది. తండ్రి చేయి భుజంపై ఉన్న ఏ కుమారుడైనా ఈ ప్రపంచంలో సమర్ధవంతుడు, గొప్ప వాడు, మరియు అదృష్టవంతుడు కూడా.. “*


*”తరువాత మీరు గది తలుపు దగ్గర నిలబడి అదే ప్రశ్న వేసారు, అందుకు నేను నాన్న అని సమాధానం ఇచ్చాను..”*


*”ప్రపంచంలో     ఏ కొడుకుకైనా సమర్ధవంతుడు, గొప్ప వాడు తన తండ్రి కాక మరెవ్వరు ఉంటారు నాన్నా?”*


*”మీరే నా రియల్ హీరో! “*


*తండ్రి చమర్చిన కళ్ళతో   కొడుకును ఆలింగనం చేసుకుని తేలిక పడిన మనసు తో బయటికి నడిచాడు...*


*అమ్మ ‘నవ మాసాలు’ కడుపులో మోస్తే  తండ్రి జీవితాంతం నిన్ను తలలో మోస్తాడు!*


*అమ్మ ముద్దాడితే అర్థం ఉంటుంది, నాన్న కోప్పడితే పరమార్థం ఉంటుంది.*


*నీ గెలుపు కోసం    జీవితంలో గంట, గంటకు ఓడిపోయేవాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నాన్న ఒక్కడే, అమ్మ ప్రేమ భూమి అంత అయితే, నాన్న ప్రేమ ఆకాశమంత!*✍️


 *నాన్న లకు అంకితం !*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: