28, అక్టోబర్ 2022, శుక్రవారం

ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించుచున్నాను.🙏

 శ్లోకం:☝️అఘోర ముఖ ధ్యానం

*కాలాభభ్రమరాంజనద్యుతినిభం*

  *వ్యావృత్తపింగేక్షణం*

*కర్ణోద్భాసిత భోగిమస్తకమణి*

  *ప్రోద్భిన్న దంష్ట్రాంకురం l*

*సర్పప్రోత కపాలశుక్తి శకల*

  *వ్యాకీర్ణ సంచారగం*

*వందే దక్షిణమీశ్వరస్య కుటిల*

   *భ్రూభంగ రౌద్రం ముఖం ll*

   - శివపంచానన స్తోత్రం - 2


భావం: దట్టమైన మేఘాలు, తుమ్మెదల వలే నల్లని కాటుక కాంతితో ప్రకాశించేదియు, గోరోజన వర్ణముతో వెడల్పయిన కన్నులు కలదియు, చెవులకు ఆభరణాలుగా ఉన్న సర్ప శిరోరత్నములతో వాడియైన కోరలు కలదియు, సర్పములతో పాటు హారముగా కూర్చబడిన కపాలములు కలదియు, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుడు వంకరలుగా నున్న కనుల యొక్క కనుబొమల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించుచున్నాను.🙏

కామెంట్‌లు లేవు: