కాశీకి పోయితి గంగలో ముమ్మారు
ముని పూతుడనైతి మోక్షమొచ్చు బదరికాక్షేత్రాన పలుమారు స్నానించి పండితి నికవచ్చు పరమపదము
కష్టించి సేసితి కాశిరామేశ్వర
ములయాత్ర నిక నాకు ముక్తి గలుగు
పుణ్యతీర్థములన్ని పూతచిత్తము తోడ సేవించి తనిసితి శివము వచ్చు
తే.గీ.
ననుచు తృప్తితో మనగానె యభవ మగునె? దేహమందు వలపు పెంపు తెంపుకొనక లోకవిషయాల ప్రీతులు మాపుకొనక జ్ఞానతృష్ణను బొందకన్ చవులతోడ శ్రీశర్మద
(శివము=మోక్షము; అభవము=మోక్షము;)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి