ముగిసిన మనోడు ఉప ఎన్నిక ఈ ఎన్నిక కేవలం మూడు ముచ్చట్ల మీదనే ఆధారపడి జరిగింది మందు ,ముక్క , ముడుపులు, మరి గత రెండు నెలలుగా జరిగిన ఈ తతంగంలో ప్రజాస్వామ్యం గెలిచిందా ప్రజలు గెలిచారా కానే కాదు కేవలం డబ్బున్న వాడు అంగ బలమున్నవాడు అధికారం ఉన్నవాడు మాత్రమే గెలిచిందని చెప్పుకోవాలి , ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఒక ఉపనిక వచ్చిందంటే మొత్తము ప్రభుత్వ యంత్రాంగం మొత్తము అధికార అనధికార వ్యక్తులు మొత్తము ఒక చనిపోయిన కళేబరం దగ్గర పెద్ద బోధలు వాళ్ళనట్లుగా ప్రజలపై వాళ్ల వాళ్ల ప్రలోభాల జల్లులు కురిపించి వారిని మత్తులో ఉంచి గెలిచిన గెలిచే తప్ప ప్రజాస్వామ్యంగా ప్రజల మనస్ఫూర్తిగా ఇచ్చిన తీర్పు కానీ కాదు, ప్రస్తుతము అన్ని పార్టీలు అవలంబిస్తున్న ఈ ప్రచార సరళి రేపు ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది ఈ తీరు మారకుంటే ఎప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో జరగవని సామాన్య మానవుడు తెలుసుకోవాల్సిన విషయం, ప్రస్తుతం గెలిచినవారు ఓడినవారు కలిసి ప్రజలను ఓడించినట్లుగా ఉంది ఈ ఉప ఎన్నిక.
సేకరన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి