20, మే 2023, శనివారం

విభూతి ( భస్మం )....!

 🎻🌹🙏 విభూతి ( భస్మం )....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿హోమంలో దర్బలు, ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని కూడా అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి ( భస్మం ) ప్రతి శివాలయంలోనూ తప్పక ఉంటుంది.


🌸వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగ్ను. బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగును. 


🌿విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును.


🌸అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. 


🌿విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. హోమగుండంలో హోమం చేసినప్పుడు, ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు.


🌸 హోమగుండం, ధుని – రెండూ పరమ పవిత్రమైనవి. హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు. ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు (Hairy Coconuts), పిడకలు (cakes made of cows dung), రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు (Pieces of Peepal, Tulasi and Medi), నవధాన్యాలు (Nine different grains), 


🌿గంధపుచెక్కలు (Pieces of Sandal wood), నేరేడు (Camphor ), సాంబ్రాణి (Sambrani), ఆవునెయ్యి (Cows ghee ), సాంబ్రాణి sambrani powder), అగరొత్తులు (Incense Sticks) వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి. విభూతిని విషెషమైన ఐష్వర్యము అని అందురు.


🌸విభూతి ధరించే విధానం

కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. 


🌿అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. 


🌸విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు.


🌷విభూతి పేర్లు - వర్ణములు🌷


🌿1. భస్మం - శ్వేత వర్ణము


🌸2. విభూతి - కపిల వర్ణము,


🌿3. భసితము -కృష్ణ వర్ణము


🌸4. క్షారము - ఆకాశ వర్ణము


🌿5. రక్షయని - రక్త వర్ణము


🌸కొన్ని విశ్వాసాలు

హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.


🌿హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి.

హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటకంగా జరుగుతాయి.


🌸భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.

వివిధ హోమభస్మాలు చేసే మేలు:


🌷1.శ్రీ మహాగణపతి 🌷


🌿హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.


🌷2.శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.


🌷3.శ్రీ దుర్గా 🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.


🌷4.శ్రీ ధన్వంతరి 🌷


🌿 హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.


🌷5.శ్రీ నవగ్రహ  🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.


🌷6.శ్రీ మహా మృత్యుంజయ 🌷


🌿హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి.


🌷7.శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, 🌷


🌸శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.


🌷8.శ్రీ సుదర్శన 🌷


🌿 హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.


🌷9.శ్రీ లక్ష్మీ నారాయణ  🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.


🌷10.హోమ 🌷


🌿 భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.


🌸గమనిక : హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.


🌷విభూతి స్నానం :🌷


🌿స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు.


🌸ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం, లేదా బూడిద. కాలడానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్థం.


🌿 రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి ఉండాలి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం.

కామెంట్‌లు లేవు: