20, మే 2023, శనివారం

ఆచార్య సద్బోధన:*

 

            *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️


*' పరోపకారార్ధమిదం శరీరం ' పరులను సేవించుట కొరకే మానవ దేహము.* 

*సేవ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని తటపటయిస్తూ ఉంటే పనులు జరగవు.*


*అసలు నువ్వేమనుకుంటున్నావో ముందు ఆలోచించు!*

*ఆకలి వేసినపుడు నీకు నచ్చిన ఆహారము తింటున్నావు, మంచి దుస్తులు వేసుకుంటున్నావు. పక్కవాడకి నచ్చలేదు అని, వద్దు అన్నాడని  మానుకుంటున్నావా!లేదు కదా! మంచిని శత్రువు చెప్పినా వినాలని, చెడును మిత్రుడు చెప్పినా వినకూడదని అంటుంటారు.*


*సేవ అనేది అత్యుత్తమైన ఆధ్యాత్మిక సాధన.*

*దానిని ఎవరో ఏమో అనుకుంటారు అని వదులుకోవడం మూర్ఖత్వం.*


*మంచి చేస్తున్నపుడు ఎవరి మాట పట్టించుకోవాల్సిన పని లేదు.*


*భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకో! అన్నింటా భగవంతుడే తోడై నిన్ను సఫలం చేస్తాడు...*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️

*మన ఆరోగ్యం….!


          *అమృతఫలం..జామ!*

                   ➖➖➖✍️


*చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఔషధం…జామ కాయ.*


*ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం_ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏ రోగాలతో అత్యధికంగా చనిపోతున్నారు అనే విషయాలని ఎన్నో సార్లు వెల్లడించింది. అందులో ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో అత్యధికంగా ప్రజలు చనిపోతుంటే..రెండవ స్థానం మాత్రం చెక్కెర వ్యాధితో ప్రజలు చనిపోతున్నారని తేల్చి చెప్పింది. * 


*ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని, దీని ప్రభావానికి చిన్న పిల్లలు సైతం లోనవుతున్నారని తెలిపింది.*


*అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఈ షుగర్ లెవిల్స్ కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని అంటున్నారు నిపుణులు.* 

*మరి షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడం ఎలా…?*


*షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడానికి జామకాయలు ఎంతగానో ఉపయోగ పడుతాయి.*


*వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.* 


*జామకాయలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో  షుగర్ లెవిల్స్ ని చెక్ చేస్తుంది. జామలో ఉండే గ్లైకమిక్ ఇండెక్స్ తొందరగా అరగనివ్వవు.* 


*దాంతో రక్తంలో గ్లూకోజ్ లెవిల్స్ ఒక్క సారిగా పెరగకుండా ఉంటాయి.* 


*ఫలితంగా బ్లడ్ లో లెవిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే వైద్యులు డయాబెటిస్ రోగులకి జామకాయలు ఎక్కువగా తీసుకోమని సూచిస్తారు.*


*అంతేకాదు బరువు తగ్గాలని అనుకునే వారు కూడా జామకాయ తినవచ్చు ఎందుకంటె జామకాయలో కేలరీస్ తక్కువగా ఉంటాయి. అత్యధిక బరువు ఉన్న వారికి కూడా షుగర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా కాబట్టి జామ కాయ తినడం ద్వారా బరువు తగ్గి వివిధ వ్యాధుల నుంచీ కాపాడుకోవచ్చు.* 


*షుగర్ ని కంట్రోల్ లో ఉంచడానికి సోడియం, పొటాషియం రెండూ కావాలి ఈ రెండూ జామకాయలో పుష్కలంగా లభిస్తాయి. “సి” విటమిన్ కోసం అందరూ నిమ్మకాయ, నారింజ తినాలని అంటారు.  కానీ జామకాయలో “సి విటమిన్” నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది.* 


*డయాబెటిస్ ఉన్న వారికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. జామలో   రోగ నిరోధక శక్తిని అందించే కారకాలు లెక్కకి మించే ఉంటాయి.*✍️

                                     ….సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                                                                                                                                   

      *అద్భుతం ఖరీదు.. ₹.83/-*

                  ➖➖➖✍️

                                                               *ఒక చిన్నబాబు అతని పిగ్గీబ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్కపెడుతున్నాడు.*


*చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు. మూడుసార్లు లెక్కపెట్టాడు.*


*తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు..*

*ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండీ వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు..*


*షాప్ లో ఆవిడ తనవేపు చూసేవరకు ఎదురుచూస్తూ నుంచున్నాడు...*

*షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది.. “ఏమి కావాలి బాబు” అని.* 


*బాబు చెప్పాడు..*

*“నాకు ఒక అద్భుతం కావాలి” అని.*


*షాప్ ఆవిడ అర్ధం కానట్టూ “ఏంటి బాబు సరిగ్గా చెప్పవా” అని అడిగింది.*


*“నాకూ సరిగ్గా తెలీదు..కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు కదా..నాన్న అంటున్నారు ‘ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు’  అని. చెల్లి చాలా కష్టపడుతోంది. అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కుని వెళ్దామని..అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది.” అని అడిగాడు బాబు.*


*ఆవిడకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు..*

*“ఇక్కడ అద్భుతాలు అమ్మము బాబు” అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది. బాబు మాటలకి విషయం అర్ధం అయ్యి ఆవిడకి బాధేస్తోంది....*


*”నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు.. అవి చాలకపోతే నేనింకా డబ్బులు తెచ్చిస్తాను.” అని బతిమలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు...*


*ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న పొడుగ్గా ఉన్న, మంచిగా తయారయ్యి ఉన్న, హుందాగా ఉన్న ఒకాయన బాబుని అడిగారు...“ఏమిటి నీ చెల్లి సమస్య, నీకు తెలుసా?” అని ...*


*బాబు చెప్తున్నాడు..”చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతోందంటా.. అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు, అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది. అని నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను... సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేసాను, కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను..” అని చెప్తుంటే బాబుకి తెలీకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్ళు జారుతున్నాయి....*


*ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు.. ”నీ దగ్గర ఎంత డబ్బు ఉందీ!” అని..*


*బాబు చెప్పాడు..“83 రూపాయలు” అని...అదీ వినపడి వినపడనట్టు..*


*”ఓ అవునా ...తమాషా చూడు నీ చెల్లికి కావాల్సిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే. ఏదీ పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలికి సాయపడగలదేమో చూద్దాం..” అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకుని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం.*


*ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్ కి డైరెక్టర్. ఆయన ఒక్కరే చిన్నిపాప సమస్యకు వైద్యం చెయ్యగలరు...*


*ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కరలేకుండానే ఆపరేషన్ జరిగింది...తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది.* 


*తల్లి అంటోంది...*

*“ఎంత అద్భుతం జరిగిందీ అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కరలేకుండానే” అని తండ్రితో అంటోంది.*


*అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు...ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలు అని...*

*కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్ని బాబు అపార విశ్వాసం...*

*కల్మషం లేని ప్రేమ, స్వార్ధం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి.. దేవుడిని నమ్ముకున్నవారికి ఏదో ఒక రూపేణా తప్పక సాయం అందుతుంది.*

*అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వం రూపంలో...*

*మనిషికి మనిషి సాయం చెయ్యాలి, అని అనుకోవాలి, అంతే........!* ✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     

*మనం..*

       *నడుస్తున్న శవాలమా..?*

                 ➖➖➖✍️


*మనిషి సుఖభోగాలను అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. మామూలుగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు.* 


 *జీవితం కష్టసుఖాల సంగమం. కష్టాల్లో సైతం మద్యపాన వ్యసనానికి దాసులైన వారికి భగవంతుడు జ్ఞప్తికి రాడు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు వీళ్లు.* 


 *”జాతస్యహి మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతీ జీవినీ ప్రతీక్షణం మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. కనుక వ్యర్థంగా కాలంగడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఉత్కృష్టమైన మానవజన్మ ఎత్తికూడా అనివార్యమైన భగవత్ప్రేమకు పాత్రులు కాకపోవడం ఆత్మహత్యా సదృశం.*


*అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. అది ఇసుమంతైనా లేకపోగా..  ”ఏమి తిందామా! ఏమి త్రాగుదామా!” అనే యావతో జీవితాన్ని వృథా చేసుకునే వాళ్లకెంత ఆయుష్షుంటే ఏం లాభం? అది హారతికర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కదా!*


*ఈశ్వరోపాసనకి పూజ,  ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి  కర చరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివి. లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడంకోసమే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖంకోసం గాని, సంసార బంధ విముక్తులు అవడానికిగాని యత్నించరు. కాగా “ఎవరినెట్లా పీడించాలా?”అనే పైశాచిక ప్రకృతిని ఒంటబట్టించుకుంటున్నారు. అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవజన్మ వ్యర్థవౌతోంది.*


*ఆత్మను పోషించుటకు, రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్యసాధనమనేమాట నిర్వివాదాంశం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుణ్ణి తలంచని వాణ్ణి ఆ దేవుడు కరుణించడు. ముక్తినివ్వడు. పండితులు, భాగవతులు తమ గానం చేత, పూజాది సత్కర్మలచేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్తుతిస్తారు.*


*రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యంకానప్పుడు సత్పురుష సాంగత్యమైనా చెయ్యాలి. అది కూడ దుర్లభం అనుకుంటే తన దుష్టప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి. అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరం. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే తప్ప పొట్టకూటికోసం విద్యలుకావని గ్రహించాలి. ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు.*


*మనమంతా పుణ్యంకోసం నదీస్నానాలు, గుళ్ళు గోపురాల దర్శనం చేస్తుంటాం. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే గాని ఆత్మశుద్ధికి తోడ్పడవు. వాటన్నిటికంటె ముందు శుభకర్మల్ని ఆచరించాలి.     పరోపకారం,                          సత్యం పలకడం, భూతదయ, సత్‌సాంగత్యం, దానాదిక ధర్మాలు, ఈశ్వర స్తుతి వంటి ఉత్తమగుణాలే శుభకర్మలు అనబడతాయి. శుభకర్మలు చేసేందుకు అలవాటుపడని వాళ్ళంతా ఈ భూమ్మీద నడుస్తున్న శవాలే.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



          *హరే కృష్ణ అంటే ఏంటి?*

                  ➖➖➖✍️


*మనం తరుచూ భగవంతుడియొక్క ఈ నామాన్ని వింటూ ఉంటాం. హరే కృష్ణ అంటే కేవలం ఎదో ఒక మతం వాళ్ళకో, ఒక సంస్థకో, కొంతమంది భక్తులకో సంబంధించినది కాదు. కలియుగంలో సమస్త మానవాళిని ఉద్దరించేసే భగవానుడియొక్క దివ్య మంత్రం.*


*ఇద్దరు భక్తులు కలిసినపుడు ఒకరినొకరు ‘హరే కృష్ణ’ అంటూ పిలుచుకుంటూ ఉండటం సాధారణంగా చూస్తూ ఉంటాం. అసలు హరే కృష్ణ అంటే ఏంటో ఒకసారి చూద్దాం…*


*’హరి’ అంటే తేలికైన అర్ధం ఏంటంటే ఎటువంటి పాపములనైనా, ఎటువంటి దోషములనైనా హరించగలిగినవాడు,* 


 *’కృష్ణ’ అంటే భగవంతుడు, సర్వ జగన్నియామకుడు. ‘క్రిష్’ అంటే అనిర్వచనీయమైన ఆనందం (మోక్షం), అటువంటి మోక్షాన్ని ప్రసాదింపగలవాడు కాబట్టి ఆయన్ని ‘కృష్ణ’ అంటారు.* 


*సృష్టిలో కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. కానీ ‘పంచమహా పాతకాలు’ అంటే బ్రాహ్మణ హత్య, బంగారం దొంగతనం చెయ్యటం, మందు తాగడంలాంటి మహా పాతకాలులాంటి వాటికి ప్రాయశ్చిత్త కర్మలు లేవు.* 


*యోగి అయినా, జ్ఞాని అయినా, ఎంతటి గొప్పవారైనా ఆ ప్రారబ్ధ కర్మలు మాత్రం అనుభవించవలసిందే.*


*సృష్టిమొత్తం మీద అలా పోగొట్టగల నామం ఏదైనా ఉంది అంటే అది కేవలం ‘కృష్ణ’ నామం మాత్రమే,  కృష్ణ కథలు మాత్రమే! అందుకే ప్రత్యేకంగా భాగవతాన్ని తీసుకొనివచ్చారు వ్యాసులవారు.* 


*కలియుగంలో కేవలం ‘భాగవతం’ చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన, కృష్ణ నామం స్మరించినంత మాత్రాన పంచ మహాపాతకాలే కాదు సమస్త పాపరాశి ధ్వంసమై కృష్ణలోకమైన మోక్షాన్ని చేరుకుంటారు. *


*చాలామంది భక్తులు రోజుకి కొన్ని వేలసార్లు కృష్ణ నామం పారాయణం చేస్తూ ఉంటారు. జననమరణ చక్రం అనే సంసార సముద్రంలో నావ వంటిది ‘హరే కృష్ణ’ నామం.* 


*"కోట్లజన్మల తర్వాత ఏ ఒక్కడో మాయాపూరితమైన జగత్తుని వదిలి నన్నే స్మరించుకుంటూ నాకు దాసుడవుతున్నాడు. అటువంటి వాడియొక్క యోగక్షేమాలు నేనే వహిస్తున్నాను” అని భగవద్గితలో(7.19) కృష్ణుడు మనకి అభయం ఇచ్చారు.*


*అలా ఆ పరాత్పరుడియొక్క ‘హరేకృష్ణ’ నామాన్ని ప్రతిరోజు స్మరించుకోవడం మన జన్మజన్మాంతరంగా కలిగిన అదృష్టం.* 


*అందునా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ‘సోషల్ మీడియా’ ద్వారా ఆధ్యాత్మిక గ్రూపులలో ప్రతిరోజూ కృష్ణ నామాన్ని స్మరించుకోవటం, కృష్ణుని  చిత్రపటాలని చూడటం కూడా ఆధ్యాత్మికతలో, భక్తిలో ఒక భాగమే. ప్రతిరోజు క్రింద ఉన్న కృష్ణ మంత్రాన్ని  స్మరించుకోవడం ఉత్తమం.*


*హరే కృష్ణ హరే కృష్ణ *

*కృష్ణ కృష్ణ హరే హరే *

*హరే రామ హరే రామ*

*రామ రామ హరే హరే * (108 సార్లు)


*కర్మఫలితంగా ఎటువంటి ఆపదలు మనల్ని, మనకుటుంబ సభ్యులను  భాదించకుండా ఉండాలని, కృష్ణపరమాత్మ మనల్ని అనుగ్రహించాలని ఆయన పాదపద్మములను నమస్కరిస్తూ... 

✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*సనాతన..*

                   *ధర్మ రక్షణ!*

                   ➖➖➖✍️



*సనాతనధర్మాన్ని రక్షించడమంటే అసలు అర్ధమేమిటి? *


*ఎలాగైతే కాపరి పశువులను రక్షిస్తాడో అలా రక్షించడమా?*


*కాదు…*


*ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని తాను ఆచరించడం, ఇంకొకరి చేత ఆచరింపజేయడంవల్ల ధర్మం రక్షింపబడుతుంది.*


*వెనకటికాలంలో ఎంతోమంది ఎన్నోరకాల అనుష్ఠానాలు చేసేవారు . తమ పిల్లలను వేరే దేశాలకు పంపిస్తారో..లేదో...అనేది వేరే విషయం. మొట్టమొదటగా వారిని సంస్కారవంతులుగా తయారు చేసేవారు.*


*మా పిల్లలు ధనవతులు కాకపోతే ఏమైపోతారని భయపడేవారు కాదు.*


*అయ్యో ! మా పిల్లలు సంస్కారహీనులైతే ఏమైపోతారు? అని ఆలోచించేవారు.*


*ఆ సంస్కారమే వారికి అన్ని రకాల శ్రేయస్సులను అందజేస్తుంది. కాబట్టి చిన్ననాటినుండే రామాయణ, భారత, భాగవత పురన ఇతిహాసాదులన్నీ చెప్తుండే వారు. దానితో వారి మనస్సులో అద్భుతమైన సంస్కారం ఏర్పడేది.* 


*ఆ సంస్కారం చిన్నవయసులో కలిగితే, ఆ సంస్కారమే వారిచేత ధర్మాచరణ చేయిస్తుంది. అప్పుడు ధర్మాన్ని రక్షించడం అవుతుంది.* 


*మన చేత ఆచరించబడిన ధర్మం పుణ్యంగా మారి మనకు ఈ లోకంలో, పరలోకంలోనే కాక తరువాతి జన్మలకు కూడా శ్రేయస్సును, సుఖాన్ని అనుగ్రహిస్తుంది.*


*ఈ విధంగా ఆచరణతోనే సనాతన ధర్మం రక్షింపబడుతుంది.*✍️

సనాతన ధర్మస్య ధర్మో రక్షతి రక్షితః

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


*రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.


              *వాల్మీకి రామాయణం:*

                     *3 వ  భాగం:*

                     ➖➖➖✍️


రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............

పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 

3 యోజనముల వెడల్పు ఉండేది. (యోజనం అంటే = 9 మైళ్ళు) ఆ నగరం మధ్యలో రాజ ప్రాసాదంలో దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెఱకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో. ఏ ఇంట్లోను కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు.


*దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు  ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు… దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. 

వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు.

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు...........


సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |

ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||


పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు........ ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి” అన్నాడు.


అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.....   పూర్వకాలంలో విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.


వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, “రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు?” అన్నారు. 


ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... 

ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. 


రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.


ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. 


ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, “మహాపురుషులారా! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను” అన్నాడు. 


అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. 


మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. 


ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. 


సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........


తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |

వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||


ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు.


కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు...  “మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా” అని అడిగాడు. 


రోమపాదుడు ఆనందంగా పంపించాడు. 


దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.✍️

రేపు...4వ భాగం..

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

* గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[18/05, 8:54 pm] +91 94939 06277: 180523b0336.   190523-2.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀X83.



    మహాస్వామి – ముస్లిమ్ భక్తుడు

                  ➖➖➖✍️



    కంచి కామకోటీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పండరీపురంలో మకాం చేస్తున్నారు.     


     వారి దర్శనం కోసం మేము అక్కడికి బయలుదేరాము.     మేము ఎక్కిన రైలు పండరీపురం చేరుకుంది. 'చంద్రభాగా' నది ఆవలి ఒడ్డున  ఒక చిన్న మఠంలో బస చేస్తున్న పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళడానికి ఎలాగా అని మేము ఆలోచిస్తూ నిలుచున్నాము.


       ఆ రోజుల్లో టాక్సీలు అవి ఏవి లేవు. అప్పుడు ప్రయాణ సాధనం      గుర్రపు బండి మాత్రమే.  నా కళ్ళు  ఒక  టాంగా వాడి మీద పడ్డాయి.       చూడడంతోనే అతను మహమ్మదీయుడు అని  తెలిసి పోవడం వల్ల    స్వామి వారి గురించి... అతనికి తెలిసి ఉండదని వేరొక టాంగా కోసం వెతికాను.    అక్కడ అతను తప్ప ఎవరూ లేక పోవడంతో వెళ్ళి అతనితో, “శంకరాచార్య స్వామి వారు ఎక్కడ బస చేసి ఉన్నారో నీకు తెలుసా....?”    అని అడిగాను. 


       అతను “కంచి పెరియవనా? వారు తెలియకేం.... చాలా   బాగా   తెలుసు. మిమ్మల్ని   అక్కడికి  తీసుకుని వెళ్తాను. ఆయన మాకు అల్లా”  బదు లిచ్చాడు. 


          నేను కొంచం ఆశ్చర్యపోయి, సరే పదమన్నాను.


                మేము స్వామి వారున్నచోటికి చేరుకున్నాము. ఆ టాంగావాలా   మాతో డబ్బు తీసుకోవడానికి   నిరాకరించాడు. అతను  సరాసరి  పరమాచార్య  స్వామి వారు   కూర్చుని ఉన్న  చోటికి  మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు.   అతను ఆనందం తో,        తల్లి దగ్గరికి నెలల బిడ్డ వెళ్ళిన చందంగా....  స్వామి వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు.  అది అతనికి ఈ జన్మకు లభించిన హక్కు కాబోలు, పరమాచార్య స్వామి వారు  కూడా      ఏమి మాట్లాడ లేదు.      స్వామి వారికి    మమ్మల్ని.... పరిచయం చేసాడు.     

 

    తరువాత తను మాతో, ”వీరు వచ్చిన నాటినుండి   మా జీవితాలు     ధన్యమ య్యాయి.   తాగుడు మొదలైన  వ్యసనా లను త్యజించాము”       అని అన్నాడు. 


            అతను కళ్ళారా చూసిన ఒక సంఘటనని మాతో పంచుకున్నాడు.

"చంద్రభాగా నది ఎగువ ప్రాంతంలో... వర్షాలు ఎక్కువై     నదికి     వరదలు... వచ్చాయి.     ప్రమాదపు అంచులో నది ప్రవాహం ఉంది.    ఆరోజు స్వామివారు  నిద్రలేచారు.    వరద ఉధృతి ... ఎక్కువగా ఉంది... వెళ్ళొద్దని అందరూ బ్రతిమాలుకున్నా స్వామివారు స్నానానికి నదికి వెళ్ళారు.       నదిలోకి వెళ్ళి వారి దండాన్ని ఒకచోట నిలబెట్టారు. ఆశ్చర్య కరంగా వరదనీరు ఆదండం దరిదాపు ల్లోకి కూడా రాలేదు.        అక్కడినుండి వరద వెనుకకు   వెళ్ళనారంభించింది. నేను కూడా నదిలో స్నానం చేసాను.

దీనికి  నేను ప్రత్యక్ష సాక్షిని.....”      అని భావోద్వేగంతో   చెప్పాడు   ఆ సాధారణ ముస్లిమ్ భక్తుడు.


                         ➖➖


      [ఆదిశంకరాచార్యుల వారు గురువు అన్వేషణలో భాగంగా....     నర్మదానదీ పరీవాహక ప్రాంతానికి    వచ్చినప్పుడు, నదికి వరద వచ్చింది.         వారు తమ కమండలంలో ఆ వరద నీటినంతటినీ పట్టి, వరద ముంపు నుండి కాపాడారు. 


      అలా చేసినవాడే   నీకు శిష్యుడై...., జగద్గురువై సనాతన ధర్మాన్ని     ఉద్ధరి స్తాడని       గోవిందభగవత్పాదులకు.... చెప్పారు.]


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


http://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

 *శుభోదయం*


💐🙏💐🙏💐


*అన్వేషణ నా కర్తవ్యం*


*ఆలోచన నా నైజం* 


*ఆవేదన నా కర్మ ఫలం*

 

*అనురాగం నా బంధనం*


*ఆత్మీయత నా  గుణం*


*ఆక్రోశం నా దుఃఖం*


ఇవన్నీ *నాకు* కలిగేవి.


*ఆనందం  నా లక్షణం.*

  

*ఆనందం నా స్వభావం.*

 

ఇది *నాలో* ఉండేది.




*Sri panjarla Mahindra Reddy*


*హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేయడానికే*

*బ్రాహ్మణ వ్యతిరేక వాదం వెనుక ఉన్న కుట్ర .*


*పరాయి మత చాందస వాద పాలకులచే మన మెదళ్లలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం అర్ధం చేసుకోవడానికి బుర్ర ఉంటే చాలు ఎవరికైనా . అపారమైన తెలివితేటలూ అవసరం లేదు . మన దేశాన్ని తుష్కర మూకలు 800 సంవత్సరాలు , క్రైస్తవ మూకలు 200 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించారు . మరి ఈ దేశంలో కొన్ని వర్గాల వారు అభివృద్ధి చెందలేకపోవడానికి పూర్తిగా బ్రాహ్మణులే కారణం అంటుంటే మన బుర్ర ఎప్పుడైనా ఆలోచించిందా?*


*మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం బ్రహ్మణేతరులు కాదా ?* *ఉదాహరణకు చంద్రగుప్త మౌర్య , శ్రీ కృష్ణ దేవరాయ , ఛత్రపతి శివాజీ , చోళులు , పాండ్యులు వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే . బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్ర గుప్తుని స్థానం ఏంటి అసలు . మన పురాణాల్లో గాని , కధల్లో గాని మనం ఏం చదువుకున్నాం ? "* *అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు . అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు . ఒకరోజు అతను అడవిలో వెళ్తుండగా.... " ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది . మరి అంత పేద బ్రాహ్మణుడు వేరే వారిపై వివక్ష ఎలా చూపించాడంటారు చెప్పండి ?*


*నేడు హరిజనులుగా పేర్కొనబడుతున్న కొన్ని కులాల వారిని నిజానికి అణచివేసింది భూస్వాములు , జమిందారులు , క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే . మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేప్పట్టే వారూ కేవలం 20% మాత్రమే ఉంటారు . ఒకసారి ఆలోచించండి . మన స్నేహితుల్లో ఉన్న బ్రాహ్మణుల్లో ఎంతమంది అర్చక వృత్తి చెప్పట్టారో. నా స్నేహితుల్లో అర్చక వృత్తిని చేపట్టిన వారు 2 ,3 ముగ్గురు తప్పించి ఎవరూ లేరు.*


*మేధావులు చెప్పినట్టు బ్రాహ్మణులకు మాత్రమే వేద విద్య అనుకుంటే నేడు మనకు ఆది కావ్యమైన రామాయణం ఉండేది కాదు . హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీత , పురాణాలు , మహా భారతాలే ఉండేవి కాదు . వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు . ఎప్పటి సంగతో ఎందుకు హిందూ ధర్మ రక్షకుడు అయిన స్వామీ వివేకానంద బ్రాహ్మణుడు కాదు.* 


*చరిత్రలో బ్రాహ్మణులపై దాడి :*


*హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో వేల మంది బ్రాహ్మణులను , వారి పిల్లలను నరికి చంపి దూరంగా కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముష్కర చక్రవర్తి ఔరంగజేబు . ఆ బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు ఆ క్రూరుడు .*


*క్రైస్తవ సన్యాసి సెయింట్ జేవియర్ పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం రాసాడు . దాని సారాశం ఏమంటే " బ్రాహ్మణులను లేకుండా చేస్తే  భారతీయులందరూ తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు " అని . అర్ధం అయ్యింది కదా . బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న అసలు కుట్ర ఇదీ . వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో . దీనినే మనం "Goa Inquisition" పేరుతో చరిత్రలో చదువుకుంటాం .*


*మైసూరు ప్రాంతం మేల్కొటేలో దీపావళి రోజున 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్ . అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు .*


*ఇక కాశ్మీరీ పండిట్ల సంగతి తెలియనిది ఎవరికీ . మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపుతున్నారు వేలాది మంది కాశ్మీరీ పండిట్లు . ముష్కర జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 500000 మంది.*


*మీకు తెలుసా కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో అధిక శాతం బ్రాహ్మణులే .  ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీలుగా పని చేసేవారిలో 50% బ్రాహ్మణులే . ఆంధ్ర ప్రదేశ్లో వంట పని వారుగా పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే . ఈ బాధలు పడలేకే చదువుకున్న బ్రాహ్మణులు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ అక్కడ మన సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు.*


*బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల , మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది . వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు . కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం . ఇదే వారి సిద్ధాంతం . నేటికి కూడా ఇలా వ్యతిరేక సిద్ధాంత్తాన్ని కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ మొదలైన చాలా పార్టీ వాళ్ళు వెనక ఉండి నడిపిస్తున్నారు . దయచేసి ఎవరు వారి ఉచ్చు లో పడకండి , మీ ధర్మాన్ని చరిత్ర ని తెలుసుకోండి , ధర్మంగా జీవించండి .*

*జై శ్రీ రామ్ జై భారత్ భారత్ మాతాకీ జై జై హింద్*

*ఇట్లు*

*మీ పెంజర్ల మహేందర్ రెడ్డి*

*అఖిల భారత ఓసి సంఘం*

*మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్*

 *జాతీయ అధ్యక్షుడు*

*జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: