*శ్లో||అంగం గళితం ఫలితం ముండం౹*
*దశన విహీనం జాతం తుండం ౹*
*వృద్ధో యాతి గృహీత్వా దండం ౹*
*త దపి న ముంచ త్యాశా పిండమ్ ౹౹*
*భా|| మానవుడు తన జీవితం క్షణికమని , సిరిసంపదలు చంచలములని తెలిసికూడా ఆశాపాశానికి బద్ధుడవుతున్నాడు.*
*అవయవాలు చిక్కి శల్యమై శిథిలమై పోతున్నాయి. తల పెరుగు బుట్ట అవుతున్నది, పళ్ళు క్రమ క్రమంగా ఊడి పోతున్నాయి, నోరు పట్టుతప్పి తినలేని పరిస్థితిలో ఉన్నది. ముసలితనం మీదపడి మూడవ కాలులా కఱ్ఱ చేతిని అలంకరించింది.*
*అయినా మనిషికి "ఆశ" చావడం లేదు. భార్యాబిడ్డలపై మమకారం తగ్గడం లేదు. ధన కనక రాసులపై మోజు వీడడం లేదు. ప్లాట్లు, ఫ్లాట్లు ఇక చాలు అనే తృప్తి కలగడం లేదు. ఇంకా ఏదో సాధించాలనే తపన ఎక్కువవుతున్నది. అదేపనిగా ఆశాప్రవాహంలో కొట్టుకొని పోతున్నాడు.*
*మోక్షసాధనకై "రామ" , "కృష్ణ" అనే భగవన్నామాన్ని మనసారా ఒక్క నిమిషంపాటు గానం చేసే తీరిక , కోరిక , ఓపిక మనిషికి కనబడడం లేదు.*
*ఆశ అంత బలీయమైనది. సమర్థవంతమైనది. మేధాసంపన్నులను కూడా కాలు జారి బోర్లా పడవేయగల మహత్తర శక్తి "ఆశ" కున్నది... తస్మాత్ జాగ్రత్త సుమా! .🙏🏻*
*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి