*హైందవం వర్ధిల్లాలి 17*
*హైందవాన్ని కించపర్చే నాస్తిక వాదాన్ని కట్టడి చేయాలి* :- ఆస్తికత్వము, నాస్తికత్వము అను రెండు పదాల అర్థాలను ఒకసారి గమనిద్దాము. *ఆస్తి* (అస్తి)అంటే కలది, కలవాడు. *వేదాలను* అనుసరించే వాడు. *నాస్తి* (నః +అస్తి) అంటే లేదు, లేడు. అంటే వేదాలను ఒప్పుకొనివారు. 1) *ఆస్తికులు* = *ఈశ్వర వాదులు* = దేవుడి దయవల్లే ప్రతి విషయం అంటే పుట్టుక నుంచి మరణం వరకు, మరియు జీవితంలో సంభవించే ఘటనలు, సంఘటనలు అన్ని కర్మఫలాలు అని నమ్మేవారు. 2) *నాస్తికులు* = *నిరీశ్వరవాదులు* = వేదాలను నమ్మని వారు = ఒప్పుకోని వారు. పైపెచ్చు వేదాలను ధిక్కరించువారు. 3) ఇంకొక వాదం *తటస్థ వాదం* వీళ్లకు దేవుడున్నాడని భావనకు ప్రాముఖ్యత లేదు. అలాగని అస్తికత్వాన్ని ఖండించరు గూడా, వీరు భౌద్దులు, జైనులు, చార్వాకులు = చార్వాకం అనుసరించే వారు. (మహా భారతం లోని చార్వాకుడు వేరు అతను రాక్షసుడు.)
ఒకసారి ఆస్తికత్వము కల్గిఉన్న హిందు మత విషయాన్ని పరిశీలిద్దాము. హైందవము ఒక మతమే కాదు తత్వము, జీవన విధానం కూడా. హిందూ మతము ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఆస్తిక (ఈశ్వర) వాదము వలన మానవునికి చక్కని జ్ఞానము సిద్ధిస్తుంది. ఆ జ్ఞానము సకల మానవాళికే మాత్రమే కాకుండా విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం, శాంతి మరియు సమైక్యతకు సంపూర్ణంగా తోడ్పడుతుంది. *అసలు మానవాళికి, విశ్వ శాంతికి ఇంతకంటే ఏమి కావాలి*.
శాంతి సౌభాగ్యాలు ఒనగూర్చే ఈశ్వర (ఆస్తిక) వాదం శ్రేష్టమా ! లేక మిధ్యా వాదాన్ని ప్రచారం చేసే నిరీశ్వర (నాస్తిక) వాదం ఉత్తమమా, *ప్రజలే చెప్పాలి*. భారత దేశంలాంటి కర్మ భూమిలో జన్మించి నాస్తికులుగా ఉండడం మామూలు విషయం కాదు.
నాస్తిక వాదులు తమ పరిధిలో తాముండక, ఈ దేశంలో అధిక సంఖ్యాకులు అభిమానించే, ఆరాధించే ఈశ్వర తత్వంపై, హేతువాదం ముసుగులో అవాకులు, చెవాకులు, చెణుకులు విసురుతుంటారు, బహిరంగంగా వితండవాదం చేస్తుంటారు, చేస్తున్నారు, *తద్వారా అధిక సంఖ్యాక ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వదురుతుంటారు*. *వీళ్లకాహక్కెక్కడిది*,
వీళ్ళు ఎక్కడెక్కడ ఏమి మాట్లాడుతుంటారు, వివరాలు ఇక్కడ ప్రస్తావించి *వీరి ఉనికికి ప్రాముఖ్యత పెంచాలని లేదు*.
హిందూ సమాజం వీరిని ఒక కంట జాగ్రత్తగా కనిపెడ్తూఉండాలి. కీర్తి కండూతితప్ప, వీరి అసంబద్ధ, అవాస్తవ, అపసవ్య, అర్థరహిత ప్రేలాపనలు అవసరాన్ని బట్టి అరికట్టాలి. అప్పుడప్పుడు వీరి వాదనల పట్ల సమాజం ఎదురు తిరిగినా, గుణ పాఠం చెప్పినా వీరి ధోరణిలో మార్పు ఎండమావుల లాంటిది.
*ఆస్తికత్వంపై నమ్మకం లేకుంటే వారి మానాన వారు ఉండవచ్చును కాని, సమాజంలో శాంతి భద్రతలకు హాని కలిగించే మనస్తత్వం సహించరానిది*. *కావున మన హిందు ధర్మానికి, సంస్కృతికి ఉపిరులుూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి