1, అక్టోబర్ 2024, మంగళవారం

పూర్తి శ్లోకాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐              

     *బుద్ధిః కర్మానుసారిణీ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం :~*


*సత్యాను సారిణీ లక్ష్మీ*


*కీర్తి: త్యాగాను సారిణీ*


*అభ్యాసాను సారిణీ విద్యా*


*బుద్ధి: కర్మాను సారిణీ.।*


*భావము:~*


*లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుసరించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలాగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !*


*రాముడంతటి వాడికి తెలియదా బంగారు జింక భూమి మీద లేదని. చెడు కాలం వచ్చినప్పుడు కొన్ని అంతే మన ఆధీనంలో ఉండవు చెడు ఆలోచనలు చెడు బుద్దులు కలుగుతాయి..!!*


*“బుద్ధిః కర్మానుసారిణీ” అనుభవించాల్సిన కర్మ ఫలానికి తగ్గట్టుగా బుద్ధి ప్రవర్తిస్తుంది. అంతే. ఇందులో మంచి చెడుల ప్రసక్తి లేదు.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: