1, అక్టోబర్ 2024, మంగళవారం

సిరికిం జెప్పఁడు

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *సిరికిం జెప్పఁడు..*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్రీనాధుడు పోతనగారి భాగవతం లోని " సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపడు " అని చదివిన తరువాత పోతనతో ఏమిటి బావ ఈ పద్యం ..*


*సిరికిం చెప్పడంట .. శంకు చక్రం ధరించుట లేదంటా .. ఎవర్ని తోడూ తీస్కుని వెళ్ళడం లేదంటావు, ఏమిటి బావ ఇది ఆయనేమన్నా వేడుక చూడ్డానికి వెళ్తున్నాడా ? అని పోతనతో శ్రీనాధుడుఅంటూ ఉండగా .*


*పోతనగారి భార్య అన్నయ్య రండి భోజనం చేద్దురుగాని అనడటంతో ఇద్దరు భోజనానికి కూర్చుని భోజనం చేస్తున్నారంట.*


*ఈ లోపు బావిలో ఏదో పడిన నీటి శబ్దం వచ్చింది . ఆ వెంటనే మామయ్యా సరస్వతి* *(సరస్వతిశ్రీనాధుడు కుమార్తె) బావిలో పడిపోయింది .. రండి రండి అంటూ కేకలు వినిపిస్తూ ఉండేటప్పడికి*


*భోజనం చేస్తున్న శ్రీ నాధుడు వెంటనే లేచి బావి చుట్టూ సరస్వతి సరస్వతి అంటూ పిలుస్తూ ఉండగా…*


*పోతనగారి అబ్బాయి ‘మామయ్య సరస్వతికి ఏమి కాలేదు .నేనే బావిలో రాయి వేసాను . ఐన మామయ్య బావిలో ఉన్న మీ అమ్మాయిని రక్షించడానికి వస్తున్నారు అని తెలిసి కూడా ఎవర్ని పిలవలేదు .. కనీసం ఒక తాడు కూడా తీస్కుని రాలేదు . ఆ చేతిని కూడా కడగకుండానే వచ్చసారేం అని అడిగేసరికి.*


*"సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ;" పద్యం ఎందుకు అలా రచించారో అర్ధం అయి ‘నిజమే మానవులకు మనకే ఇంత ప్రేమ ఉంటే ..భగవంతుడికి ఇంకేంత ప్రేమ ఉండాలి అని నాకు బాగా అర్ధం అయ్యేలా చెప్పావ్ రా’ అని నవ్వి లోపలకి వెళ్లారాంట.*


*పోతన గారి పద్యం:~*


*సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింప డే*


*పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం*


*తర ధమ్మిల్లము జక్క నొత్తడు; వివాదప్రోత్థిత శ్రీకుచో*


*పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై।*


*భావము:~*


*గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.*


*శుభం భూయాత్,*


*సర్వే జన సుఖినో భవంతు।*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: