*లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం*
*పది వాక్యాలలో...*
1. *మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు... వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు.*
ఉదా: *"కౌరవులు."*
2. *నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ... ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ... వాటిని "అధర్మం కోసం వినియోగిస్తే"... అవి నిరుపయోగమవుతాయి. నువ్వు కూడ వినాశనం అవుతావు.*
ఉదా: *కర్ణుడు*
3. *యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే "వినాశం" జరుగుతుంది.*
ఉదా:*అశ్వత్థామ.*
4. *పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.*
ఉదా:*" భీష్ముడు."*
5. *సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము "దురహంకారం" తో "అధర్మంగా" వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి "వినాశం" జరుగుతుంది.*
ఉదా: *"దుర్యోధనుడు "*
6. *స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా "తనవారి పట్ల వల్లమాలిన అభిమానం" గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.*
ఉదా: *ధృతరాష్ట్రుడు*
7. *శక్తి యుక్తులకి, తెలివితేటలకి ధర్మం" తోడైతే "విజయం" తప్పక లభిస్తుంది.*
ఉదా: *అర్జునుడు.*
8. *ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం.*
ఉదా: *శకుని*
9. *నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు.*
ఉదా: *యుధిష్ఠిరుడు*
10. *అందరి బంధువైనా... అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా.*
ఉదా: *శ్రీకృష్ణుడు*
*కోటి కథల, లక్షల వ్యధల, వేల ఉప కథల, 100 మంది శత్రువుల, 5గురు మిత్రుల (అందరు సోదరులే)...*
*నాలుగు ధర్మాల సారాంశము భారతం*
📖🙏📖 🙏📖🙏 📖🙏📖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి