*జై శ్రీమన్నారాయణ*
16.02.2025,ఆదివారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
మాఘ మాసం - బహుళ పక్షం
తిథి:చవితి రా12.23 వరకు
వారం:(భానువాసరే)
(ఆదివారం)
నక్షత్రం:హస్త తె3.02 వరకు
యోగం:ధృతి ఉ7.17 వరకు
కరణం బవ ఉ11.25 వరకు
తదుపరి బాలువ రా12.23 వరకు
వర్జ్యం:ఉ9.52 - 11.38
దుర్ముహూర్తము:సా4.25 - 5.11
అమృతకాలం:రా8.26 - 10.12
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.31
సూర్యాస్తమయం:5.57
పుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చరాచరాలకూ అలాగే ఉంటుంది. చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది. నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకొని ముందుకు ప్రవహిస్తుంది.
అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి. వీలుకానప్పుడు పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. దానికీ మరణభయం ఉంటుంది. ఆయుష్షు తీరేదాకా బతకాలన్న బలమైన వాంఛా ఉంటుంది.
ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగం అవుతుంది. వాస్తవానికి అది సార్వజనీనం! జీవన పయనం- ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదే ప్రధానం. జీవచైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి