16, ఫిబ్రవరి 2025, ఆదివారం

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (52)*


*గభస్తినేమిః సత్త్వస్థః*

*సింహో భూత మహేశ్వరః ।*


*ఆదిదేవో మహాదేవో*

*దేవేశో దేవభృద్గురుః ॥* 


*ప్రతి పదార్థం:~*


*487) గభస్తినేమి: - నీతిమంతమైన చక్రాయుధమును ధరించినవాడు*


*488) సత్వస్థః: - అందరిలో ఉండువాడు; భక్తుల హృదయములందు వసించువాడు .*


*489) సింహః: - సింహం వలె పరాక్రమశైలియైనవాడు ; శ్రీ నృసింహ మూర్తి, అనంత శక్తిసంపన్నుడు*


*490) భూతమహేశ్వరః: - సర్వ భూతములకు ప్రభువైనవాడు.*


*491) ఆదిదేవః: - సృష్టికి ఆది అయిన దేవుడు; తొలి దేవుడు*


*492) మహాదేవః: - గొప్పగా క్రీడించువాడు; గొప్ప దేవుడు.*


*493) దేవేశః: - దేవతలకు కూడా పాలకుడు; దేవదేవుడు.*


*494) దేవభృత్ -గురుః: -  దేవతల అధిపతి అయిన ఇంద్రునకు గురువు.*


*495) గురుః:- గురువు. వేదముల రూపమున జ్ఞానం అంతటికిని మూలము.*


*తాత్పర్యం:~*


*కిరణచక్రము యొక్క మధ్యభాగమునందు సూర్యరూపమున విలసిల్లువాడును, సత్త్వగుణమునందు ప్రతిష్టితుడై యున్నవాడును, సింహం వలె పరాక్రమశైలియైనవాడును, సమస్తభూతజాలములకు అధిపతియును, అందరి దేవతలకంటే ముందుగా నున్నవాడును, పరమశివుడును, దేవతల కందరకును ప్రభువైనవాడును, దేవతలందరికి అధిపతియైనవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం భవతు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌        *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*హస్త నక్షత్రం 4వ పాదం జాతకులు పై 52వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

కామెంట్‌లు లేవు: