13, మార్చి 2025, గురువారం

పంచ ప్రాణాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

          *పంచ ప్రాణాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ప్రతి మానవుని దేహంలో ఐదు రకముల వాయువులుంటాయి:*


*(1) ప్రాణం (2) అపానం (3) సమానం (4) ఉదానం, (5) వ్యానం. వీటిని పంచప్రాణాలని పిలుస్తారు.*


*హృది ప్రాణోగుదేపానః*

*సమానోనాభిమండలే |*

*ఉదానః కంఠ దేశేస్యాద్*

*వ్యానః సర్వశరీరగః ||*


*ప్రాణవాయువు హృదయంలో, అపానవాయువు మూలాధారంలో, సమానవాయువు నాభిలో, ఉదానవాయువు కఠంలో, అలాగే వ్యానవాయువు దేహమంతా నెలకొని ఉంటుంది.*


*నిజానికి వాయువు ఒకటే అయినా, పలు ప్రదేశాలలో పలు పనులతో పలు పేర్లను కలిగి ఉంటుంది.*


*ప్రాణవాయువు హృదయం నుండి నాసిక (ముక్కు) వరకు సంచరిస్తుంది. ఈ సంచారం రోజుకు 21600 సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసాల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాణవాయువు సంచారంతోనే శరీరం జీవించి ఉంటుంది లేకపోతే అన్ని క్రియలు ఆగిపోయి, మనషి మరణిస్తాడు. ఈ ప్రాణవాయువు ఊర్థ్వముఖం (పైకి) గా ప్రయాణిస్తుంది.*


*గుద (పీఠ) స్థానంలో నెలకొన్న అపానవాయువు మలమూత్రములను బయటకు పంపే పనిని చేస్తుంది. ఇది అధోముఖంగా (క్రిందకు) ప్రయాణిస్తుంది.*


*నాభి (బొడ్డు)లో ఉండే సమాన వాయువు మనిషి తిన్న అన్నం యొక్క రసమైన రక్తాన్ని అన్ని అవయవములకు వాటి పనులను మరియు స్థాయిని బట్టి సమానంగా పంచుతుంది.*


*ఉదానవాయువు కంఠ భాగంలో ఉండి చీమిడి, కళ్ళి వంటి వాటిని దేహంలోపలి నుంచి బయటకు పంపే పని చేస్తుంది.*


*వ్యానవాయువు శరీరంలోని ప్రతినాడిలో సంచరించి రక్తప్రసరణ ప్రక్రియను సమతుల్యంగా చేసి కాపాడుతుంది, లేకపోతే పక్షవాతం వంటి రోగాలు శరీరంలోకి చేరుతాయి.*


*ఇది మనపూర్వీకులు, పెద్దలు, పండితులు ఆయా సందర్భాలలో చెప్పిన విషయం.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: